
Focus on AI tools For A Bright Future: రోజులో ఎక్కువ గంటలు సోషల్ మీడియలోనే గడిపే నేటి యువతకు పర్ ప్లెక్సిటీ సీఈఓ అరవింద్ శ్రీనివాస్ ఎన్నో కీలక సూచనలు చేశారు. ఇన్స్టాగ్రామ్ లో నిరంతరం స్క్రోలింగ్ చేయడం తగ్గించి, దానికి బదులుగా ఏఐ టూల్స్ వినియోగంలో ప్రావీణ్యం సంపాదించడంపై దృష్టి పెట్టాలని సూచించారు. కాగా ఇటీవల ఆయన జర్నలిస్ట్ మాథ్యూ టెర్మాన్ తో జరిగిన చర్చా కార్యక్రమంలో పాల్గొన్నారు. ‘ఏఐని సరిగా ఉపయోగించడం తెలిసినవారికి జాబ్ మార్కెట్లో అనేక అవకాశాలున్నాయి. వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రస్తుత ఏఐ యుగంలో కేవలం 3 నుంచి 6 నెలల వ్యవధిలోనే చాలా మార్పులు వచ్చాయని.. దాంతోపాటు పోటీ పడకపోతే ఉద్యోగాలను అందిపుచ్చుకోవడంలో వెనకబడిపోతామని అన్నారు.
అలానే ప్రముఖ టెక్ మీడియా సంస్థ ‘ది వెర్డ్ డీకోడర్’ అనే తాజా పాడ్కాస్ట్ ఎపిసోడ్ లో మాట్లాడుతూ.. పర్ ప్లెక్సిటీకి చెందిన ఏఐ కామెట్ బ్రౌజర్ మానవ రిక్రూటర్ల పనిని పూర్తిగా భర్తీచేసే స్థాయికి రీచ్ అవ్వొచ్చని అభిప్రాయపడ్డారు. ఎందువల్ల అంటే, ‘ఒక రిక్రూటర్ వారం రోజులపాటు చేసే పని, ఒక్క మంచి ప్రాంప్ట్ తోనే త్వరగా పూర్తవుతుంది. సదరు అభ్యర్థుల డీటైల్స్ సేకరించడం, వారికి మెయిల్ పంపడం, రిప్లైస్ ను ట్రాక్ చేయడం, గూగుల్ షీట్ స్టేటస్ ఆప్డేట్ చేయడం, ఫాలోఅప్ ఇవ్వడం, గూగుల్ క్యాలెండర్ తో సింక్ చేయడం, మీటింగ్ కి ముందు బ్రీఫింగ్ పంపడం లాంటి పనులన్ని ఆటోమేటిక్ గా జరగాలి. Focus on AI tools For A Bright Future. ఇదే వచ్చే తరంలోని ఏఐ టూల్స్ లక్ష్యం’ కానుందని వివరించారు.