
Tesla the luxury electric car manufacturing: ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ కు చెందిన లగ్జరీ ఎలక్ట్రిక్ కార్ల తయారీ దిగ్గజం టెస్లా ఇప్పుడు భారత్ లోకి అడుగుపెట్టింది. నిన్న ఉదయం ముంబై నడిబొడ్డున బాంద్రా కుర్లా కాంప్లెక్స్ (BKC)లోని మేకర్ మ్యాక్సిటీ మాల్‌లో టెస్లా తన ఫస్ట్ ఎవర్ షోరూంను గ్రాండ్‌గా లాంఛ్ చేసింది. తొలి షోరూం కోసం టెస్లా సంస్థ వై మోడల్ కార్లను చైనాలోని షాంఘై నగరంలో గల తమ ఫ్యాక్టరీ నుంచి తీసుకురావడం విశేషం! ఇక్కడ డిమాండ్‌ను బట్టి ఆ తర్వాత ఢిల్లీలోనూ షోరూంను ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది.
ఈ షోరూం కోసం ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ (బీకేసీ) బిజినెస్ డిస్ట్రిక్ట్‌లో 4,000 చదరపు అడుగుల స్థలాన్ని టెస్లా సంస్థ అద్దెకు తీసుకోగా.. పార్కింగ్ సౌకర్యాలుగల ఈ షోరూమ్ స్పేస్‌కుగాను మస్క్ నెలకు రూ.35 లక్షల అద్దె చెల్లించనున్నట్లుగా సమాచారం. ఏడాదికి 5 శాతం అద్దె పెంపు ప్రాతిపదికన ఐదేళ్ల కాలానికి యూనివ్‌కో ప్రాపర్టీస్ నుంచి లీజుకి తీసుకుంది. ఈ ప్రాపర్టీ గ్రౌండ్ ఫ్లోర్ దేశీయంగా ఏర్పాటైన తొలి యాపిల్ స్టోర్‌కు దగ్గరగా ఉంటుంది. రెంటల్ అగ్రిమెంట్ ఫిబ్రవరి 27న రిజిస్టరైంది. రూ.2.11 కోట్లు సెక్యూరిటీ డిపాజిట్‌గా కూడా టెస్లా జమ చేసింది.
భారత్ లో అమ్మకాలు మొదలు పెట్టడానికి కారణం.. యూరప్, చైనాలో అమ్మకాలు పడిపోవడంతో ఇండియాలో సొమ్ము చేసుకోవాలనే ఆలోచనతో ఎలాన్ మస్క్ సంస్థ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే ముంబైలో తమ తొలి షోరూంను ప్రారంభించింది. ప్రస్తుతం ఎలక్ట్రిక్ కార్లలో ఎక్కువ సేల్స్ రికార్డు నెలకొల్పిన వై మోడల్ కారు ధర పన్నులు, బీమా అంతా కలిపితే రూ.48 లక్షలపైనే అవుతుంది. Tesla the luxury electric car manufacturing.
భారత్‌లో టెస్లా కారు ధర సుమారుగా రూ.60లక్షలు. ప్రస్తుతం మోడల్ Y రెండు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో రేర్ వీల్ డ్రైవ్ కారు ధర రూ.59.89 లక్షలు ఉండగా, లాంగ్ రేంజ్ రేర్ వీల్ డ్రైవ్ రూ.67.89 లక్షలుగా ఉంది. జులై 15 నుంచి అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. కాగా ఆగస్టులో కార్లు డెలివరీ అవుతాయి. ఈ కార్ల ధరలు అమెరికాలో దాదాపు రూ.38 లక్షలు కావడం గమనార్హం. ఒక ఛార్జింగ్ తో 500-4622 కి.మీ. ప్రయాణానికి వీలు కల్పిస్తుంది.
ఈ రెండు వేరియంట్ల డెలివరీలు వరుసగా ఈ ఏడాది మూడో, నాలుగో త్రైమాసికం నుంచి మొదలవుతాయి. తొలుత ఢిల్లీ, ముంబయి, గురుగ్రామ్ లలో ఈ వాహనాల డెలివరీ, రిజిస్ట్రేషన్ ఉంటుంది. వినియోగదార్లు కావాలంటే ఎక్స్ టీరియర్, అంటీరియర్, ఇతర ఫీచర్లను తమకు కావాల్సినట్లు మార్చుకునే వీలు టెస్లా డిజైన్ స్టూడియోలో ఉంది.
అమెరికా ధరతో పోలిస్తే భారత్ లో రెట్టింపు ధర..?
ప్రస్తుతం భారత తయారీ సంస్థలు టాటా మోటార్స్, మహీంద్రా అందిస్తున్న విద్యుత్తు కార్ల ధరలు రూ.30 లక్షల్లోపే ఉన్నాయి. అమెరికాలో మోడల్ వై లాంగ్ రేంజ్ రేర్ వీల్ డ్రైవ్ వేరియంట్ ధర 87,190 డాలర్లు (దాదాపు రూ.32 లక్షలు)గా ఉంది. దిగుమతి సుంకాల కారణంగా మన దగ్గరికి వచ్చేసరికి ఈ కారు ధర దాదాపు రెట్టింపైంది. మనదేశంలోకి దిగుమతి చేసుకుంటున్న కారు ధర 40,000 డాలర్లకు మించితే 100% సుంకం, ఆ పరిమితిలోపైతే 20% దిగుమతి సుంకం వర్తించడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది.