స్క్రీన్ షేర్ యాప్ తో.. మీ డేటా రిస్క్ లో పడ్డట్టే!

The government Warns About Screen Sharing Apps: డిజిటల్ వినియోగం రోజురోజుకూ పెరిగిపోతున్న నేపథ్యంలో సైబర్ నేరాలు అదే తీరులో పెరిగిపోతున్నాయి. సైబర్ కేటుగాళ్లు సామాన్య ప్రజలను మోసం చేయడానికి కొత్త కొత్త మార్గాలను అన్వేషిస్తున్నారు. కొంతమందికి వాటి పట్ల కనీస అవగాహన లేక ఈ నేరాలకు బలవుతున్నారు. కొందరు తెలియకుండానే వారి ఫోన్‌లను నేరస్తులకు అప్పగించేస్తున్నారు. దీనివల్ల వారి వ్యక్తిగత సమాచారం, బ్యాంకు ఖాతాలు రిస్క్ లో పడుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఇండియన్ సైబర్‌క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (I4C) ప్రజలకు చేస్తున్న సూచనలివి..

ప్రభుత్వం సైబర్ నేరాల గురించి హెచ్చరిస్తూ, స్క్రీన్ షేరింగ్ యాప్‌లను డౌన్‌లోడ్ చేయవద్దని చెబుతోంది. ఇప్పటికే ఇన్‌స్టాల్ చేసిన వాటిని వెంటనే డిలీట్ చేయాలని సూచిస్తుంది. ఈ యాప్‌లు మీ ఫోన్ స్క్రీన్‌ను నేరస్తులకు చూపించడమే కాక దీనివల్ల వారు మీ ఓటీపీలు, మెసేజ్ లు, బ్యాంకు డీటైల్స్ వంటి అతి ముఖ్యమైన సమాచారాన్ని చూసే ఛాన్స్ ఉంది. ఈ లూప్ హోల్ కారణంగా సైబర్ నేరగాళ్లు మీ బ్యాంకు ఖాతాలను ఖాళీ చేయవచ్చు. కాబట్టి ఈ రకమైన యాప్‌లను యూస్ చేయవద్దు. The government Warns About Screen Sharing Apps.

  • కొత్త యాప్‌ లను ఇన్‌స్టాల్ చేసేటప్పుడు అది కొన్ని పర్మిషన్స్ అడుగుతుంది. చాలామంది వాటిని చదవకుండా అన్నింటికీ అగ్రీ అని కొట్టేస్తుంటారు. ఇది చాలా రిస్క్.
  • మీ సోషల్ మీడియా అకౌంట్స్ కి సంబంధించిన సెట్టింగ్‌లను సరిచేసుకోండి. మీ వ్యక్తిగత సమాచారం అందరికీ కనిపించకుండా ప్రైవేట్ లో ఉంచుకోవాలి. మీ ఫోన్ నంబర్, అడ్రెస్, ఫోటోలు వంటివి బహిర్గతం కాకుండా ప్రైవసీలో ఉంచాలి. ఇలా చేయడం వల్ల సైబర్ నేరస్తులు మీ సమాచారాన్ని దుర్వినియోగం చేయడం కష్టమవుతుంది.
  • తెలియని లింక్‌లు లేదా మెసేజులను అసలు క్లిక్ చేయకండి.
  • మీ స్మార్ట్‌ఫోన్ సాఫ్ట్‌వేర్‌ను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేస్తూ ఉండండి.

Also Read: https://www.mega9tv.com/slideshow/india-ranks-first-in-upi-transactions-says-international-monetary-fund-imf/