వర్షాకాలంలో ఈవీలు పేలకుండా ఉండాలంటే..?!

To prevent EVs from exploding: తెలుగు రాష్ట్రాల్లో ఎలక్ట్రికల్ వెహికిల్స్ (ఈవీ) వినియోగం రోజురోజుకీ పెరుగుతోంది. డీజిల్, పెట్రోల్ వాహనాలతో పోల్చితే ప్రయాణ ఖర్చు తక్కువ అవ్వడంతో.. చాలామంది వీటివైపు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇది మంచి పరిణామమే అయినా కొన్నిచోట్ల బ్యాటరీలు పేలిపోవడం, ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతుండడం వంటి సంఘటనలు చూస్తుంటే ఒక్కింత ఆందోళన కలుగుతోంది. వీటి మెయింటనెన్స్ పై సరైన అవగాహన లేకనే ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని నిపుణులు చెబుతున్నారు. అందులోనూ వర్షాకాలంలో మరింత అప్రమత్తత అవసరం:

  • బ్యాటరీనీ ఫుల్ ఛార్జ్ అవ్వాలని రాత్రంతా ఛార్జింగ్ పెట్టేసి వదిలేస్తుంటారు. ఇది అత్యంత ప్రమాదకరం. ఛార్జింగ్ 20 నుంచి 80 శాతం వరకే ఉండేలా చూసుకుంటే వాటి మన్నిక బాగుంటుంది.
  • లాంగ్ ట్రిప్ లకు వెళ్లి వచ్చిన వెంటనే ఛార్జింగ్ లేదని వెంటనే ఛార్జ్ చేస్తుంటారు. కానీ వెహికిల్ అప్పటికే వేడెక్కి ఉంటుంది. మళ్లీ ఛార్జింగ్ పెట్టడం వల్ల మరింత వేడెక్కుతుంది. ఇలా లోపల ఒత్తిడి పెరిగి, పేలిపోయే ఛాన్స్ ఉంటుంది.
  • ప్రయాణం చేసి వచ్చినప్పుడు వాహనానికి గాలి తగిలేలా నీడలో ఉంచితే మంచిది.
  • బండిని ఒకవేళ కడిగితే పూర్తిగా ఆరిపోయాకే ఛార్జింగ్ పెట్టాలని గుర్తుంచుకోండి.
  • వాహనంలో బ్యాటరీ పాడై, పేలిపోయే ముందు కొన్ని సంకేతాలను ఇస్తుంది. బండి బాగా హీట్ ఎక్కుతుంది. అప్పుడు లోపలి నుంచి పొగ వస్తుంటే ఛార్జింగ్ ఆపేసి, బండిని చల్లని ప్రదేశంలో ఉంచాలి.
  • నిజానికి బ్యాటరీ ఛార్జింగ్ అవుతున్నప్పుడు కొద్దిగా వేడేక్కుతుంది. ఆ తర్వాత 10 నిమిషాల్లోనే కూల్ అవుతుంది. అలా జరగకుంటే వెంటనే డీలర్ ను సంప్రదించండి.
  • ఈవీల్లో లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ చేయడంలో తేడాలుంటే మటుకు ఆ బ్యాటరీలు పేలిపోతాయి.
  • బ్యాటరీల్లో నాసిరకం సెల్స్ ఉండటం వల్ల షార్ట్ సర్క్యూట్ అవుతాయి.
  • వైరింగ్ లో తప్పిదాలు, ఫ్యూయల్ లీకేజ్ వల్ల కూడా పేలే అవకాశమే ఎక్కువ.
  • మార్కెట్లో బ్రాండెడ్ బ్యాటరీలను పోలిన డూప్లికేట్ బ్యాటరీలు సగం ధరకే ఇస్తామని కొందరు సేల్ చేస్తూ ఉంటారు. ఇలా తక్కువ ధరకు కొనుగోలు చేసే నాసిరకం బ్యాటరీలు ఎక్కువగా పేలిపోతుంటాయి. To prevent EVs from exploding.

ఏం చేయాలంటే..

  • వాహనం సరిగ్గానే నడుస్తున్నా.. ప్రతి మూడు నెలలకోసారి వర్కింగ్ కండిషన్ ఎలా ఉందో చెక్ చేయించాలి. ఆరునెలలకోసారి వైరింగ్, బ్యాటరీ పనితీరును పూర్తిగా చెక్ చేయించుకోవాలి.
  • వర్షాకాలంలో ముసురు వాన, గాల్లోని తేమ వల్ల ఎలక్ట్రికల్ కనెక్టర్లు, వైర్లు, రంగు లేని చోట తుప్పు పడుతుంటుంది. వాటర్ ప్రూప్ వెహికిల్ అయినా.. నీటిలో ఉన్నప్పుడు అరగంట వరకే అది రక్షణ ఇస్తుంది. అంతకంటే ఎక్కువ సమయం వాహనం నీటిలో ఉంటే బ్యాటరీలోకి నీరు చేరుతుందని మరవద్దు.
  • ఉరుములు, మెరుపులతో కూడిన వాన సమయంలో ఈవీలకు ఛార్జింగ్ పెట్టాల్సి వస్తే జాగ్రత్తగా ఉండాలి. తడిసిన ఛార్జింగ్ పోర్ట్, ఫ్లగ్ వల్ల విద్యుత్తు సరఫరాలో హెచ్చుతగ్గులు ఏర్పడి షార్ట్ సర్క్యూట్ అయ్యే ఛాన్స్ ఉంది. ప్లగ్, పోర్ట్ ఎప్పుడూ తడవకుండా, పొడిగా ఉండేలా చూసుకోవాలి.
  • ఈవీల ఛార్జింగ్ కి ప్రత్యేక పాయింట్ లేదా ప్లేస్ ను ఏర్పాటు చేసుకుంటేనే ఉత్తమం.
  • వాహనంతో వచ్చిన బ్యాటరీ లైఫ్ అయిపోతే బ్రాండెడ్, బండి అమ్మిన డీలర్ వద్ద మాత్రమే బ్యాటరీని కొనుగోలు చేయాలి.
  • ఆటోమోటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఏఆర్ఏఐ), ఇతర నాణ్యతా ప్రమాణాలున్న బ్యాటరీలనే ఎంచుకోవాలి.

Also Read: https://www.mega9tv.com/technology/some-tips-to-follow-regarding-digital-payments-from-the-national-payments-corporation-of-india/