
Nothing Phone 3 features: టెక్ మార్కెట్లో సాంకేతికత, డిజైన్ పరంగా తనదైన బ్రాండ్ సృష్టించుకున్న స్మార్ట్ ఫోన్ ఏదైనా ఉందంటే అది నథింగ్ అనే చెప్పాలి. తాజాగా ఈ కంపెనీ తన కొత్త ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ నథింగ్ ఫోన్ 3ని సేల్‌కి తీసుకురావడం విశేషం. నథింగ్ ఫోన్ 3 తన ఎఫెక్టివ్ కెమెరా సిస్టమ్, చిప్‌సెట్, కొత్త గ్లిఫ్ ఇంటర్‌ఫేస్ అప్‌గ్రేడ్ వంటి ఫీచర్ల కలయికతో రెడీ అయ్యింది.
ఈ ఫోన్ డిజైన్ పూర్తిగా ప్రీమియం లెవల్ లో ఉంది. వెనుక గ్లాస్ బాడీలో ఇచ్చిన ఎల్ఈడీ స్ట్రిప్స్ మరోసారి బ్రాండ్ యూఎస్‌పి అని రుజువు చేస్తున్నాయి. భారత్ లో నథింగ్ ఫోన్ 3 సేల్ ఈరోజు నుంచే ప్రారంభం కాగా ఎంపిక చేసిన బ్యాంక్ కార్డ్‌లపై స్పెషల్ డిస్కౌంట్లు, ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లు అందుబాటులో ఉన్నాయి.
కంపెనీ నథింగ్ ఇయర్ (1) వైర్‌లెస్ ఇయర్‌బడ్‌లను కూడా ఓపెనింగ్ ఆఫర్ కింద చాలా తక్కువ ధరకు విక్రయిస్తోంది. మీరు కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలని ఆలోచిస్తుంటే మాత్రం ఇదొక బెస్ట్ ఆప్షన్.
నథింగ్ ఫోన్ 3 స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి రూ.79,999. ఈ ఫోన్ 12GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్‌కు వర్తిస్తుంది. కస్టమర్లు ఈ స్మార్ట్‌ఫోన్‌ను ఫ్లిప్‌కార్ట్, నథింగ్ ఇండియా అఫిషియల్ వెబ్‌సైట్ నుంచి బై చేయవచ్చు. Nothing Phone 3 features.
ఫ్లిప్‌కార్ట్‌లో ఐసిఐసిఐ, హెచ్‌డిఎఫ్‌సి, ఎస్‌బిఐ బ్యాంక్ కార్డుల ద్వారా చెల్లింపుపై రూ.5000 వరకు స్పాట్ డిస్కౌంట్ ఇస్తుంది. దీంతోపాటు ఓల్డ్ ఫోన్ ఎక్స్‌ఛేంజ్ చేసుకుంటే రూ.12,000 వరకు తగ్గింపు అందిస్తున్నారు. ఇదేకాక ఫస్ట్ 1,000 మంది కస్టమర్లకు కేవలం రూ. 999కే నథింగ్ ఇయర్ (1) ఇయర్‌బడ్‌లను ఇవ్వడం విశేషం!
ఫీచర్స్ ఇవే..
నథింగ్ ఫోన్ 3 స్మార్ట్‌ఫోన్‌లో HDR10+ కు సపోర్ట్ ఇచ్చే 6.7 అంగుళాల 120Hz అమోలెడ్ డిస్‌ప్లే ఉంది. దీనికి ఇన్-డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా ఉంది.
ఫోన్ క్వాల్కమ్ తాజా స్నాప్‌డ్రాగన్ 8s జెన్ 4 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది.
ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 15 ఆధారిత నథింగ్ ఓఎస్‌తో వస్తుంది.
నథింగ్ ఫోన్ 3 వెనుక భాగంలో మూడు 50-మెగాపిక్సెల్ కెమెరాలున్నాయి.
50MP పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా (3x ఆప్టికల్ జూమ్‌తో), 50MP ప్రైమరీ సెన్సార్, 50MP అల్ట్రా-వైడ్ లెన్స్ తో ఉండగా, ముందు కెమెరా ఇప్పుడు 50MP, ఇది ఆటో ఫోకస్‌కు సపోర్ట్ చేస్తుంది.
ఈ ఫోన్‌లో 5500mAh బ్యాటరీ ఉంది.
ఈ ఫోన్ 100W ఫాస్ట్ ఛార్జింగ్ తో.. వైర్‌లెస్, రివర్స్ వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్ తో పని చేస్తుంది.
ఫోన్ వెనుక భాగంలో LED లైట్లు ఉన్నాయి. కాల్స్, మెసేజెస్, నోటిఫికేషన్లు, ఛార్జింగ్ స్థితిని చూపుతాయి. ఈసారి గ్లిఫ్ ఇంటర్‌ఫేస్‌కు మరిన్ని కస్టమైజేషన్స్ ఉంటాయి.