కామారెడ్డి జిల్లా జుక్కల్ పాలిటిక్స్ బస్తీమే సవాల్..!

Kamareddy district’s Jukkal politics: ఆ ఇద్దరూ ఒకే పార్టీ నేతలు. ఒకరు ఎమ్మెల్యే మరొకరు ఎంపీ. నిన్న మొన్నటి వరకు అలైబలై చేసుకున్న ఆ నేతలు ఇప్పుడు బస్తీమే సవాల్ అంటూ కత్తులు దూస్తున్నారట. దీంతో క్యాడర్ కూడా రెండు గ్రూపులుగా చీలిపోయారట. ఇంతకీ ఆ ఇద్దరు నేతల మధ్య గ్యాప్ ఎందుకు వచ్చింది. చూద్దాం.

కామారెడ్డి జిల్లా జుక్కల్ పాలిటిక్స్ అధికార కాంగ్రెస్ పార్టీలో హీట్ పెంచుతున్నట్లు తెలుస్తోంది. జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మి కాంతరావు, జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కర్ మధ్య వర్గపోరు నడుస్తోన్న వర్గపోరుతో నియోజకవర్గంలో ఎమ్మెల్యే వర్సెస్ ఎంపీ అన్నట్లుగా కాంగ్రెస్ పార్టీ పరిస్తితి ఏర్పడినట్లు ప్రచారం జరుగుతోంది. మొదటి నుంచీ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న స్తానిక నేతలు, గత ఎన్నికల సమయంలో లక్ష్మీకాంతారావు విజయం కోసం కష్టపడ్డారు. అయితే గెలిచిన తర్వాత వారిని ఆయన పట్టించుకోవడం లేదన్న టాక్ నడుస్తోంది. ఇదే సమయంలో వారంతా ఎంపీ సురేష్ షెట్కార్ వర్గంలో చేరిపోయారట. ఇదే ఎంఎల్ఏ, ఎంపీ మధ్య చిచ్చుకు కారణంగా తెలుస్తోంది. తాను దూరం పెట్టిన వారిని సురేష్ షెట్కర్ చేరదీయటం ఏంటంటూ, లక్ష్మీ కాంతారావు ఆయనపై గుర్రుగా ఉన్నారట. Kamareddy district’s Jukkal politics.

ఇక ఎంఎల్ఏ లక్ష్మీకాంతారావు నోటీసులో లేకుండా జుక్కల్ అభివృద్దికి ఎంపీ కోటా నిధుల నుంచి 3 కోట్ల రూపాయలు కేటాయించారు సురేష్ షెట్కార్. అలాగే 200 ఇందిరమ్మ ఇళ్లు కూడా మంజూరు చేయించారు. అంతేకాదు, మొదటి నుంచీ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న వారికి లబ్దిదారుల ఎంపిక పనులు అప్పగించారట ఎంపీ సురేష్ షెట్కార్. దీంతో ఇప్పుడు ఎంఎల్ఏ, ఎంపీ మధ్య గ్యాప్ పతాకస్తాయికి చేరినట్లు నియోజకవర్గంలో ప్రచారం జరుగుతోంది. తనకు చెప్పకుండా తన నియోజకవర్గంలో ఎంపీ ఓవర్ యాక్షన్ చేస్తున్నారంటూ ఇప్పుడు ఎంఎల్ఏ లక్ష్మీ కాంతారావు ఫైర్ అవుతున్నట్లు తెలుస్తోంది.

ఇక జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మికాంతరావు కూడా ప్రభుత్వ కార్యక్రమాల్లో ఎంపీకి ఆహ్వనం పలకడం లేదట. ప్లెక్సీల్లో కూడా ఎంపీ ఫోటో పెట్టడం లేదంటూ ఇటీవల కొందరు పార్టీ అధిష్టానానికి ఎంఎల్ఏ మీద ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. అలాగే బిచ్కుంద మున్సిపాలిటీ ఏర్పాటు విషయంలో కూడా ఇద్దరి మధ్య విబేధాలు వచ్చాయన్న ప్రచారం నడుస్తోందట. మంత్రి పదవి కోసం ప్రయత్నించిన లక్ష్మీ కాంతారావుకు ఎంపీ వర్గం చెక్ పెట్టిందన్న ప్రచారం కూడా నియోజకవర్గంలో బలంగా వినిపిస్తోందట. తాజా పరిస్తితులతో ఇప్పుడు జుక్కల్ నియోజకవర్గంలో ఎంఎల్ఏ వర్సెస్ ఎంపీగా రాజకీయం నడుస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

మరో విషయం ఏంటంటే, అనారోగ్యంతో ఆస్పత్రి పాలైన ఎంఎల్ఏ లక్ష్మీ కాంతారావును పరామర్శించారు ఎంపీ సురేష్ షెట్కార్. దీనిపై కూడా రెండు వర్గాల మధ్య మాటల యుద్ధం నడుస్తోందట. కేవలం జనం మెప్పుకోసమే తమ నేతను ఎంపీ పరామర్శించారంటూ ఎంఎల్ఏ వర్గీయులు ప్రచారం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇటు కార్యకర్తలు మాత్రం ఇద్దరు నేతల తీరుపై గుర్రుగా ఉన్నారట. వీరిద్దరూ ఇలాగే ఉంటే, రాబోయే స్తానిక సంస్తల ఎన్నికల్లో పార్టీ దెబ్బతినడం ఖాయమని కార్యకర్తలు బాధ పడుతున్నట్లు ఇప్పుడు జుక్కల్ నియోజకవర్గంలో జోరుగా ప్రచారం జరుగుతోంది.