టీటీడీ అడ్వైజరీ కమిటీ చైర్మన్‌గా జనసేన నేత శంకర్ గౌడ్

Shankar Goud జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జిగా పని చేస్తున్న నేమూరి శంకర్ గౌడ్‌కు టీటీడీ అడ్వైజరీ కమిటీ చైర్మన్ పదవి దక్కింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమించిన వివిధ దేవాలయాల అడ్వైజరీ కమిటీ చైర్మన్‌లలో శంకర్ గౌడ్‌కు స్థానం లభించింది. హిమాయత్ నగర్‌లోని టీటీడీ లోకల్ అడ్వైజరీ కమిటీ చైర్మన్‌గా శంకర్ గౌడ్‌ను నియమించారు. జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ కు శంకర్ గౌడ్ సన్నిహితంగా ఉంటారు. జనసేన పార్టీ పుట్టకముందు 2008 నుంచి పవన్ కళ్యాణ్ తో శంకర్ గౌడ్ ప్రయాణం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ నమ్మిన బంటుగా శంకర్ గౌడ్ కు పేరుంది.ఈ నేపథ్యంలోనే శంకర్ గౌడ్ ను జనసేన పార్టీకి తెలంగాణ ఇన్ ఛార్జ్ గా పవన్ కళ్యాణ్ నియమించారు. తెలంగాణాలో కూడా జనసేన పార్టీని బలోపేతం చెయ్యడంలో శంకర్ గౌడ్ తనవంతు ప్రయత్నం చేస్తున్నారు. ఈ తరుణంలో గురువారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన వివిధ దేవాలయాల అడ్వైజరీ కమిటీల్లో హిమాయత్ నగర్ లోని టీటీడీ అడ్వైజరీ కమిటీ చైర్మన్ గా శంకర్ గౌడ్ స్థానం కల్పించారు. అత్యంత ప్రతిష్టాత్మకమైన టీటీడీ ఆలయానికి సంబంధించిన అడ్వైజరీ కమిటీ చైర్మన్ గా తనను నియమించడం పట్ల శంకర్ గౌడ్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు , ముఖ్యమంత్రి చంద్ర బాబు నాయుడుకు కృతజ్ఞ్యతలు తెలిపారు. తనపై విశ్వాసంతో హిమాయత్ నగర్ టీటీడీ ఆలయ అడ్వైజరీ కమిటీ సభ్యుడిగా నియమించిన పవన్ కళ్యాణ్ విశ్వాసాన్ని నిలబెడతానని శంకర్ గౌడ్ తెలిపారు. Shankar Goud