మైనంపల్లి కోటకు బీటలు వాలనుందా.?

Mynampally Hanumantha Rao: మైనంపల్లి కోటకు బీటలు వాలనుందా. మైనంపల్లి కుటుంబం కుటుంబం మెదక్ కాంగ్రెస్ పార్టీలో వర్గ విబేధాలకు అడ్డుకట్ట వేయలేకపోతున్న రా. అసంతృప్తిని కంట్రోల్ చేయడంలో విఫలం అవుతున్నారు. వీరి నిర్ణయాలు నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీకి ప్లస్ అవుతోందా. తాజా పరిస్తితులు అవే చెబుతున్నాయి.

మెదక్ నియోజకవర్గంలో కాంగ్రెస్ శ్రేణులు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. మైనంపల్లి హనుమంతరావు, ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ మీద అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల సమయంలో మైనంపల్లి హనుమంతరావు ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేక పోతున్నారన్న అసంతృప్తితో ఉన్నారు. అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర గడిచినా నామినేటెడ్ పోస్టులు దక్కని అనేకమంది నాయకులు భంగపడ్డారట. రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండిగా కప్పుకున్న వాళ్లంతా ఇప్పుడు టిఆర్ఎస్ గూటికి చేరేందుకు సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది.

నామినేటెడ్ పోస్టులను భర్తీ చేయడంలో మైనంపల్లి పూర్తిగా విఫలం అయ్యారన్న టాక్ కాంగ్రెస్ శ్రేణుల్లో బలంగా వినిపిస్తోంది. ఏడుపాయల చైర్మన్ పోస్ట్ భర్తీ చేయలేకపోవడంతో పాటు మెదక్ నియోజకవర్గంలో మార్కెట్ కమిటీ చైర్మన్ పోస్టులు, డైరెక్టర్ పోస్టులు భర్తీ చేయలేకపోవడం పట్ల కాంగ్రెస్ నాయకులు మైనంపల్లి మీద గుర్రుగా ఉన్నారట. మెదక్ నియోజకవర్గానికి దక్కాల్సిన మెదక్ జిల్లా గ్రంధాలయ చైర్మన్ పదవి నర్సాపూర్ నియోజకవర్గానికి వెళ్లడంతో స్థానికంగా ఉన్న నాయకులకు ఎమ్మెల్యే రోహిత్ అన్యాయం చేశారంటూ బాహాటంగానే విమర్శలకు దిగుతున్నారు. Mynampally Hanumantha Rao.

ఇక నియోజకవర్గ, జిల్లా, రాష్ట్రస్థాయి పదవులు ఆశించిన సీనియర్ కాంగ్రెస్ నేతలు, ఇప్పుడు మైనంపల్లి మాటలను ఏమాత్రం పట్టించుకోవడం లేదట. తాము మోసపోయామన్న ఫీలింగులో ఉన్న కొందరు నేతలు ఇప్పుడు బీఆర్ఎస్ వైపు చూస్తున్నట్లు నియోజకవర్గంలో ప్రచారం జరుగుతోంది. ఎన్నికల సమయంలో ఎన్నో హామీలిచ్చి తమ మద్దతు కూడగట్టుకొని కొడుకును ఎమ్మెల్యే చేసుకున్న మైనంపల్లి హనుమంతరావును ఇకపై నమ్మలేమంటూ కేటీఆర్, హరీష్ రావుతో సంప్రదింపులు జరిపారు. అంతా ఓకే అనుకున్న తర్వాత భారీ సంఖ్యలో స్తానిక నేతలు, కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీలోకి జంప్ కొట్టారు.

మైనంపల్లి హనుమంతరావు దృష్టి అంతా సిద్దిపేట, గజ్వేల్, నర్సాపూర్, మల్కాజ్ గిరి నియోజకవర్గాలపైనే ఉందనీ, మెదక్ నియోజకవర్గం వైపు ఆయన కనీసం తొంగి చూడడం లేదని కాంగ్రెస్ శ్రేణులు నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న వేళ మైనంపల్లి హనుమంతరావు పై కాంగ్రెస్ నేతలు తిరుగుబాగుట ఎగురవేయడం రాష్ట్ర నాయకత్వానికి తలనొప్పిగా మారడం ఖాయంగా కనిపిస్తోంది.

Also Read: https://www.mega9tv.com/telangana/yashaswini-reddy-is-criticising-errabelli-dayakar-rao-with-extreme-force/