తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన రామచంద్రరావు!

Ramachandra Rao BJP President: తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన రామచంద్రరావు పార్టీని సరైన దారిలో తీసుకెళ్లగలరా. తన ముందున్న సవాళ్లను ఆయన ఎలా అధికమిస్తారు. ఇప్పటికే పార్టీలో నెలకొన్న గ్రూప రాజకీయాలకు నూతన అధ్యక్షుడు ఎలా చెక్ పెడతారు. అన్నింటికీ మించి మరో నెల రోజుల్లో జరగనున్న స్తానిక సంస్థల ఎన్నికలను ఎలా ఎదుర్కొంటారు. ఇదే ఇప్పుడు సగటు బీజేపీ కార్యకర్తకు వస్తోన్న అనుమానాలు.

తెలంగాణ బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ రామచంద్రరావు ముందు పార్టీ పరంగా చాలా సవాళ్లు ఉన్నాయట. ముందుగా పార్టీలో గ్రూపు రాజకీయాలు పెరగకుండా చూడటం ఆయన ముందున్న టాస్క్. ఓవైపు కిషన్ రెడ్డి, మరోవైపు బండి సంజయ్ గ్రూపుల మధ్య పొసగడం లేదు. అలాగే ఇంకోవైపు ఈటల రాజేందర్ గ్రూపు కూడా పెరుగుతోంది. ఈ ముగ్గురు నేతలతో మాట్లాడి, సముదాయించి పార్టీని మరింత పటిష్టం చేయడం అంత సులువైన విషయం కాదు. ఒకవేళ గ్రూపుల విషయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కొంచెం వెనక్కి తగ్గినా, బండి సంజయ్, ఈటల రాజేందర్ వర్గాలను కలపడం అంత ఈజీ కాదు. ఎందుకంటే, హైదరాబాద్ కార్యకర్తలను బుజ్జగించడం చాలా తేలిక. కానీ జిల్లాల్లో పరిస్తితి వేరే విధంగా ఉంటుంది. గ్రామస్తాయి నుంచీ జిల్లా ప్రధాన కేంద్రం దాకా బోలెడు వర్గపోరు ఉంటుంది. ఇప్పుడు దాన్ని సెట్ చేయడమే రామచంద్రరావుకు ఛాలెంజ్ అవుతోంది. Ramachandra Rao BJP President.

ఇక రెండో టాస్క్ రాజాసింగ్. ఆయన ఎప్పుడు అలుగుతారో, ఎప్పుడు పార్టీ నుంచి వైదొలుగుతారో ఎవ్వరికీ అర్థం కాదు. ఒకవేళ రాజీనామా చేస్తే ఆమెదించే సాహసం రామచంద్రరావు కూడా చేయలేరు. ఎందుకంటే, రాజాసింగ్ మీద ఎలాంటి చర్యలు తీసుకున్నా దాని ప్రభావం దాదాపు 14 రాష్ట్రాల్లోని బీజేపీ కేడర్ మీద పడుతుంది. ఈ విషయం తెలియనంత అమాయకుడు కాదు మన వకీల్ సాబ్. ప్రస్తుత జాతీయ బీజేపీ అధ్యక్షుడు నడ్డానే రాజాసింగ్ మీద చర్యలకు మీనమేషాలు లెక్కిస్తారు. అంటే, రాజాసింగ్ పవర్ ఏంటో అర్థం అవుతుంది. అంతేకాదు, తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి నామినేషన్ వేసేందుకు వచ్చారు రాజాసింగ్. అంటే ఆయనకు ఆ పదవి మీద ఆశ ఉన్నట్లే కదా. అలాంటి వ్యక్తిని రామచంద్రరావు ఎలా డీల్ చేస్తారన్నదే ముఖ్యం.

ఇక మూడు టాస్క్ స్థానిక సంస్థల ఎన్నికలు. గత ఎన్నికల్లో తెలంగాణాలో బీజేపీ బాగా పుంజుకుంది. 8 మంది ఎంఎల్ఏలు, 8 మంది ఎంపీలు ఆ పార్టీకి దక్కించుకుంది. అలాగే కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ ఉపాధ్యాయ ఎంఎల్సీ, పట్టభద్రుల ఎఎల్సీ సీట్లను గెల్చుకుంది. ఈ రెండు చోట్ల అధికార కాంగ్రెస్ పార్టీని మించి ఓట్లు రాబట్టుకుంది బీజేపీ. ఈ రెండు ఎన్నికలు ఆరు ఎంపీ సీట్లు, 42 అసెంబ్లీ నియోజకవర్గాల్లో జరిగాయి. అంటే 13 జిల్లాల్లో 217 మండలాల్లో బీజేపీ తన ఓట్ బ్యాంక్ పెంచుకున్నట్లు అర్థం అవుతోంది. అందుకే రాబోయే స్తానిక సంస్థల ఎన్నికలు బీజేపీకి చాలా ముఖ్యం. అందుకే గ్రామస్తాయి నుంచి కార్యకర్తలను కలుస్తూనే పార్టీ బలం మరింత పెంచుకునేలా చర్యలు తీసుకోవాలన్నది కాషాయ పార్టీ వ్యూహంగా తెలుస్తోంది.

అంతేకాదు, ఇప్పటికే తెలంగాణాలో స్తానిక సంస్థల్లో ఎక్కువ శాతం బీఆర్ఎస్ పార్టీకి పట్టుంది. తొమ్మిదేళ్ల పాటు ఆ పార్టీ అధికారంలో ఉండటంతో, 90 శాతం స్తానిక సంస్థలు కారు పార్టీ కైవశం చేసుకుంది. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ గడ్డు పరిస్తితులు ఎదుర్కొంటుంది. ఇదే సమయంలో అధికార కాంగ్రెస్ పార్టీ జనంలో వ్యతిరేకత మూటగట్టుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. అలాగే, గ్రామస్తాయి నుంచి ఆ పార్టీలో గ్రూపులకు కొదవేలేదు. అంటే ప్రభుత్వ వ్యతిరేకత, కాంగ్రెస్ గ్రూపు రాజకీయాలను క్యాష్ చేసుకోవాల్సింది బీఆర్ఎస్, బీజేపీలు మాత్రమే. ఇలాంటి సమయంలో రామచంద్రరావు ఎలాంటి వ్యూహంతో వెళ్తారన్నదే చూడాల్సి ఉంది.

Also Read: https://www.mega9tv.com/telangana/clash-between-kanta-rao-and-suresh-shetkar-kamareddy-districts-jukkal-politics-is-turning-up-the-heat/