
Khammam Jafar Bavi: ఎన్నో పురాతన కట్టడాలు మరెన్నో చారిత్రాత్మక నిర్మాణాలు నేటికీ మన కళ్ళ ముందు సజీవ సాక్షాలుగా దర్శనమిస్తున్నాయి ఆకోవకు చెందినదే ఖమ్మం నగరంలోని 900 ఏళ్ల చరిత్ర కలిగిన జాఫర్ బావి.అసలు జాఫర్ బావి ఏంటి దాని చరిత్ర పై మెగా9టీవీ అందిస్తున్న స్పెషల్ రిపోర్ట్
ఖమ్మం నగరంలో ఖిల్లా దక్షిణ భాగంలో ఉన్న బావిని స్థానికులు జాఫర్ బావిగా,పురావస్తు శాఖ వాళ్ళు మెట్ల బావిగా పిలుస్తారు. ఖమ్మం ఖిల్లా నగర నడిబొడ్డున నాలుగు చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో 900 ఏళ్ల కిందట పేర్చిన బండరాళ్లతో ప్రహరీ లోపల కొండపై నిర్మాణాలు చేపట్టారు 15వ శతాబ్దంలో ఈ జాఫర్ భావి నిర్మాణం జరిగినట్లు ఇక్కడి ఆధారాలను బట్టి తెలుస్తుంది. చిట్టి పోతున్నాయిని తిప్పన కాకతీయ స్థాపనచార్య ఇక్కడ ముఖద్వారం నిర్మించినట్లు ఖిలా పశ్చిమ ముఖద్వారం వద్ద ఉన్న శిలాశాసనం చెబుతోంది. 1716 నుంచి 183 వరకు జాఫర్ దౌలా ఇక్కడ తకుల్దార్ గా పనిచేసే కాలంలో ఈ బావిని తవ్వించాడు కాబట్టి దిన్ని జాఫర్ బావిగా పిలుస్తారు.
జాఫర్ బాగా లోపల భాగంలో చుట్టూ లోపలికి దిగేందుకు వీలుగా మెట్లు ఉన్నందున దీన్ని మెట్ల బావిగా పిలుస్తారు కాకతీయుల కాలంలో నిర్మించారు తర్వాత కుతుబ్షాహీ అసఫ్జాహీల కాలంలో మార్పులు చేర్పులు చేశారు వర్షపు నీటిని నిల్వచేసి అవసరాలకు వాడుకునేందుకు ఉద్దేశంతో ఖిలా కుండరాయి పక్కనే లోతైన భావన తవ్వారు తర్వాత మూడు వైపుల నుంచి గ్రానైట్ సున్నపురాయి ఇటుకలతో అంచలంచలుగా దీని నిర్మాణాలు చేపట్టారు.
ఇటీవల బావిలో చెత్తను తోడే క్రమంలో ఒక ఖడ్గం బయటపడింది ఈ నేపథ్యంలో ఇంకేమైనా చారిత్రక వస్తువులు బయటపడతాయా అనే కోణంలో అన్వేషిస్తున్నారు ఈ విషయంపై పురావస్తు శాఖ కూడా ఆసక్తి చూపుతుంది 1973లో ఖమ్మం పట్టణంలో కనీవిని ఎరుగని నీటి ఎద్దడి ఏర్పడింది అప్పుడు ఖమ్మం నగరానికి జాఫర్ బావి నీటిని తోడి అందించారు. Khammam Jafar Bavi
ప్రభుత్వం ఇలాంటి చారిత్రాత్మక కట్టడాలను భావితరాలకు తెలియజేసేందుకు జాఫర్ బావి సుందరీకరణ పనులు మొదలుపెట్టారు.దాదాపు 60లక్షలతో పునరుద్ధరణ సుందరీకరణ పనులు చేపట్టారు ఈరోజు ఆ మెట్ల మార్గాన్ని పరిసర ప్రాంతంలో లైటింగ్ ని అధికారులు ప్రారంభించారు ఇది చారిత్రాత్మక సంపద దీని మనమందరం పరిరక్షించుకోవాలని నగర అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని అధికారులు చెబుతున్నారు.