నామినేటెడ్ పోస్టులు భర్తీ చేస్తారా?

Telangana Congress TPCC Post: టీపీసీసీల మీటింగులో ఏం జరిగింది. ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ వారి నుంచి ఏ సమాచారం తీసుకున్నారు. ఆ తర్వాత కాంగ్రెస్ అధిష్టాన నిర్ణయాలు ఎలా ఉంటే అవకాశం ఉంది. నామినేటెడ్ పోస్టుల్లో ఏ వర్గాలకు అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. వాచ్ దిస్ స్టోరీ.

నామినేటెడ్ పోస్టుల వ్యవహారం తెలంగాణ కాంగ్రెస్ నేతలను కుదిపేస్తోంది. ఎవరికి వారే తమకు పోస్ట్ గ్యారెంటీ అంటూ తెగ ప్రచారం చేసుకుంటున్నారు. అయితే కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి మీనాక్షి నటరాజన్ అన్ని స్థాయిల నేతలతో జరిగిన మీటింగ్ తర్వాత కొంచెం కొంచెం క్లారిటీ వస్తోందట. రాష్ట్రంలోని కార్పొరేషన్లు, బోర్డులలో ఉండే డైరెక్టర్లు, మెంబర్ల నియామకంపై కీలక చర్చ జరిగడం, దీంతో పాటు పార్టీ సంస్తాగత పదవుల మీద కొంత క్లారిటీ రావడంతో నేతల్లో చాలా మంది హుషారుగా ఉన్నట్లు తెలుస్తోంది.

ఒక్కో అసెంబ్లీ సెగ్మెంట్ నుండి ఇద్దరి పేర్లు మీనాక్షి నటరాజన్, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ దగ్గరకు వెళ్లాయట. వారిద్దరూ కల్సి పూర్తి చేసిన నివేదికలో సామాజిక న్యాయం పాటిస్తూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలతో పాటు మహిళలకు తగిన ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఈసారి యువతకు పెద్దపీట వేయాలని కాంగ్రెస్ హై కమాండ్ భావిస్తోందట. ఈ క్రమంలోనే 60 శాతం మంది అభ్యర్థులను 50 సంవత్సరాలలోపు ఉన్న వారికి ప్రాధాన్యతనివ్వాలని డిసైడైన పార్టీ, ఆ క్రైటీరియాతో నివేదిక పూర్తి చేసిందట. దీంతోపాటు బీసీలకు పెద్దపీట వేస్తూ 42 శాతం ఆ సామాజిక వర్గానికి కేటాయించి, బీసీల పక్షపాతిగా పేరు తెచ్చుకోవాలన్నదే కాంగ్రెస్ పెద్దల ఆలోచనగా తెలుస్తోంది. Telangana Congress TPCC Post.

రాబోయే పది రోజుల్లో సీఎం రేవంత్ రెడ్డితో వీరిద్దరూ చర్చించిన తర్వాత ఫైనల్ లిస్ట్ బయటకురానుంది. ఇప్పటికే పెండింగ్ పోస్టుల భర్తీకి సీఎం రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన క్రమంలో, ఒక రెండు రోజుల్లో సీఎం దగ్గర వీటన్నింటినీ ఆవదింపజేసి, వెంటనే డైరెక్టర్లు, మెంబర్ల పోస్టులు భర్తీ పూర్తికానుంది. మరకవైపు నేతలందరూ కలిసికట్టుగా పనిచేసి లోకల్ బాడీ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు సాధించేందుకు ఇన్చార్జిలు కృషి చేయాలని మీనాక్షి నటరాజన్ దిశ నిర్దేశం చేశారట. ఒకవైపు పార్టీ సంస్థాగత నిర్మాణంపై ఫోకస్ పెడుతూనే కులగణన, బీసీ బిల్లుపై కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చేందుకు కూడా సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ ప్రయత్నం చేస్తోందట.

Also Read: https://www.mega9tv.com/telangana/the-war-of-words-between-ktr-and-ramesh-opens-a-can-of-worms/