
Telangana Deputy Chief Minister: ఏపీ తెలంగాణా రాష్ట్రాల మధ్య బనకచర్ల ప్రాజెక్ట్ విషయంలో వివాదం ఇంకా కొనసాగుతోంది. కేంద్ర పెద్దల వద్ద ఈ పంచాయతీ ఇంకా రాజుకుంటుంది. అయితే ఆ ఇష్యూ వల్ల రెండు తెలుగు రాష్ట్రాల మధ్య కొంత రాజకీయంగా వేడి అయితే ఉంది. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ఇంట్రస్టింగ్ ఘటన చోటుచేసుకుంది. ఇంతకు ఆ ఇష్యూ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
అయితే పోలవరం బనకచర్ల ప్రాజెక్టు వ్యవహారంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య రాజకీయాలు వేడెక్కాయి. సముద్రంలో కలిసే గోదావరి వరద జలాలను వాడుకుని రాయలసీమను సస్యశ్యామలం చేస్తామంటూ పోలవరం బనకచర్ల ప్రాజెక్టును ఏపీ ప్రభుత్వం ప్రతిపాదించింది. సుమారుగా 80 వేల కోట్లతో ఈ ప్రాజెక్టు రూపకల్పనకు శ్రీకారం చుట్టుంది. అయితే బనకచర్ల ప్రాజెక్టుపై తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేసింది. తెలంగాణ రాష్ట్రం నీటి హక్కులకు భంగం కలుగుతుందంటూ సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ ప్రాజెక్టు మీద అభ్యంతరం తెలిపారు. కేంద్ర జలసంఘం వద్ద కూడా దీనిపై తమ అభ్యంతరాలను తెలియజేశారు. తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరాలతో బనకచర్ల ప్రాజెక్టుకు బ్రేకులు పడ్డాయి.
ఇక ఈ టైంలో తెలంగాణకు చెందిన ఐదుగురు మంత్రులు మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో దిగారు. తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కతో పాటుగా మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వాకిటి శ్రీహరి, ఉత్తమ్ కుమార్ రెడ్డి జనసేన కేంద్ర కార్యాలయం వద్ద కనిపించడం ఆసక్తి రేకెత్తించింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
తెలంగాణా మంత్రులకు జనసేన ఆఫీసు వద్ద పనేంటి అన్న ప్రశ్న రావచ్చు. ఏపీలో జనసేన అధికారంలో ఉంది. తెలంగాణాలో కాంగ్రెస్ ఉంది. అలా రాజకీయంగా చూసినా కూడా ఇది సంచలనమే అవుతుంది. కానీ ఇది జరిగింది. ఇప్పుడు ఈ మ్యాటర్ చాలా ఇంట్రెస్ట్ గానే ఉంది. పైగా ఒకరు ఇద్దరు కాదండోయ్ అయిదురుగు మంత్రులు ల్యాండ్ అయ్యారు. దాంతో ఇది రాజకీయ సంచలనంగా మారింది.
ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తో పాటు, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వాకిటి శ్రీహరి ఉన్నారు. వీరందరూ జనసేన కేంద్ర కార్యాలయం వద్దకు వెళ్లారు. ఇలా సడెన్ గా తమ పార్టీ ఆఫీసుకు వచ్చేసరికి జనసేన నాయకులు షాక్ అయ్యారు. అయితే జనసేన పార్టీ తరపున ఎమ్మెల్సీ హరిప్రసాద్ వారందరినీ సాదరంగా స్వాగతించి శాలువలతో సత్కరించారు. అంతే కాదండోయ్ కొండపల్లి బొమ్మలను కూడా జ్ఞాపికలుగా వారికి ఇచ్చి మర్యాద చేశారు.
అయితే కాంగ్రెస్ మంత్రులు జనసేన ఆఫీసుకు రావడం అన్నది ఆసక్తికరమే. వీరు అంతా ఒక ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనడానికి హెలికాప్టర్ లో వెళ్తూ జనసేనకు మంగళగిరి పార్టీ ఆఫీసులో ఉన్న హెలిపాడ్ ని వాడుకున్నారు అని టాక్ వినిపిస్తుంది. అలా కొద్ది సేపు అక్కడ వారు ల్యాండ్ అయ్యారు అని అంటున్నారు. అయితే ఆ విధంగా వారికి హెలిపాడ్ కి చోటు ఇచ్చి గౌరవించి పంపించి ఎంతో మర్యాద చేసింది జనసేన. మర్యాద ఇవ్వడంలో పవన్ టీం కూడా తగ్గేదే లేదండీ. Telangana Deputy Chief Minister.
ఏపీలోని టీడీపీ కూటమిలో కీలకంగా వ్యవహరిస్తున్న జనసేన ఆఫీసుకు రావడం అంటే రాజకీయంగా చూసినా సానుకూల అంశమే అని అంటున్నారు. రాజకీయాలు వేరు అయినా రాష్ట్రాలు రెండూ తెలుగు మాట్లాడేవారివే. ఆ సామరస్యం అలాగే కొనసాగాలని అంతా కోరుకుంటున్న నేపథ్యంలో జరిగిన ఈ సంఘటన మాత్రం అంతా చర్చించుకునేలా ఉంది. అంతే కాదు స్వాగతించేలా కూడా ఉంది. పవన్ రాజకీయాల కంటే కూడా అందరితో సామరస్య వైఖరికే ప్రాధాన్యత ఇస్తారు అన్నది తెలిసిందే.
Also Read: https://www.mega9tv.com/telangana/munugode-mla-raj-gopal-reddy-consequences-with-congress-party/