
Congress Minister Seethakka: ఆ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడి తీరు మంత్రికి తలనొప్పిగా మారిందట. ఓ వైపు ఇచ్చిన హామీల అమలు ఎప్పుడు చేస్తారని ప్రజలు నిలదీస్తుంటే, మరోవైపు అధ్యక్షుడి వ్యవహారశైలితో మంత్రి ఇరుకున పడుతున్నారట. ఆదివాసుల పోడు భూముల పంచాయతీ ఓ వైపు, ఇసుక దందాపోరు మరోవైపు ఆ మంత్రిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయట. ఇంతకీ ఎవరా మంత్రి. ఎవరా అధ్యక్షుడు. లెట్స్ వాచ్.
ఆయన పేరు పైడాకుల అశోక్. ప్రస్తుతం మంత్రి సీతక్క అండతో ములుగు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. సీతక్క వ్యవహారాల్లో అన్ని తానై చక్రం తిప్పుతూ ఏకఛత్రాధిపత్యం సాగిస్తున్న నేత. సీతక్క ఏ నాయకుడిని కలవాలన్న, ఏ పని చేయాలన్న ముందుగా అశోక్ ను కలవాల్సిందేనట. అశోక్ గ్రీన్ సిగ్నల్ ఇస్తేనే సీతక్క ఆమోదం తెలుపుతుందట. ఎంత పెద్ద కాంట్రాక్టర్ అయినా, ఎంత పెద్ద లీడరైనా, పని కావాలంటే అశోక్ ముందు చేతులు కట్టుకొని నిల్చోవాల్సిందేనట. మంత్రి సీతక్క కూడా ప్రతి ఫైల్ విషయంలో అశోక్ ను కలవండి అని చెప్పడం కొంతమంది సీనియర్ నేతలను ఇబ్బందికి గురి చేస్తుందట.
సుదీర్ఘ కాలం తర్వాత అధికారంలోకి వచ్చిన కూడా కాంగ్రెస్ కార్యకర్తలకు ఇప్పుడు ఆ సంతోషమే లేకుండా పోయిందన్న వార్తలు వస్తున్నాయి. సీతక్కకు మంత్రి పదవి వచ్చాక జిల్లా అభివృద్ధి చెందుతుంది, రూపురేఖలు మొత్తం మారిపోతాయని కార్యకర్తలు ఆశపడ్డారు. ఏదైనా సమస్య ఉందని చెప్దామని వెళ్తే ఓ వైపు మంత్రి సీతక్క పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి. దీంతో ప్రజలకు ఏం చెప్పాలో అర్థం కావడం లేదని సీనియర్ కాంగ్రెస్ నేతలు సైతం తలలు పట్టుకుంటున్నారట. సీతక్క కేవలం అశోక్ కు మాత్రమే న్యాయం చేశారని కాంగ్రెస్ సీనియర్ నేతలు బహిరంగంగా చర్చించుకుంటున్నారు. దొంగ సర్టిఫికెట్లు అమ్ముకొని జైలుకు పోయి వచ్చినోడు ఇవ్వాళ జిల్లాను, మంత్రి సీతక్కను శాసిస్తున్నాడని మరికొంతమంది కార్యకర్తలు మధన పడుతున్నారట. Congress Minister Seethakka.
ఇక జిల్లా అధ్యక్షుడు అశోక్ కార్యకర్తల బాగోగులు ఏమాత్రం పట్టించుకోవడం లేదన్న ప్రచారం జరుగుతోంది. కేవలం ఇసుక క్వారీల కలెక్షన్లు, రియల్ ఎస్టేట్ దందాలతోనే కాలం గడిపేస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. మరో విషయం ఏంటంటే, పార్టీ సీనియర్ నేతలు కూడా అశోక్ మాట వినకతప్పడం లేదన్న వాదన నియోజకవర్గంలో బలంగా వినిపిస్తోంది. ఇప్పుడు అశోక్ వ్యవహారం పార్టీ నేతలతో పాటు సీతక్కకు సైతం తలనొప్పిగా మారిందని కాంగ్రెస్ నేతల మధ్య చర్చ జరుగుతోంది. ఇతని వ్యవహారంపై సీతక్కే ఏదో ఒకటి చేయాలని కాంగ్రెస్ నేతలు కోరుతున్నారు.
Also Read: https://www.mega9tv.com/telangana/ramachandra-rao-takes-charge-as-telangana-state-bjp-president/