
దేశ చరిత్రలో ఎంతోమంది రాజులు, జమిందార్లు,చక్రవర్తులు. ఒక్కొక్కరిది ఒక్కో చరిత్ర. కానీ చరిత్రలో నిలిచిపోయినవారు మాత్రం అతి తక్కువమందే. వీరిలో ఒక్కొక్కరు ఒక్కో ప్రత్యేకతను సంతరించుకున్నావారే. కేవలం 9 ఏళ్ల వయస్సులో సింహాసనాన్ని అధిష్టించిన చరిత్ర ఆయనది.. అంతే కాదండోయ్ అనగనగా ఓ రాజు..ఆరాజుకు ఏడుగురు భార్యలు అని చెప్పుకునేవాళ్లం.కానీ ఇక్కడ మాత్రం ఈ రాజుకి 365 మంది భార్యలు..వారి పేర్లతో 365 లాంతర్లు… 44 రోల్స్ రాయిస్ కార్లు, 500 గుర్రాలు.. ఇది కధ కాదునిజం.. ఆ రాజుగారి చరిత్ర ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
పాటియాలాకు చెందిన రాజు మహారాజా భూపిందర్ సింగ్ స్పెషలనే అని చెప్పాలి. 1891 అక్టోబరు 12న జన్మించిన భూపిందర్ సింగ్ తండ్రి మహరాజా రాజిందర్ సింగ్ 1900 నవంబర్ 9న మరణించడంతో చిన్న వయసులోనే రాజు అయ్యాడు. కేవలం 9 ఏళ్ల వయస్సులో సింహాసనాన్ని అధిష్టించిన చరిత్ర భూపిందర్ సింగ్ ది. నూనూగు మీసాల నూతన యవ్వనంలోనే 18ఏట రాజ్యభారాన్ని స్వీకరించారు. అలా ఆయన 38ఏళ్లకుపైగా రాజ్యాన్ని పాలించిన మహారాజా భూపిందర్ సింగ్ పేరు చెబితే మరో విశేషం వినిపిస్తుంది.
అవును, మహారాజా భూపిందర్ సింగ్‌కు క్రీడలంటే చాలా ఇష్టం. అతను గొప్ప క్రీడా పోషకుడు మరియు క్రీడాకారుడు కూడా. ముఖ్యంగా క్రికెట్ మరియు పోలో క్రీడలపై ఆయన ఇంట్రెస్ట్ చూపించే వారు. మహారాజా భూపిందర్ సింగ్ 1891 -1938 వరకు 10 మంది మహిళలను పెళ్లి చేసుకోగా మిగిలిన 355 మహిళలను భార్యలుగానే చూసుకున్నారంట. 88 మంది పిల్లలకు తండ్రి అయ్యాడని.. వారిలో 52 మంది బతికే ఉన్నారని చెబుతారు. ఆయనకు ఇష్టమైన రాణి మహారాణి శ్రీ బక్తవర్ కౌర్ సాహిబా.

ఈ రాణులంతా ఎప్పుడూ ఏదోఒక అనారోగ్య సమస్యలతో బాధపడేవారంట. రాజు తలచుకుంటే దేనికి కొదువా చెప్పండి. అందుకే ఓ వైద్య బృందం భార్యల కోసం ఎప్పుడు అహర్నిశలు వారి సేవల్లోనే ఉండేవారు.. వారికి చిన్న దగ్గు వచ్చినా వైద్యుల బృందం అప్రమత్తమైపోయేవారు. ఈక్రమంలో ఆ బార్యల పేపేర్లతో 365 లాంతరు దీపాలను నిత్యం వెలిగించేవారు. వీటిలో ఏ లాంతరు దీపం ఆరిపోతుందో…మహారాజా భూపిందర్ సింగ్ ఆ రాణితో గడిపేవారు. అలా నియమం పెట్టుకున్నారాయన. ఎందుకంటే దీపం ఆరిపోతే ఆరాణి చనిపోతుందని..కాబట్టి ఆ రాణితో ఉంటే ఆమె సంతోషిస్తుందనే కారణం.
మహారాజా భూపిందర్ సింగ్ గురించి దివాన్ జరామణి దాస్ తన ‘మహారాజా’ అనే పుస్తకంలో వివరంగా పేర్కొన్నారు. ఈ వివరాల ప్రకారం..భూపిందర్ సింగ్ పాటియాలాలో లీలాభవన్ కట్టించారు. ఈ భవనాన్ని పాటియాలా పట్టణంలో బౌపేరి బాగ్‌కు సమీపంలో భూపేందర్‌నగర్‌కు వెళ్లే రహదారిపై నిర్మించారు. ఈ భవనాన్నే రంగారీస్ అని కూడా అనేవారు.
ఈ ప్యాలెస్‌లో ఒక ప్రత్యేక గదిని ‘ప్రేమ్ మందిర్’ అని పిలుస్తారు. దీనిని మహారాజుకు కేటాయించారు. అంటే అతని అనుమతి లేకుండా మరెవరూ ఆ గదిలోకి ప్రవేశించకూడదు. ఈ గదిలో రాజు ఆనందం కోసం అన్నీ ఏర్పాట్లు ఉంటాయి. అతని ప్యాలెస్ లోపల ఒక పెద్ద చెరువులో ఒకేసారి సుమారు 150 మంది స్నానం చేయడానికి సౌకర్యాన్ని కూడా ఏర్పాటు చేశారు. రాజుగారికి విందులు ఇవ్వటం అలవాటు. అలా రాజు ఈభవనంలోనే విందులు ఇచ్చేవారు..ఈ విందుకు తన స్నేహితులు, స్నేహితురాళ్ళను మాత్రమే పిలిచేవారు.
విందులు ఇచ్చే మహారాజా భూపిందర్ సింగ్ కి మరో కోరిక కూడా ఉండేది. అదే కార్లు. రాజా భూపిందర్ సింగ్ వద్ద 44 రోల్స్ రాయిస్ కార్లు ఉన్నాయని, అందులో 20 కార్లు రోజువారీ కార్యకలాపాలకు ఉపయోగించేవారని చెబుతారు.ఈ రాజావారు అత్యంత ఖరీదైన కార్లతో పాటు ఓ విమానం కూడా కొన్నారు. భారతదేంలో విమానం కొన్న తొలి రాజుగా భూపిందర్ చరిత్రలో నిలిచిపోయారు. ఈ విమానాన్ని రాజు బ్రిటన్ నుండి 1910 సంవత్సరంలో కొనుగోలు చేశారు. అతను తన విమానం కోసం పాటియాలా వద్ద ఎయిర్‌స్ట్రిప్ కూడా నిర్మించారు.
మహారాజా భూపిందర్ సింగ్ అనేక విషయాలలో కూడా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ది చెందారు. అటువంటి ప్రత్యేకతల్లో ప్రపంచ ప్రఖ్యాత ‘పాటియాలా నెక్లెస్’ ఆయన వద్దే ఉండటం. దీనిని ప్రముఖ ఆభరణాల తయారీదారి కార్టియర్ తయారు చేసింది. ఈ పాటియాలా నెక్లెస్ లో 2,900కి పైగా వజ్రాలు, విలువైన రత్నాలు పొందుపరిచారు. ప్రపంచంలో ఏడవ అతిపెద్ద వజ్రం ఆ హారంలో ఉంది. ఈ విలువైన నెక్లెస్ 1948 సంవత్సరంలో పాటియాలా రాజ ఖజానా నుండి కనుమరుగైంది. చాలా సంవత్సరాల తరువాత, దాని వివిధ భాగాలు చాలా ప్రదేశాలలో ఉన్నట్లుగా కనుగొన్నారు.
భూపిందర్ సింగ్ భార్యల్లో ఒకరై మహారాణి భక్తవర్ కౌర్ 1911 ఢిల్లీ దర్బార్ సందర్భంగా భారతదేశానికి రాణి చక్రవర్తి చేసిన మొదటి పర్యటనకు గుర్తుగా లేడీస్ ఆఫ్ ఇండియా తరపున క్వీన్ మేరీకి అద్భుతమైన నెక్లెస్‌ని బహుకరించారు. కాగా మహారాణి భక్తవర్ కౌర్ రాజుగారికి ఇష్టమైన భార్య. పలు అధికారిక కార్యక్రమాలకు రాజుగారితో కలిసి ఈ రాణి పాల్గొనేవారు. ఈమె సంగ్రూర్ కు చెందిన సర్దఆర్ బహద్దూర్ సర్దార్ గుర్నామ్ సింగ్ కుమార్తె. ఈ రాజును 1908లో వివాహం చేసుకున్నారు.
ఇదండీ చరిత్రలో నిలిచిపోయిన మహారాజా భూపిందర్ సింగ్ ఇంట్రస్టింగ్ చరిత్ర.