
ఆ జిల్లాలో బీఆర్ఎస్ కు అంతంతమాత్రమే క్యాడర్ ఉంది.. ఇక ఆ నియోజకవర్గంలో అయితే కాంగ్రెస్ ముఖ్య నేతను ఎన్నికల్లో ఎదుర్కోవడానికి ఒకే ఒక్కడిని బరిలో దింపుతున్న ఏ మాత్రం ప్రభావం చూపడం లేదు. నాలుగు సార్లు వచ్చిన అవకాశాన్ని ఎంతమాత్రం ఉపయోగించుకోలేదు ఆ నేత.. దీంతో ఆ కాంగ్రెస్ నేతకు నియోజకవర్గంలో తిరుగు లేకుండా పోయింది.. బీఆర్ఎస్ ఇచ్చిన అవకాశాలను చేజార్చుకున్న ఆ నాయకుడు ఎవరూ..? వాచ్ దిస్ స్టోరీ..
ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం కాంగ్రెస్ కు కంచుకోట.. గత నాలుగు పర్యాయాలు చూసుకుంటే ఇక్కడ కాంగ్రెస్ జెండా ఎగురుతుంది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఈ నియోజకవర్గం నుండే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వరసగా నాలుగు ఎన్నికల్లో ఆయన గెలిచి రికార్డ్ సృష్టించారని చెప్పవచ్చు.. ప్రత్యర్థి పార్టీలు బలమైన నేతను ఎంచుకోక పోవడం వల్లే భట్టి గెలుపు నల్లేరుపై నడకల నడుస్తుందని ఇక్కడి ప్రజల అభిప్రాయంగా ఉంది.. అయితే భట్టికి ప్రత్యర్థిగా ప్రధాన పార్టీల నుండి ఒకే ఒక్క అభ్యర్థి లింగాల కమల్ రాజ్ రంగంలోకి దిగుతున్నాడు.
ఆయన 2009 లో జరిగిన ఎన్నికల్లో సీపీఎం అభ్యర్థిగా భట్టిపై పోటీ చేసాడు. సీపీఎం నియోజకవర్గంలో బలంగా ఉండడం వల్ల అప్పుడు స్వల్ప ఓట్లతో భట్టిపై కమల్ రాజ్ ఓటమి చెందాడు. అనంతరం వచ్చిన 2014 ఎన్నికల్లో సీపీఎంను విడిచిన కమల్ రాజ్ వైసిపిలో చేరారు. అప్పడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అండతో మరోసారి భట్టితో తలబడ్డాడు. ఆ ఎన్నికల్లో ఎదురుదెబ్బ తగిలింది. ఇక పొంగులేటి వర్గం అంతా బీఆర్ఎస్ లో చేరిన సమయంలో మరోసారి 2018 లో జరిగిన ఎన్నికల్లో కమల్ రాజ్ బీఆర్ఎస్ అభ్యర్థిగా భట్టితో తలపడ్డారు. అధికార బలంతో సైతం భట్టీని ఢీ కొట్టిన కమల్ రాజ్ గెలవలేకపోయాడు. అనంతరం మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మరొక్కసారి బీఆర్ఎస్ అండతో కమల్ రాజ్ భట్టితో పోటీ పడి ఘోర ఓటమి చావిచూసారు.
ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితుల్లో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికి ఒక్కసారి చాన్స్ రావడమే అభ్యర్థులు ఎంతో అదృష్టంగా భావిస్తారు.. అలాంటిది లింగాల కమల్ రాజ్ కు నాలుగుసార్లు అవకాశాలు వచ్చాయి. కానీ వచ్చిన ఏ అవకాశాన్ని ఆయన నిలబెట్టుకోలేక పోయారన్న విమర్శలు వస్తున్నాయి. ప్రధానంగా నియోజకవర్గ ప్రజలతో అంటిముట్టనట్లు ఆయన ఉండడం వల్లే ఎన్ని చాన్స్ లు వచ్చినా గెలవలేకపోతున్నారంట. మరో వైపు నిత్యం ఆయన వెంట నడిచే ప్రధాన లీడర్లను గుర్తించకపోవడం కూడా కమల్ రాజ్ ఓటమికి కారణంగా తెలుస్తుంది.
ఆర్థిక బలం లేకపోవడంతో ఎన్నికల సమయంలో ఆయా పార్టీలే ఆయనకు నిధులు సమకూర్చేవి.. ఆ సమయంలో వచ్చిన నిధులను కూడా ఖర్చు పెట్టకుండా ఉండేవారంటా.. కనీసం ప్రచారంలో తిరిగే వారికి కూడా భోజనాలు పెట్టేవారు కాదంట.. ప్రతిసారి సెంటిమెంట్ తోనే గెలవాలని చూసే వారే తప్పా డబ్బు ఖర్చుకు ముందుకు రాకపోయే వైఖరి కమల్ రాజ్ దని ఆయనకు దగ్గరగా ఉండే వారు చెబుతారు.
గత ఎన్నికల్లో అయితే బీఆర్ఎస్ ఒక్కో అభ్యర్థికి భారీగా నిధులు సమకూర్చింది.. అందులో మధిరకి కూడా నిధులు వచ్చాయి.. కానీ ఆయన డబ్బులు ఖర్చుపెట్టలేదన్న ప్రచారం జరిగింది. అవే డబ్బులు ఖర్చుపెట్టి ఉంటే కమల్ రాజ్ గెలిచే వారని బీఆర్ఎస్ నేతలే చర్చించుకుంటున్నారు. బీఆర్ఎస్ లో ఎవరికిరాని అవకాశాలు కమల్ రాజ్ కు వచ్చాయి.. స్థానిక సంస్థల ఎన్నికల్లో మధిర జెడ్పీటీసీగా పార్టీ నేతలు గెలుపించుకున్నారు. అనంతరం ఆయన జెడ్పీచైర్మన్ గా ఐదు సంవత్సరాల పాటు పనిచేసారు. ఆ సమయంలోను అటు మధిరలోను, ఇటు జిల్లాలోను ఎక్కడ పట్టు సాధించలేదన్న ఆరోపణలు ఉన్నాయి… జెడ్పీ చైర్మన్ గా పని చేసి గత ఎన్నికల్లో అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేసిన ఏ మాత్రం ప్రభావం చూపలేదు..
మధిరలో టీడీపీ ఓటు బ్యాంక్ కూడా కీలకంగా ఉంటుంది.. వారితో సఖ్యత లేకపోవడం కూడా కమల్వరాజ్ కు మైనస్ గా మారింది. ప్రధానంగా పొలిటికల్ లీడర్ కు ఉండాల్సిన లక్షణాలు కమల్ రాజ్ లో లేవని ఆయన అనుచరులే గుసగుసలాడుకుంటున్నారు.. కమల్ రాజ్ పోటీ చేసినంత కాలం.. కాంగ్రెస్ నేత భట్టికి నియోజకవర్గంలో తిరుగులేదంటూ ఆపార్టీ నేతలు కమల్ రాజ్ పై సెటైర్లు సైతం వేసుకుంటున్నారంట.. మరి రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ కమల్ రాజ్ తో వెళుతారా.. లేదంటే మరోనేతను ఎన్నికల బరిలో నిలుపుతారా చూడాలి.. ఇప్పటికై ఓటమి తప్పులను కమల్ రాజ్ తెలుసుకోకపోతే భవిష్యత్తులో ఆయనకు రాజకీయంగా కష్టకాలమే అని బీఆర్ఎస్ నేతలు చెప్పుకుంటున్నారు.