సంక్రాంతి పోటీకి సై అంటున్న ఆ నలుగురు..!

సంక్రాంతి వస్తుందంటే.. సినిమాల పండగ వస్తున్నట్టే. మామూలు టైమ్ లో సినిమా రిలీజ్ చేయడం వేరు.. సంక్రాంతి సీజన్ లో సినిమా రిలీజ్ చేయడం వేరు. ఆ టైమ్ లో రిలీజ్ చేస్తే.. వచ్చే కలెక్షన్స్ వేరే లెవల్లో ఉంటాయి. అందుకనే సంక్రాంతికి సినిమాలు విడుదల చేయడానికి స్టార్ హీరోలు, బడా ప్రొడ్యూసర్స్ అండ్ డైరెక్టర్స్ పోటీపడుతుంటారు. ఆల్రెడీ రానున్న సంక్రాంతికి ఇప్పటి నుంచే పోటీ మొదలైంది. తమ సినిమాను సంక్రాంతికి విడుదల చేయనున్నట్టుగా అనౌన్స్ చేస్తున్నారు. అయితే.. రానున్న సంక్రాంతికి ఆ నలుగురు పోటీకి సై అంటున్నారు. మరి కొందరు పోటీకి రానున్నారని టాక్ వినిపిస్తోంది. ఇంతకీ.. ఆ నలుగురు ఎవరు..? పోటీకి వచ్చే ఛాన్స్ ఉన్న మరి కొందరు ఎవరు..?

రానున్న సంక్రాంతికి వస్తున్న సినిమా అంటే.. ముందుగా చెప్పుకోవాల్సింది మెగాస్టార్ సినిమా గురించే. ఈ సినిమాని సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్నారు. ఇటీవల ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ చేశారు. సైలెంట్ గా అప్పుడే ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేసేసారు. ఇందులో చిరుకు జంటగా అందాల తార నయనతార నటిస్తుంది. ఓ వైపు షూటింగ్ స్టార్ట్ చేస్తూనే అనిల్ రావిపూడి తనదైన స్టైల్ లో ప్రమోషన్ షురూ చేశారు. పటాస్ దగ్గర నుంచి సంక్రాంతికి వస్తున్నాం వరకు అపజయం అనేది లేకుండా వరుసగా సక్సెస్ సాధిస్తుండడంతో అనిల్ రావిపూడి ఇప్పుడు చేస్తున్న మూవీ పై మరింత క్రేజ్ ఏర్పడింది. ఈ మూవీని సంక్రాంతికి రిలీజ్ చేయనున్నట్టుగా ప్రకటించారు.

తాజాగా రవితేజ నటిస్తున్న 76వ చిత్రాన్ని ప్రకటించారు. ఈ మూవీకి కిషోర్ తిరుమల డైరెక్టర్. ఈ సినిమాను సింగిల్ షెడ్యూల్ లో కంప్లీట్ చేసేలా ప్లాన్ చేస్తున్నారట. అయితే.. రవితేజ మాస్ హీరో.. కిషోర్ తిరుమల క్లాస్ డైరెక్టర్. ఈ మాస్ హీరో రవితేజ అండ్ క్లాస్ డైరెక్టర్ కిషోర్ తిరుమల కాంబోలో రూపొందే సినిమా ఆడియన్స్ లో ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది. ఈ సినిమా 2026 సంక్రాంతికి విడుదల అని అధికారికంగా ప్రకటించారు. గతంలో చిరు, రవితేజ కలిసి వాల్తేరు వీరయ్య అనే సినిమా చేసారు. సంక్రాంతికి రిలీజ్ చేసి సక్సెస్ సాధించారు. ఇప్పుడు రానున్న సంక్రాంతికి చిరు, రవితేజ పోటీపడుతుండడం విశేషం.

చిరు, రవితేజ తర్వాత సంక్రాంతికి వస్తున్న మరో హీరో నవీన్ పొలిశెట్టి. అనగనగా ఒక రాజు అనే సినిమా చేస్తున్నాడు. ఇది ఫుల్ లెంగ్త్ ఎంటర్ టైనర్. ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్మెంట్స్ నిర్మిస్తుంది. ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేస్తున్నట్టుగా ప్రకటించారు. ఇక సంక్రాంతికి వస్తున్న కోలీవుడ్ హీరో విజయ్. తన కెరీర్లో ఆఖరి సినిమా జన నాయగన్. ఈ సినిమాను సంక్రాంతికి జనవరి 9న రిలీజ్ చేయనున్నట్టుగా అనౌన్స్ చేశారు. ఇది విజయ్ లాస్ట్ మూవీ కాబట్టి భారీ అంచనాలు ఉన్నాయి. ఇలా సంక్రాంతికి చిరు, రవితేజ, నవీన్ పొలిశెట్టి, విజయ్ పోటీకి సై అంటున్నారు. అయితే.. బాలయ్య అఖండ 2 సంక్రాంతికి వచ్చే చాన్స్ ఉందని ప్రచారం జరుగుతుంది. అలాగే నాగార్జున సోలో హీరోగా సినిమా చేస్తే.. సంక్రాంతికి రిలీజ్ చేయచ్చు అని ప్రచారం జరుగుతుంది. అలాగే దిల్ రాజు సంక్రాంతికి తన సంస్థ నుంచి ఓ సినిమాను రిలీజ్ చేయనున్నట్టుగా టాక్. సో.. సంక్రాంతికి ఎంత మంది పోటీ పడతారు అనేది క్లారిటీ రావాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.