
Human Kidney Stones: మందులు, ఆపరేషన్ అవసరం లేకుండా కిడ్నీలో ఉన్న రాళ్లను తొలగించుకోవచ్చని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఈ 7 పానీయాలతో కిడ్నీలో రాళ్లకు చెక్ పెట్టవచ్చని అంటున్నారు. ఆ పానీయాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
ప్రస్తుత కాలంలో చాలామంది కిడ్నీల్లో స్టోన్ సమస్యతో బాధపడుతున్నారు. కిడ్నీలో రాళ్ళ వల్ల కలిగే నొప్పి భరించడం చాలా కష్టం. వాస్తవానికి మందులు, ఆపరేషన్ ద్వారా కిడ్నీ నుంచి రాళ్లను తొలగిస్తారు. కానీ, ఈ సమస్యకు ఇంట్లోనే పరిష్కారం చేసుకోవచ్చంటే నమ్ముతారా..?
కొన్ని రకాల పానీయాలను తయారుచేసుకొని తాగడం ద్వారా కిడ్నీలో రాళ్లను తొలగించుకోవచ్చని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. మందులు, ఆపరేషన్ అవసరం లేకుండా ఈ సమస్యను దూరం చేసుకోవచ్చని.. ఈ 7 పానీయాలతో కిడ్నీలో రాళ్లకు చెక్ పెట్టొచ్చు.
- మూత్రపిండాల్లో రాళ్లను తొలగించడానికి బాగా హైడ్రేటెడ్‌గా ఉండటం చాలా ముఖ్యం. కిడ్నీలో రాళ్లను నివారించడానికి లేదంటే వాటిని తొలగించడానికి పుష్కలంగా నీరు తాగడం తప్పనిసరి. తగినంత నీరు తీసుకోవడం వల్ల యూరిన్ ను పలుచన చేసి, రాళ్లను ఏర్పరిచే పదార్థాలను సైతం బయటకు పంపడానికి సాయపడుతుంది.
- నిమ్మకాయ జ్యూస్.. ఇందులో సిట్రేట్ ఉంటుంది. ఇది కాల్షియం రాళ్లను విచ్ఛిన్నం చేయడంలో తోడ్పడుతుంది. మూత్రం ద్వారా సులభంగా బయటకు వెళ్లిపోయేలా లెమన్ జ్యూస్ హెల్ప్ చేస్తుంది.
- ఆపిల్ సైడర్ వెనిగర్‌లో ఎసిటిక్ యాసిడ్ ఉంటుంది. ఇది రాళ్లను కరిగించడంలో ఉపయోగపడుతుంది. ఒక గ్లాసు నీటిలో 1-2 టేబుల్ స్పూన్ల ఆపిల్ సైడర్ వెనిగర్ కలిపి తినడానికి ముందు తాగితే మంచి రిజల్ట్ ఉంటుంది.
- తులసిలో యూరిక్ యాసిడ్ స్థాయిలను తగ్గించి, రాళ్లను విచ్ఛిన్నం చేయడంలో సాయపడే సమ్మేళనాలు ఉంటాయి. రోజూ ఒక టీస్పూన్ తులసి రసం తాగడం వల్ల మూత్రపిండాల ఆరోగ్యం మెరుగుపడుతుంది.
- గోధుమ గడ్డి రసం మూత్ర పరిమాణాన్ని పెంచి, రెగ్యులర్ గా, తరచుగా మూత్ర విసర్జన చేసేలా చేస్తుంది. ఇది రాళ్లను తొలగించడంలో సాయపడుతుంది. ఇందులో యాంటీఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయి. ఇవి మూత్రపిండాల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో హెల్ప్ చేస్తాయి.
- సెలెరీ వాటర్ లో యాంటీఆక్సిడెంట్లు, పోషకాలు ఉంటాయి. ఇవి యూరినరీ ట్రాక్ ను మెరుగుపరిచి, మూత్రవిసర్జనకు సాయపడుతుంది.
- దానిమ్మలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. దానిమ్మ రసం మూత్రంలో స్ఫటికాలు ఏర్పడటాన్ని తగ్గించడమే కాక కొత్త రాళ్లను నివారించడంలో హెల్ప్ చేస్తోంది.