
Seasonal Fruits in Rainy Season: రెండు రాష్ట్రాల్లోనూ కొన్ని రోజులుగా అడపాదడపా వర్షాలు కురుస్తున్నాయి. ఇక రాబోయేది వర్షాకాలం కావడంతో.. సీజనల్ ఫ్రూట్స్ తినడం వల్ల ఆరోగ్యానికి మేలు చేస్తోందన్న మాట వాస్తవమే కానీ కొన్ని ఫ్రూట్స్ తింటే అంతే అనారోగ్యానికి గురవుతాం. అయితే వర్షాకాలంలో కొన్ని పండ్లకు దూరంగా ఉండాలని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.
రోజూ తీసుకునే ఆహారంతో పాటు సీజనల్ ఫ్రూట్స్ తినడం వల్ల మనం హెల్తీగా ఉంటాం. అయితే ఏ సీజన్లో వచ్చే పండ్లను ఆ సీజన్లోనే తినాలని అంటారు. కానీ సీజన్ అయిపోయాక కూడా దొరికే వాటిని తినడం వల్ల లేనిపోని అనారోగ్య సమస్యలు వస్తాయి. నిజానికి ఇప్పుడు సమ్మర్ లో తినే మామిడిపండ్లు ఇంకా మార్కెట్లో అమ్ముతున్నారు. వాటిని తినడం వల్ల అజీర్తి, గ్యాస్ సమస్యలు తలెత్తుత్తాయి. అందుకే వానాకాలంలో మామిడిని తినకూడదు. దీంతోపాటు పుచ్చకాయకు కూడా దూరంగా ఉండాలి. పుచ్చకాయలో నీటిశాతం ఎక్కువగా ఉంటుంది. ఇది వాతావరణంలోని తేమకు గురై, త్వరగా పాడైపోతుంది. దీంతో వెంటనే బ్యాక్టీరియా, ఫంగస్ వ్యాప్తి చెందుతాయి. దీన్ని తినడం వల్ల డయేరియా సమస్యలు కూడా రావొచ్చు. Seasonal Fruits in Rainy Season.
అలానే వానాకాలంలో జామ, ద్రాక్ష పండ్లలకు దూరంగా ఉండాలి. జామలో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఒకటి కంటే ఎక్కువగా తింటే మలబద్ధకం, ఉబ్బరం, కడుపులో నొప్పి, గ్యాస్ అనేవి రావొచ్చు. వర్షాకాలంలో ద్రాక్ష పండ్లను తినకూడదు. ఇవి నోటికి తియ్యగా పుల్లటి రుచిని అందిస్తాయి. అయితే వీటిని వర్షాకాలంలో తీసుకుంటే పొట్ట సమస్యలకు అవకాశముంది.
ఈ కాలంలో సీతాఫలం, బొప్పాయి పండ్లను కూడా తీసుకోకూడదు. బొప్పాయితో అజీర్తి, గ్యాస్, మలబద్దకంతో పాటు కడుపులో నొప్పి సమస్యలు వస్తాయి. అలాగే సీతాఫలం శరీరంలోని జీవక్రియలను ఎఫెక్ట్ చేస్తుంది.
Also Read: https://www.mega9tv.com/life-style/here-are-the-top-6-benefits-of-makhana-checkout-the-information/