
Unhealthy Vegetables During The Monsoon: వర్షాకాలంలో వ్యాధుల బారిన పడటం చాలా సాధారణం. ముఖ్యంగా ఈ సీజన్లో అన్ హెల్తీ ఇష్యూస్ కూడా ఎక్కువగానే వస్తాయి. జీర్ణవ్యవస్థ బలహీనపడుతుంది. అందుకే తినే ఆహారం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఈ సీజన్లో కొన్ని రకాల కూరగాయలను జీర్ణం చేసుకోవడం కష్టంగా మారుతుంది. అంతేకాకుండా వాటిలో బ్యాక్టీరియా, క్రిములు ఉండే అవకాశం కూడా ఎక్కువగానే ఉంటుంది. కాబట్టి వాటిని కొన్నాళ్ళు అవాయిడ్ చేయడం బెటర్. ఆ కూరగాయలు ఏవంటే..
- ఆకుకూరలు (పాలకూర, మెంతికూర, క్యాబేజీ) వంటివి తినకుండా ఉండటం మంచిది. వర్షాల వల్ల బురద, తేమ ఆకులపై అలానే పేరుకుపోతుంది. దీనివల్ల వాటిపై బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్‌తో పాటు వివిధ రకాల పురుగులు, లార్వా పెరిగే ఛాన్స్ ఉంటుంది. ఎంత బాగా కడిగినా కూడా వీటిని పూర్తిగా తొలగించడం కష్టం. ఇవి తింటే కడుపునొప్పి, అతిసారం, ఇతర జీర్ణ సమస్యలకు దారితీస్తాయి.
- పుట్టగొడుగులు తేమ వాతావరణంలో పెరుగుతాయి. ఈ సీజన్లో వాతావరణం తేమగా ఉండటం వల్ల వాటిపై హానికరమైన బ్యాక్టీరియా కూడా పెరిగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా అడవి పుట్టగొడుగులు మరింత విషపూరితం అవుతాయి. కాబట్టి వీటికి దూరంగా ఉండాలి.
- వంకాయలు వర్షాకాలంలో తినడం అంత మంచిది కాదు. ఈ సీజన్లో వంకాయలలో చిన్న చిన్న పురుగులు ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇవి కంటికి కనిపించవు. వండుకుని తిన్నప్పుడు ఇది జీర్ణవ్యవస్థపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. అంతేకాకుండా అలెర్జీకి కారణమవుతుంది. వంకాయ చాలామందిలో వాత సమస్యలను సైతం పెంచుతుంది. వర్షాకాలంలో దీనిని తినడం వల్ల సమస్య ఎక్కువవుతుంది.
- ఈ సీజన్లో బెండకాయలో కూడా పురుగులు లేదా లార్వాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. దీని జిగట స్వభావం వల్ల కొన్నిసార్లు వీటిని పూర్తిగా శుభ్రం చేయడం కష్టమవుతుంది. బెండకాయ కొంతమందికి గ్యాస్, అజీర్ణ సమస్యలను కూడా కలిగిస్తుంది. ఇది వర్షాకాలంలో బలహీనపడిన అరిగేందుకు మరింత భారమవుతుంది. Unhealthy Vegetables During The Monsoon.
- బంగాళదుంపలు, ఉల్లిపాయలు, క్యారెట్లు, రాడిష్ వంటి దుంపలు నేల లోపల పెరుగుతాయి. ఈ సీజన్లో నేల తేమగా ఉండటం వల్ల కూరగాయలపై శిలీంధ్రాలు, బ్యాక్టీరియా అనేవి పెరుగుతాయి. వీటిని బాగా కడిగినా కూడా, వాటిలోని సూక్ష్మక్రిములు పూర్తిగా పోకపోవచ్చు.