
Indians in Abroad: ప్రపంచంలోని ఏ దేశంలో చూసినా మన భారతీయులే కనబడుతున్నారు.. నిజంగా, విదేశాల్లో మనవారు అంతమంది ఉన్నారా? అంటే ఐక్యరాజ్యసమితి వెల్లడించిన కొన్ని గణాంకాలు అవుననే అంటున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వలసదారుల్లో ఎక్కువగా భారతీయులే ఉన్నారంటూ ఐరాస ఇటీవల చెప్పింది. 2024 నాటికి ప్రపంచవ్యాప్తంగా 1.85 కోట్ల మంది ప్రవాస భారతీయులు ఉన్నట్టు, ఇది ప్రపంచ వలసదారుల్లో 6శాతంగా ఉంది.
ఒకప్పుడు సౌదీ అరేబియా, పాకిస్థాన్ లాంటి దేశాలకే పరిమితమైన భారతీయ వలస సముదాయం ఇప్పుడు పశ్చిమ దేశాలకు సైతం బదిలీ అయ్యింది. పశ్చిమాసియాలోని ఇండియన్ డయాస్పొరాను తీసుకుంటే యూఏఈలోని మొత్తం జనాభాలో 40 శాతం (ఇంచుమించు మూడో వంతు) భారతీయ వలసదారులే ఉన్నారంటే నమ్ముతారా? ఇక అమెరికాలో ఇండోఅమెరికన్ల పరంగా చూసుకుంటే రెండో అతిపెద్ద ఆసియన్ గ్రూప్‌గా ఉన్నారట. అంటే, మొదటి స్థానంలో చైనీస్ అమెరికన్లు ఉన్నారు. Indians in Abroad.
వలసకు చాలా కారణాలు ప్రభావితం చేస్తాయి. ఆర్థిక కారణాలైన నిరుద్యోగం, తక్కువ వేతనాలు, జీవన ప్రమాణాలు తక్కువగా ఉండటం, మతపరమైన, సామాజికపరమైన ఒత్తిడి, ప్రకృతి వైపరీత్యాలు, పౌర యుద్ధం ప్రధానంగా కనిపిస్తే.. పై చదువులు, ఉన్నత ఉద్యోగాలు, ఎక్కువ వేతనం, లగ్జరీ లైఫ్, మెరుగైన జీవన ప్రమాణాలు, విద్య, ఆరోగ్య సేవలు మొదలైనవి వలసలను పెంచే ఆకర్షక కారణాలవుతున్నాయి.