వర్షాకాలంలో.. డైజేషన్‌ అంత ఈజీ కాదు!

Digestion During the rainy season: వర్షాకాలంలో హెల్త్‌ ఎప్పుడు ఒకేలా ఉండదు. జలుబు, తలనొప్పి, ఫీవర్‌ లాంటివి ఏదోటి వస్తూనే ఉంటాయి. మనం తీసుకునే ఆహారం దీనికి ప్రధాన కారణమవొచ్చు. దీంతో జీర్ణక్రియ మందగిస్తుంది. అలాంటప్పుడు ఈ కాలంలో తేలికగా జీర్ణమయ్యే ఆహారం ఎంచుకొని తీసుకోవడం మంచిదంటున్నారు హెల్త్‌ నిపుణులు. మరి, ఈ కాలంలో ఫుడ్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో చూద్దాం:

వర్షాకాలంలో నూనెలో వేయించిన ఆహార పదార్థాలు, ఫ్రైడ్ ఫుడ్స్ అనేవి మంచివి కాదు. ఎందుకంటే అవి త్వరగా జీర్ణంకావు. ఫలితంగా జీర్ణ సంబంధిత సమస్యలొస్తాయి. అంతేకాదు ఇలాంటి ఆహారం బరువు పెరిగేలా చేసి, ఇతర అనారోగ్యాలకూ దారితీస్తుంది. అందుకే వీటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.

ముఖ్యంగా బయట దొరికే పానీపూరీ లాంటివి తినడం వల్ల విరేచనాలు, పచ్చకామెర్లు లాంటి సమస్యలు తలెత్తొచ్చు. ఇందుకు వాటి తయారీలో వాడే కలుషితమైన నీరే కారణం. అలాగే వీటితోపాటు బయట దొరికే పండ్లరసాలకు కూడా దూరంగా ఉండండి. Digestion During the rainy season.

ఇంట్లో పండ్లు, కూరగాయలు ముందురోజు రాత్రే కట్ చేసుకొని పెట్టుకుంటారు కొందరు. అయితే వర్షాకాలంలో ఈ పద్ధతి అసలు మంచిది కాదు. ఎందుకంటే కట్ చేసుకొని పెట్టుకున్నపండ్లు, కాయగూరల ముక్కల్ని ఎంత జాగ్రత్తగా ఉంచినా, ఈ కాలంలోవాతావరణంలోని తేమ ఎక్కువగా చేరి, వాటిపై బ్యాక్టీరియా చేరే అవకాశం ఉంటుంది. వీటిని అలాగే తినడం వల్ల లేనిపోని ఆరోగ్య సమస్యలొస్తాయి. కాబట్టి వీటిని ప్రెష్‌గా వాడుకోవడం మంచిది.

ఈ కాలంలో మాంసాహారం ఎక్కువగా తినడం వల్ల డైజెస్టివ్ సమస్యలు వస్తాయి. వర్షాకాలమైనా నిర్లక్ష్యం చేయకుండా వ్యాయామం చేయడంవల్ల ఇమ్యునిటీ పెరుగుతుంది. హెల్తీగా ఉంటారు.

వర్షాకాలంలో పొట్ట నిండుగా కాకుండా కొంత తేలికగా, తక్కువగా భోజనం తినడం బెటర్‌. ఈ కాలంలో అజీర్తి సమస్యలు ఎక్కువగా ఏర్పడతాయి. కావున సరిపడా నీరు, తినే ముందు చేతులు శుభ్రంగా కడుక్కోవడం లాంటి అలవాట్ల వల్ల వ్యాధుల బారిన పడకుండా ఉంటారని గుర్తుంచుకోండి.

Also Read: https://www.mega9tv.com/life-style/shouldnt-guavas-be-eaten-during-the-rainy-season-checkout-the-information/