
Sleep Heart attack Causes: షిప్ట్ డ్యూటీలు, పరీక్షలు, నచ్చిన సినిమా, లేట్ నైట్ పార్టీలు.. ఓవర్ నైట్ పనుల వల్ల నిద్రకు సరైన సమయం అంటూ ఏం ఉండదు. ఎప్పుడు నిద్ర వస్తే అప్పుడు.. ఎప్పుడు పడితే అప్పుడు టైం దొరికితే చాలు.. నిద్ర పోయేందుకు ఉపక్రమిస్తాం. కానీ ఇలా వేళాపాళా లేని నిద్రతో గుండెపోటు వస్తోందని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. నిద్ర విషయంలో సరైన టైమింగ్‌ను పాటించకపోతే ముప్పు మరింత తప్పదని హెచ్చరిస్తున్నారు. వీలున్నప్పుడు, మీకు నచ్చినపుడు 7-8 గంటలు నిద్రపోయినా దానివల్ల ఉపయోగముండదు. అది భర్తీ అవ్వదు కూడా. డైలీ మీరు పడుకునే టైమింగ్‌కల్లా కచ్చితంగా నిద్రపోకపోతే గనుక గుండెపోటు ముప్పు 26% పెరుగుతుందని ఈ రీసెర్చ్‌లో తేలింది.
మనిషి జీవితంలో పైకి ఎదిగేందుకు క్రమశిక్షణ ఎంత ముఖ్యమో… మనం ఆరోగ్యంగా ఉండేందుకు కూడా ఒక క్రమపద్దతితో కూడిన నిద్రాహారాలు ముఖ్యం. క్రమ పద్ధతి లేకుండా తినడం ఎంత ప్రమాదమో.. ఒక్కొక్క రోజు ఒక్కో సమయంలో నిద్రపోవడం వల్ల శరీరంలోని అంతర్గత జీవ గడియారం అనేది క్రమంగా దెబ్బతింటుంది. ఫలితంగా కడుపులో మంట, అధిక రక్తపోటు, గుండె, రక్తనాళాలకు సంబంధించి సమస్యలకు దారితీస్తాయి. కాబట్టి మనం ఎంతసేపూ నిద్రపోతున్నామన్నది కాదు, ఎప్పుడు నిద్రపోతున్నామనేదే ముఖ్యమని గుర్తుంచుకోండి. Sleep Heart attack Causes.
టైమింగ్ పాటించని నిద్రవల్ల గుండెపోటు ముప్పు పెరిగేందుకు అవకాశం ఎక్కువగా ఉంది. ప్రతి రోజూ నిలకడగా ఒకే సమయానికి నిద్రకు ఉపక్రమించడం వల్ల శరీరం బ్యాలెన్సింగ్‌గా ఉంటుంది. హర్ట్ రిలేటెడ్ వ్యవస్థపై ఒత్తిడిని తగ్గిస్తుంది. గుండె ఆరోగ్యం కోసం క్రమం తప్పకుండా ఒకే సమయంలో నిద్రకు ఉపక్రమించడం మంచిది. మనం గ్రహించాల్సిన మరో విషయమేంటంటే.. వర్కింగ్ డేస్‌లో నష్టపోయిన నిద్రను వారాంతాల్లో భర్తీ చేదామనుకుంటారు చాలామంది. దీనివల్ల పెద్దగా ప్రయోజనం ఉండదు. నిద్ర సమయాలను తరచూ మార్చడం వల్ల జరిగిన నష్టాన్ని పూడ్చడం సాధ్యం కాకపోగా.. మీ శరీరం బ్యాలెన్స్ ఔట్ అయిపోతుందని మరవద్దు.