
UPF’s Ultra Processed Foods: యూపీఎఫ్‌ఎస్.. అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్.. ప్రతి స్ట్రీట్‌లో.. ప్రతి మాల్‌లో.. వెతుక్కొని మరీ తినేంత ఈ చిరుతిళ్ల వల్ల మీరెంత నష్టపోతున్నారో తెలుసా.. వాస్తవానికి బయటి ఫుడ్ తినడం ఎంత డేంజరో రోజు వార్తల్లో చూస్తూనే ఉన్నాం. మళ్లీ ఇందులో స్పెసిఫిక్‌గా జంక్ ఫుడ్ అని, అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ అంటూ పేరుకొక్క హెల్త్ ఇష్యూస్ పెరిగిపోతున్నాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోతుంది.
అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్.. ఫ్యాట్, చక్కెర, ఉప్పు ఎక్కువ.. న్యూట్రియంట్స్ తక్కువగా లభించే రెడీ టు ఈట్ అలానే ఈజీగా పిల్లలను ఎట్రాక్ట్ చేసే ఈ పదార్థాలను రెగ్యులర్‌గా, ఎక్కువగా తీసుకోవడం వల్ల లాంగ్ రన్‌లో లంగ్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని తాజా అధ్యయనం ఒకటి హెచ్చరిస్తోంది. దీనికి సంబంధించి హెల్త్, డైలీ అలవాట్లను కలిగి ఉన్న దాదాపు లక్ష మందికిపైగా అడల్ట్స్ పై జరిపిన రీసెర్చ్‌లో ఈ విషయం బయటపడింది. UPF’s Ultra Processed Foods.
అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ తీసుకునే అలవాట్లనుబట్టి వీరిని ముందుగా నాలుగు గ్రూపులుగా డివైడ్ చేశారు. వీరిలో అల్ట్రా ప్రాసెస్డ్ పదార్థాలను తక్కువ మోతాదులో తీసుకునేవారితో పోలిస్తే, ఎక్కువ మొత్తంలో తీసుకునేవారిలో లంగ్ క్యాన్సర్ వచ్చే ముప్పు 41% ఎక్కువగా ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు. కాబట్టి పెద్దలనే కాదు, ఈరోజుల్లో పిల్లలు ఎక్కువగా ఇష్టపడే ఈ ప్యాక్డ్, యాడెడ్ షుగర్డ్ ఫుడ్స్, డ్రింక్స్‌కి ఎంత వీలైతే అంత దూరంగా ఉంచడం, తినే అలవాటును మాన్పించడం చాలా ఉత్తమం.