
Skin problems during the monsoon: ఈ కాలంలో వాతావరణంలో తడి, తేమ పెరగడం వల్ల మన చర్మంలో నూనె గ్రంథులు ఎక్కువ ఆయిల్‌ను స్రవిస్తాయి. ఇంకేముంది స్కిన్ పోర్స్ అనేవి మూసుకుపోయి, అక్కడ బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది. అప్పటికే ఉన్న మొటిమల/ యాక్నే సమస్య మరింత ఎక్కువైపోతుంది. ఇలా జరగకుండా ఉండాలంటే, ఫేస్ ని శుభ్రంగా ఉంచుకోవాలి. నాన్ గ్రీజీ మాయిశ్చరైజర్లను వాడుకోవాలి. అలాగే వానాకాలంలో ఎండ తక్కువగానే ఉన్నప్పటికీ సన్ స్క్రీన్‌ని అప్లై చేయాలి.
ఈ కాలంలో జుట్టు బాధలు మామూలుగా ఉండవు. ఒకటి వానకు తడవడం లేదంటే.. తడిచిన జుట్టు సరిగా ఆరకపోవడం వల్ల వెంట్రుకల కుదుళ్లలో నూనె గ్రంథ్రులు ఎక్కువగా నూనెలను స్రవించడం వల్ల అక్కడ ఫంగస్ చేరి, చుండ్రు సమస్య కూడా పెరుగుతుంది. వెంట్రుకలు కూడా ఎక్కువగా రాలిపోతూ ఉంటాయి. ఈ సమస్యలు రాకుండా ఉండాలంటే ఈ కాలంలో యాంటీఫంగల్ షాంపూలను ఉపయోగించాలి. Skin problems during the monsoon.
ఈ కాలంలో ఇళ్లలో సాయంత్రం అయ్యిందంటే చాలు.. దోమలతో పాటు కొన్ని రకాల కీటకాలు/ పురుగులు కూడా ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి. ఇవి శరీరం మీద వాలినప్పుడు లేదా కుట్టినప్పుడు వాటి నుంచి కొన్ని స్రావాలు రీలీజై, చర్మం మీద దద్దుర్లు లాంటివి వస్తాయి. కాబట్టి ఇవి ఇంట్లోకి రాకుండా దోమ తెరలు, మెష్ డోర్‌లాంటివి, కిటికీలు వేయడం లాంటి జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి.