"ఈశ్వర్" గా వచ్చి ప్రేక్షకులను ఆకట్టుకునే "స్పిరిట్"తో దూసుకుపోతున్నాడు.. భారతీయ సినిమా “ఛత్రపతి” బర్త్ డే స్పెషల్

భారతీయ సినిమాను ‘బాహుబలి’కి ముందు, తర్వాత అని విభజించే స్థాయికి మన తెలుగు సినిమా ఎదిగింది. ఈ ఎదుగుదల వెనుక, ఈ బాక్సాఫీస్ విప్లవం వెనుక ఉన్న ఏకైక పేరు ప్రభాస్. ఒకప్పుడు సౌత్ ఇండియాకే పరిమితమైన మన మార్కెట్ ను, బాలీవుడ్ కోటలు బద్దలు కొట్టి, గ్లోబల్ లెవల్ లో నిలబెట్టిన ఘనత కచ్చితంగా డార్లింగ్ ప్రభాస్ దే.
రెబల్ స్టార్ కృష్ణంరాజు వారసుడిగా 2002లో జయంత్ సి పరాన్జీ దర్శకత్వంలో ఈశ్వర్ సినిమాతో ప్రభాస్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. తొలి సినిమాలోనే ధూల్ పేట్ కుర్రాడిగా తన మాస్ యాటిట్యూడ్ తో, బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీతో ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత వచ్చిన రాఘవేంద్ర పరాజయం పాలైనా..ఆ తర్వాత ఎం.ఎస్.రాజు నిర్మించిన వర్షం సినిమాతో ఇండస్ట్రీలో ఒక సాలిడ్ బేస్ ఏర్పాటు చేసుకున్నాడు. ఆ సినిమాలో స్టైలిష్ అండ్ హ్యాండ్ సమ్ హీరోగా ప్రభాస్ యాక్టింగ్, వర్షంలో ఫైట్ సీన్స్, త్రిషతో రొమాంటిక్ ట్రాక్ యూత్ ను విపరీతంగా ఆకట్టుకున్నాయి. వర్షం బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత ప్రభాస్ కు విపరీతమైన మాస్ ఫాలోయింగ్ ఏర్పడింది. అయితే ఆ తర్వాత వచ్చిన అడవి రాముడు, చక్రం లాంటి సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడ్డాయి. అవి నిరాశపరిచినా, 2005లో ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఛత్రపతి సినిమా ప్రభాస్ లోని ఉగ్రరూపాన్ని బయటకు తీసింది. మదర్ సెంటిమెంట్, మాస్ యాక్షన్ సీక్వెన్స్ లతో ఛత్రపతి టాలీవుడ్ రికార్డులను తిరగరాసింది.ఛత్రపతి బ్లాక్ బస్టర్ హిట్ తో ప్రభాస్ టాలీవుడ్ టాప్ హీరోల లీగ్ లోకి ఎంటర్ అయిపోయాడు.అయితే ఆ తర్వాత పౌర్ణమి, యోగి లాంటి సినిమాలు నిరాశపరిచినా.. వంశీ పైడిపల్లి మున్నా మంచి మ్యూజికల్ హిట్ గా నిలిచింది. ఇక పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన బుజ్జిగాడు సినిమాలో తనదైన మాస్ అండ్ కామెడీ టైమింగ్ తో కొత్త ప్రభాస్ ను చూశాం. 2009లో వచ్చిన బిల్లా సినిమాలో డాన్ గా, దొంగ రంగా గా డ్యూయల్ రోల్ లో ప్రభాస్ స్టైలిష్ అప్పీరెన్స్ సూపర్ అంతే.



