బాక్సాఫీస్ దగ్గరే కాదు..అవార్డుల్లో కూడా ధురంధర్ ప్రభంజనం

ధురంధర్ సినిమా రెండు భాగాలూ కూడా ఒక దానిని మించి ఒకటి అద్భుతంగా ప్రేక్షకులను ఆకట్టుకుని బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని నమోదు చేసిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా ఈ సినిమా ప్రభంజనం సృష్టించింది. ఆదిత్య ధార్ తెరకెక్కించిన ఈ సినిమాలో రణ్ వీర్ సింగ్ ప్రధాన పాత్రలో అదరగొట్టారు. దేశవ్యాప్తంగానే కాకుండా అంతర్జాతీయ స్థాయిలోనూ ఈ చిత్రాల ప్రభంజనం సినిమా ప్రేమికులను విపరీతంగా ఆకట్టుకుంది. ప్రతీ సన్నివేశంలోనూ ఉత్కంఠభరితమైన మలుపులు, దేశభక్తి అంశాలు ప్రేక్షకులను కట్టిపడేశాయి.ఈ రెండు భాగాలలోనూ ప్రధాన పాత్ర పోషించిన రణ్ వీర్ సింగ్ తన అద్భుతమైన నటనతో సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లారు. కేవలం యాక్షన్ సీక్వెన్స్లలోనే కాకుండా, తీవ్రమైన భావోద్వేగాలను పండించడంలో ఆయన చూపిన ప్రతిభ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఆయన పాత్రలోని వైవిధ్యం, బాడీ లాంగ్వేజ్ మరియు సంభాషణలు చెప్పే విధానం ప్రేక్షకులకు ఒక సరికొత్త అనుభూతినిచ్చాయి. ఆయనతో పాటు ఇతర నటీనటులు కూడా తమ పాత్రలకు పూర్తి న్యాయం చేయడంతో సినిమా విజయం మరింత సులభమైంది. సాంకేతికంగా కూడా ఈ చిత్రాలు అత్యున్నత ప్రమాణాలను పాటించాయి. అద్భుతమైన సినిమాటోగ్రఫీ, నేపథ్య సంగీతం మరియు పకడ్బందీ కథనం సినిమాకు ప్రధాన బలంగా నిలిచాయి. ఆదిత్య ధార్ దర్శకత్వ ప్రతిభ, ప్రతి సన్నివేశాన్ని తెరకెక్కించిన తీరు ప్రేక్షకులను కథలో లీనం అయ్యేలా చేశాయి. మొత్తానికి, 'ధూరంధర్' రెండు భాగాలు కూడా భారతీయ చలనచిత్ర చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోయాయి.పాకిస్తాన్ అండర్ వరల్డ్ మాఫియా, రాజకీయాలు, భారత్ నుండి వెళ్లిన స్పై చేసే పోరాటాలు ఆద్యంతం సినిమాను ప్రేక్షకులు ఆసక్తిగా చూసే విధంగా చేశారు. మొదటి పార్ట్ విడుదలై భారీ విజయాన్ని అందుకున్న కొద్ది నెలల్లోనే రెండో పార్ట్ తో అంతకు మించిన హిట్ ను అందుకుని ప్రేక్షకులకు భారీ ట్రీట్ ను ఇచ్చి ఇండియన్ సినిమా హిస్టరీలో రికార్డులు సృష్టించారు. సంజయ్ దత్, సారా అర్జున్, అక్షయ్ ఖన్నా, అర్జున్ రాంపాల్, డానిష్ పండర్, ఆర్. మాధవన్, రాకేష్ భేడి తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపించారు. ప్రతి నటుడిని ఎంత మేరకు కావాలో అంతవరకు చక్కగా సద్వినియోగం చేసుకుంటూ ఆసక్తికరమైన కథనాలతో తెరకెక్కించి అందరి మన్ననలు పొందారు దర్శకుడు ఆదిత్య ధార్. తాజాగా ఈ సినిమా ఐఫా అవార్డులలో కూడా సత్తా చాటింది. ప్రధాన విభాగాల్లో 12 అవార్డులు గెలుచుకుని అదరగొట్టింది. ఉత్తమ చిత్రంతో పాటు, ఉత్తమ సినిమాటోగ్రఫీలో వికాస్ నౌలఖా, ఉత్తమ స్క్రీన్ ప్లే ఆదిత్య ధర్, ఉత్తమ డైలాగ్స్ ఆదిత్య ధర్, ఉత్తమ దర్శకుడిగా ఆదిత్య ధర్, ఉత్తమ నటుడుగా రణ్ వీర్ సింగ్, ఉత్తమ విలన్ గా అక్షయ్ ఖన్నా, ఉత్తమ ఒరిజినల్ కథకు ఆదిత్య ధార్ కు, ఉత్తమ ఎడిటింగ్ కు శివకుమార్ వి. పనికర్, ఉత్తమ సౌండ్ డిజైన్ బిశ్వదీప్ ఛటర్జీ ఇలా అవార్డులతో నిలిచింది. ధురంధర్ తో పాటు, చావా, సైయారా సినిమాలు కూడా అవార్డులు కైవసం చేసుకున్నాయి.



