శ్రీలీల ముంబైలో ఉండటానికి అసలు కారణం ఇదే..!

పెళ్లిసందD సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి గ్లామరస్ ఎంట్రీ ఇచ్చి.. రవితేజ ధమాకా సినిమాతో ఓవర్నైట్ స్టార్ హీరోయిన్ అయిపోయిన డ్యాన్సింగ్ క్వీన్ శ్రీలీల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒక దశలో టాలీవుడ్ లో ఏ అగ్ర హీరో సినిమా చూసినా శ్రీలీలనే హీరోయిన్. ఇండస్ట్రీలో ఉన్న కుర్రకారును తన డ్యాన్స్ తో, క్యూట్ ఎక్స్ప్రెషన్స్తో ఉర్రూతలూగించిన ఈ బ్యూటీ.. గత కొంతకాలంగా టాలీవుడ్ కు పూర్తిగా దూరంగా ఉంటోంది. ఒకప్పుడు వరుస ఆఫర్లతో డేట్స్ అడ్జస్ట్ చేయలేనంత బిజీగా ఉన్న శ్రీలీల, సడెన్ గా సైలెంట్ అయిపోయేసరికి.. ఇండస్ట్రీలో ఎన్నో పుకార్లు మొదలయ్యాయి. శ్రీలీల స్పీడ్ తగ్గిందని, ఆమె సినిమాలు ఫ్లాప్ అవ్వడం వల్లే కొత్త ఆఫర్లు రావడం లేదని, ఇక టాలీవుడ్ లో ఆమె పని అయిపోయిందని సోషల్ మీడియాలో ఎవరికి తోచినట్లు వాళ్లు రూమర్స్ స్ప్రెడ్ చేశారు. కానీ, తన కెరీర్ లో వచ్చిన ఈ గ్యాప్ వెనుక ఉన్న అసలు కారణం ఏంటో, తాను ఎందుకు టాలీవుడ్ ను వదిలేసి ముంబైకి మకాం మార్చాల్సి వచ్చిందో స్వయంగా శ్రీలీలనే బయటపెట్టింది.
కేవలం 5 నెలల వ్యవధిలోనే ఆమె నటించిన ఏకంగా 5 సినిమాలు థియేటర్లలోకి వచ్చాయి. రామ్ పోతినేనితో స్కంద, బాలకృష్ణ ప్రధాన పాత్రలో నటించిన భగవంత్ కేసరి, వైష్ణవ్ తేజ్ తో ఆదికేశవ, నితిన్ తో ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్, మహేశ్ బాబుతో చేసిన గుంటూరు కారం..అయితే వీటిలో భగవంత్ కేసరి మినహా మిగతా సినిమాలు ఆశించిన స్థాయిలో బాక్సాఫీస్ వద్ద ఆడలేదు. దీంతో శ్రీలీల మీద నెగెటివ్ కామెంట్స్ స్టార్ట్ అయ్యాయి. ఆమె ఫ్లాప్ హీరోయిన్ అని, డైరెక్టర్లు ఆమెను పక్కనపెట్టేశారని వార్తలు రావడం మొదలయ్యాయి. కానీ, శ్రీలీల ఆ రూమర్స్ దేనికీ స్పందించలేదు. సైలెంట్ గా తన పనుల్లో తాను బిజీ అయిపోయింది. చాలా నెలల తర్వాత తాజాగా జరిగిన ఓం సినిమా ఈవెంట్ లో ఆ నెగెటివ్ ట్రోల్స్ కు గట్టి కౌంటర్ ఇచ్చింది.



