
మాస్ మూవీ మేకర్స్ బ్యానర్‌లో “బేబి” వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత పలు క్రేజీ ప్రాజెక్ట్స్ ప్రొడ్యూస్ చేస్తున్నారు సక్సెస్ ఫుల్ యంగ్ నిర్మాత ఎస్‌కేఎన్. ఆయన నిర్మాణంలో ప్రస్తుతం కిరణ్ అబ్బవరం “చెన్నై లవ్ స్టోరీ”, హిందీ “బేబి”తో పాటు ఇద్దరు కొత్త దర్శకులతో ఇంట్రెస్టింగ్ మూవీస్ రాబోతున్నాయి. నేడు పుట్టినరోజు జరుపుకుంటున్న ఎస్‌కేఎన్ నిర్మాతగా తన కెరీర్ విశేషాలను, ప్రస్తుతం చేస్తున్న మూవీస్ ప్రోగ్రెస్‌ను మెగా9తో పంచుకున్నారు. Producer SKN Birthday Special Interview
- నేను మెగా ఫ్యామిలీ అభిమానిని. ఆ కుటుంబానికి దగ్గరగా ఉండాలనే కోరికతో ఇండస్ట్రీకి వచ్చాను. చిన్నప్పటి నుంచి వ్యాసరచన పోటీలు, డిబేట్స్ లో రాష్ట్రస్థాయిలో మొదటి, ద్వితీయ స్థానాలు సాధించాను. అలా సినిమా స్క్రిప్ట్స్ రాయాలనే ఆలోచనలు కూడా ఉండేవి. తర్వాత పీఆర్ఓగా కెరీర్ స్టార్ట్ చేశా. కొన్నాళ్లకు మారుతి..ఇలా పీఆర్ఓ గా ఉండిపోతావా అని అంటూ నేను డైరెక్షన్ చేస్తా, మీరు ప్రొడ్యూస్ చేయండని ప్రోత్సహించాడు. మారుతి డైరెక్షన్‌లో నేను, శ్రేయాస్ శ్రీను కలిసి ఈ రోజుల్లో మూవీ నిర్మించాం. ఆ సినిమా సక్సెస్‌తో ప్రొడ్యూసర్‌గా నా జర్నీ మొదలైంది.
- హిందీ బేబి పనులు జరుగుతున్నాయి. నెక్ట్స్ మంత్ నుంచి షూటింగ్ ప్రారంభించాలని ప్లాన్ చేస్తున్నాం. తెలుగులో కంటే ఇంటెన్సివ్‌గా హిందీ బేబి ఉంటుంది. ఇండస్ట్రీలో ఒక పెద్దగా ఉన్న అల్లు అరవింద్ గారు నాపై నమ్మకం పెట్టుకోవడం అనేది నా అదృష్టం. నేను యూవీ క్రియేషన్స్‌తో, పీపుల్ మీడియా ఫ్యాక్టరీతో, గీతా ఆర్ట్స్‌తో, మైత్రీ వాళ్లతో కలిసి సినిమాలు చేస్తున్నానంటే అందుకు అరవింద్‌గారు ఇచ్చిన స్వేచ్ఛ, ప్రోత్సహమే కారణం. అందుకు ఆయనకు ఎప్పటికీ రుణపడి ఉంటాను. తెలుగు అమ్మాయిలను హీరోయిన్స్‌గా పరిచయం చేస్తున్నాం. ఇప్పటిదాకా ఏడెనిమిది మందిని పరిచయం చేశాం. మరో ఇద్దరు ముగ్గురిని త్వరలో ఇంట్రడ్యూస్ చేయబోతున్నాం. హిందీ బేబి మూవీ నెక్ట్స్ మంత్ షూటింగ్ ప్రారంభిస్తాం. చెన్నై లవ్ స్టోరీ సెట్స్ మీద ఉంది. కృష్ణ అనే ఒక టాలెంటెడ్ డైరెక్టర్ ను ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. Producer SKN Birthday Special Interview