వెరీ డేంజరస్.!

Mosquitoes Disease Malaria: ప్రపంచంలో అనేక భయంకరమైన జీవులు ఉన్నాయి. అడవికి రాజు సింహం, సముద్రంలో షార్క్, లేదా విషపూరితమైన పాముల గురించి వింటేనే ఒళ్లు జలదరిస్తుంది. వాటిని మించిన ప్రమాదం ఇంకేం ఉంటుంది అనుకుంటాం. కానీ, అసలు మ్యాటర్ వేరు. సైజులో మన కంటికి చాలా చిన్నగా కనిపించే, మన చుట్టూ తిరిగే ఒక కీటకం ఈ లిస్ట్‌లో టాప్‌లో ఉంది. ఇది ఏటా లక్షల మంది ప్రాణాలు బలిగొంటూ భూమిపైనే డేంజరస్ జీవిగా పేరు తెచ్చుకుంది. ఆ సీక్రెట్ కిల్లర్ ఏదో కాదు, దోమ.

మామూలుగా చూసే దోమ అత్యంత ప్రమాదకరమైన జీవిగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రిపోర్ట్స్ చెబుతున్నాయి. వేటాడే క్రూరమైన జంతువుల కంటే ఈ చిన్న కీటకమే మనుషుల ప్రాణాలను ఎక్కువగా తీస్తుంది. అయితే, దాని ప్రమాదం దాని శక్తిలో కాకుండా అది వ్యాప్తి చేసే వ్యాధుల్లో ఉంటుంది. దోమల ద్వారా సంక్రమించే వ్యాధులతో ఏటా 7 లక్షల నుంచి 10 లక్షల మంది చనిపోతున్నారని గ్లోబల్ హెల్త్ రిపోర్ట్స్ చెబుతున్నాయి. దోమల ద్వారా సంక్రమించే వ్యాధుల లిస్ట్ చాలా పెద్దది.

మలేరియా: ప్రపంచవ్యాప్తంగా మరణాలకు కారణమవుతున్న ఈ వ్యాధి.. దోమల కారణంగానే వ్యాప్తి చెందుతుంది. 2023లో కూడా మలేరియా కారణంగా దాదాపు 6 లక్షల మంది చనిపోయారని WHO రిపోర్ట్స్ ద్వారా తెలిసింది. వీటిలో 75 శాతానికి పైగా 5 ఏళ్ల లోపు పిల్లలే ఉండటం దురదృష్టకరం. డెంగీ ఫీవర్: ఇది సిటీలు, అర్బన్ ఏరియాస్‌లో వేగంగా వ్యాపించే వైరల్ ఇన్‌ఫెక్షన్. జ్వరం తీవ్రంగా ఉన్నప్పుడు రక్త కణాలు తగ్గిపోయి ప్రాణాంతకంగా మారుతుంది. చికెన్ గున్యా: ఇది కూడా తీవ్రమైన జాయింట్ పెయిన్, ఫీవర్‌తో చాలా ఇబ్బంది పెడుతుంది.

జీకా వైరస్, ఎల్లో ఫీవర్: ముఖ్యంగా ట్రాపికల్, సబ్‌ట్రాపికల్ ఏరియాస్‌ నుంచి వచ్చే టూరిస్ట్‌లు ఈ వ్యాధుల బారిన పడే ఛాన్స్ ఉంటుంది. దోమల తర్వాత భయంకరమైన జీవి పాము అని తేలింది. పాము కాట్ల వల్ల ఏటా దాదాపు 50,000 నుంచి 1,38,000 మంది వరకు చనిపోతున్నారని అంచనా. ఈ సంఖ్య ప్రాంతాలను బట్టి మారుతూ ఉంటుంది. ఇండియా, ఆఫ్రికా లాంటి దేశాల్లో నాటు వైద్యం, హాస్పిటల్స్ లేకపోవడం మరణాల రేటు పెరగడానికి ఒక ప్రధాన కారణం.

దోమల సంతానోత్పత్తి శక్తి అద్భుతం. అవి చాలా ఫాస్ట్‌గా వృద్ధి చెందుతాయి. నీరు ఉన్న ఏ ప్రాంతంలోనైనా ఇట్టే నివాసం ఏర్పరచుకుంటాయి. దీనివల్లే దోమల పాపులేషన్‌ను కంట్రోల్ చేయడం చాలా కష్టంగా మారింది. అందుకే, ఏటా ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా, అవి కంట్రోల్ అవ్వట్లేదు. దోమల నుంచి వచ్చే వ్యాధులను కంట్రోల్ చేయాలంటే, వాటి పాపులేషన్‌ను కంట్రోల్ చేయడం తప్ప మరో మార్గం లేదు.
పెరిగిన దోమల రెసిస్టెన్స్దోమలను కంట్రోల్ చేయడానికి దశాబ్దాలుగా వాడే కీటక సంహారకాలు ఇప్పుడు అంతగా పనిచేయట్లేదు. అవి చాలా వేగంగా ఈ కెమికల్స్‌కి రెసిస్టెన్స్ డెవలప్ చేసుకుంటున్నాయి. దీంతో ప్రభుత్వాలు, హెల్త్ ఆర్గనైజేషన్స్‌కు వీటిని కంట్రోల్‌ చేయడం కష్టమైపోయింది. ముఖ్యంగా ఆఫ్రికా, ఆసియా ప్రాంతాల్లో ఈ డ్రగ్ రెసిస్టెన్స్ వల్ల మలేరియా ట్రీట్‌మెంట్ సవాల్‌గా మారింది. Mosquitoes Disease Malaria.

అంతేకాకుండా, వాతావరణ మార్పుల కారణంగా దోమలు ఇప్పుడు చల్లటి ప్రదేశాలకు, ఇంతకుముందు లేని అత్యంత ఎత్తైన ప్రాంతాలకు కూడా వ్యాప్తి చెందుతున్నాయి. అందుకే వాటిని కంట్రోల్ చేయడంలో కొత్త సైంటిఫిక్ ఇన్నోవేషన్స్ అవసరం ఏర్పడింది.