ఇమ్యునిటీని పెంచే ఆల్‌బుకరా పండ్లను తింటున్నారా..?

Aloo Bukhara fruit Health benefits: వర్షాకాలంలో ఎక్కువగా దొరికే ఈ పండ్లను తినడం వల్ల ఈ సీజన్‌లో ఎదురయ్యే హెల్త్‌ సమస్యలను ఈజీగా ఓవర్‌కమ్‌ చేయవచ్చు. తినడానికి తియ్యగా, జ్యూసీగా ఉండే ఈ ఆల్‌బుకరా పండ్లలో విటమిన్‌ సి పుష్కలంగా ఉంటుంది. అందువల్ల ఇవి రోగనిరోధకశక్తిని పెంచి, త్వరగా ఇన్‌ఫెక్షన్ల బారిన పడకుండా కాపాడతాయి. మనం తిన్న ఆహారం నుంచి శరీరం ఐరన్‌ను బాగా గ్రహించేలా చేస్తాయి. కాబట్టి ఈ పండ్లనూ వీలైనప్పుడల్లా తినటం మంచిది.

జ్యూసీగా ఉండే ఈ ఆల్‌బుకరాలో కేలరీలు తక్కువ. జీర్ణశక్తిని మెరుగుపరిచే ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. వీటిల్లోని ప్రో సైయానిడిన్‌, నియోక్లోరోజెనిక్‌ , క్యూర్‌సెటిన్‌ వంటి ఫినోలిక్‌ కెమికల్స్‌ శరీరంలో కణాలు దెబ్బతినకుండా హెల్ప్ చేస్తాయి.

రోగనిరోధకశక్తిని పెంచడంలో ఎంతగానో తోడ్పడతాయి. విటమిన్‌ ఎ, బీటా కెరోటిన్‌లూ ఉన్నాయి. ఆల్‌బుకరా పండ్లలో ఉన్న పొటాషియం గుండెజబ్బులు, రక్తపోటు రాకుండా నియత్రిస్తుంది. ఇందులోని విటమిన్‌ కె ఎముకలు బలంగా మారేందుకు, ఆల్జీమర్స్‌ను నయం చేయడానికి సాయంగా ఉంటుంది.
ఆల్‌బుకరా పండ్లలో ఉండే విటమిన్ ఎ కంటిచూపును మెరుగుపరుస్తుంది. Aloo Bukhara fruit Health benefits.

ఎండు ఆల్‌బుకారాలను రోజుకు పది చొప్పున తీసుకుంటే ఎముకలు దృఢంగా తయారై ఎముక విరుపు, బ్రేక్‌డౌన్‌ సమస్యలుండవు. మెనోపాజ్ దశ దాటిన మహిళల్లో సాధారణంగా కనిపించే ఆస్ట్రియోపోరోసిస్‌ అలానే వృద్ధాప్య ఛాయలను కూడా ఇవి తగ్గిస్తాయట.

Also Read: https://www.mega9tv.com/life-style/drink-warm-water-during-the-rainy-season-stay-away-from-viral-diseases/