ఉన్నట్టుండి వెయిట్‌ లాస్‌ అవుతున్నారా.. క్యాన్సర్‌ అవ్వొచ్చు!

Cancer Symptoms: చిన్నాపెద్దా తేడా లేకుండా క్యాన్సర్‌ మహమ్మారి అందర్నీ ప్రమాదంలోకి నెట్టేస్తుంది. అయితే క్యాన్సర్‌ లక్షణాలను ముందుగానే గుర్తిస్తే కొంత ప్రమాదాన్ని తగ్గించొచ్చని వైద్యులు చెబుతున్నారు. చాలామంది క్యాన్సర్‌ లక్షణాలపై సరిగా అవేర్‌నెస్‌ లేక సమస్యను మరింత నిర్లక్ష్యం చేస్తుంటారు. దీనివల్ల క్యాన్సర్‌ కేసులు రోజురోజుకీ పెరుగుతున్నాయి.

కాబట్టి ప్రధాన లక్షణాలుగా భావించే వాటిని ఇప్పుడు తెలుసుకుందాం:

  • ఉన్నట్టుండి బరువు తగ్గడం: నెలరోజుల వ్యవధిలో నాలుగైదు కిలోలు తగ్గుతున్నారంటే మటుకు జాగ్రత్త పడాలి. కిలోలకొద్దీ బరువు ఒకేసారి తగ్గితే గనుక అది కడుపు, అన్నవాహిక, ఊపిరితిత్తులు, క్లోమ క్యాన్సర్‌ లక్షణం అయి ఉండొచ్చు.
  • చిన్నచిన్న పనులకే అలసిపోవడం కూడా క్యాన్సర్‌ లక్షణం కావచ్చు. లుకేమియా లేదా లింఫోమా వంటి బ్లడ్‌ క్యాన్సర్లలో ఎక్కువగా కనిపించే కారణమిది.
    ౩. కణతులు: మెడ, చంక లాంటి మొదలైన చోట్ల కొత్తగా వాపు, గడ్డలాంటివి కనిపించినా లేదా చిన్నగా ఫామ్‌ అయి గట్టిపడినా, పెద్దగా పెరిగినా వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి. అది బ్రెస్ట్‌, పెన్నిస్‌, శోషరస సంబంధిత క్యాన్సర్‌ కావచ్చు. Cancer Symptoms.
  • చర్మం-పుట్టుమచ్చల్లో మార్పు: కొత్తగా పుట్టుమచ్చలు పుట్టుకురావడం, పాత మచ్చల రంగు, పరిమాణంలోనూ మార్పులు, వాటిలోంచి రక్తం రావడం లాంటివి ఉంటే ఎప్పుడూ నిర్లక్ష్యం చేయొద్దు.
  • బ్లీడింగ్‌: మూత్రం, మలం, వాంతి, దగ్గులో రక్తం కనిపిస్తే వెంటనే అలర్ట్‌ అవ్వాలి. అవన్నీ మూత్రాశయ, పెద్దపేగు, కడుపు, ఊపిరితిత్తుల క్యాన్సర్‌కు దారితీసే ప్రమాద ఉన్న క్యాన్సర్‌ కారకాలు.
  • ఆగని దగ్గు: వారాలు గడిచినా దగ్గు తగ్గకపోయినా, రక్తం పడుతున్నట్లయితే కేవలం అది ఇన్ఫెక్షన్‌ కాకపోవచ్చు. గొంతు, ఊపిరితిత్తులు, థైరాయిడ్‌ క్యాన్సర్‌కు సూచన కావొచ్చు.
  • అజీర్తి లేదంటే మింగడంలో ఇబ్బంది: ఆహారం నమిలి మింగేటప్పుడు ఇబ్బందిగా అనిపించినా, ఛాతీలో మంట, అజీర్తి సమస్యలు లాంగ్‌ టర్మ్‌లో ఉంటే వెంటనే అలర్ట్‌ అవ్వండి. అది గొంతు, కడుపు, అన్నవాహిక క్యాన్సర్‌కు దారితీయొచ్చు.
  • విసర్జన వేళల్లో మార్పులు: మోషన్‌ వెళ్లే సమయాల్లో మార్పులు, అతిసారం, మలబద్ధకం, మలంలో రక్తం, మూత్రంలో మంట మొదలైనవి మూత్రాశయ, పెద్దపేగు, వీర్యగ్రంథి క్యాన్సర్‌ లక్షణాలు. వీటిలో ఏవి ఎక్కువ రోజులున్నా సరే డాక్టర్‌ను సంప్రదించాలి.
  • విపరీతమైన నొప్పి: బోన్స్‌, క్లోమం, అండాశయాల్లో క్యాన్సర్‌ ఉన్నప్పుడు గుర్తుంచుకోండి.. కడుపు, వీపు లేదా కీళ్లలో నొప్పి విపరీతంగా ఉంటుంది. రోజులు గడిచినా మందులు వాడినా తగ్గకపోతే వెంటనే సంబంధిత డాక్టర్‌ను కలవండి.
  • రాత్రిపూట చెమటలు పట్టడం: తరచూ జ్వరం లేదంటే రాత్రి సమయాల్లో చెమటలు పట్టడం, సీజన్‌తో సంబంధం లేకుండా తరచుగా ఇన్ఫెక్షన్లు ఎటాక్‌ చేసినా అవి క్యాన్సర్‌ లక్షణాలు అయ్యుండొచ్చు.
  • ఈ లక్షణాలు సాధారణంగా కనిపించినంత మాత్రానా కంగారు పడాల్సినవసరం లేదు కానీ లాంగ్‌ రన్‌ లో కొనసాగితే మాత్రం అప్రమత్తం అవ్వడం, జాగ్రత్త పడటం అవసరం.

Also Read: https://www.mega9tv.com/life-style/no-matter-which-country-you-look-at-in-the-world-you-will-see-only-our-indians-in-abroad/