లక్షణాలు చూపని ఆస్తమాతో జాగ్రత్త..!

Asymptomatic asthma safety Precautions: దగ్గు, ఆయాసంతో వేధించే ఆస్తమా తీవ్రతరం కాకుండా చూసుకోవడం చాలా ముఖ్యం. దీని బారిన పడ్డవారిలో రోజంతా ప్రత్యేకించి లక్షణాలేవీ ఉండవు. కాకపోతే అలర్జీ కారకాలకు పెద్దమొత్తంలో గురైనప్పుడే ఎఫెక్ట్ చూపిస్తాయి. మిగతా సమయాల్లో మళ్లీ మామూలుగానే ఉంటారు.

కాబట్టి పుప్పొడి, దుమ్ము మరియు ధూళి, డర్స్ట్ పార్టికల్స్, డస్ట్ మైట్స్, వాహనాలు, సిగరెట్ల పొగ, పెంపుడు జంతువుల వెంట్రుకల వంటివి ఏవైనా సరే అలర్జీని ప్రేరేపిస్తాయి. కాబట్టి వీటిపట్ల అవేర్ అయి ఉండండి: Asymptomatic asthma safety Precautions.

  • ఇంట్లో తివాచీలు ఉంచకూడదు. బెడ్ రూమ్ ను ఎల్లప్పుడూ నీట్ గా ఉంచుకోవాలి. కిటికీలకు కర్టెన్స్ వేలాడదీయాలి.
  • ఏసీ నుంచి వచ్చే గాలి నేరుగా శరీరం మీద పడనీయొద్దు.
  • ఇంట్లో రంగులు వేసేటప్పుడు, పాత పుస్తకాలు, బూజు దులిపేటప్పుడు ముక్కుకు మాస్క్ వేసుకోవడం తప్పనిసరి.
  • తిరగమోత వాసనలు పీల్చకుండా ఎగ్జాస్ట్ ఫ్యాన్ వేసుకోవాలి.
  • ఇల్లు చీపురుతో చిమ్మకుండా, తడిబట్టతో తుడవాలి.
  • మానసికంగా స్ట్రెస్ తగ్గించుకోవాలి.
  • అగరుబత్తీలు, సాంబ్రాణి, దోమలబత్తీల పొగలకు దూరంగా ఉండాలి.
  • ఇన్ఫెక్షన్లు రాకుండా టీకాలు తీసుకోవాలి.
  • మంచి పోషకాహారం, కంటి నిండా నిద్ర ముఖ్యం. *ఎక్కడికి వెళ్లినా జేబులో ఇన్ హెయిలర్ ను ఉంచుకోవాలి.
  • క్రమం తప్పకుండా వ్యాయామం, రెగ్యులర్ చెకప్ చేయించుకుంటే దీన్ని నివారించవచ్చు.

Also Read: https://www.mega9tv.com/life-style/the-star-fruit-is-a-star-in-weight-control-and-its-health-benefits-and-uses/