
Black Pepper Milk Benefits: మిరియాలు.. గొంతు నొప్పి నివారిణి.. నాన్ వెజ్ వంటల్లో తప్పనిసరిగా ఉపయోగించే మసాలా దినుసుగా మన ఇళ్ళల్లో వాడబడుతున్న మిరియాలను రోజు తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో ఇప్పుడు చూద్దాం:
పూర్వం మిరియాల కోసం భారతదేశం మీద ఎన్నో దండయాత్రలు జరిగాయట.. భారత్ లో పచ్చిమిర్చి రాకముందు మిరియాలనే ప్రత్యామ్నాయంగా కారంగా ఉపయోగించేవారట. శ్వాస కోశ, జీర్ణ, మూత్ర సంబంధ సమస్యలకు మంచి ఔషధంగా పనిచేస్తుంది. Black Pepper Milk Benefits.
- మిరియాలు, లవంగాలను కలిపి, కషాయం చేసుకొని నీళ్ల విరోచనాలు, అజీర్ణం సమస్యలు వచ్చినప్పుడు తాగితే మంచి ఉపశమనం కలుగుతుంది.
- నీరుల్లి, మిరియాలను కలిపి పరగడుపున తీసుకుంటూ.. తాజా పండ్లరసాలు, చిరుధాన్యాలతో చేసిన జావా లేదా సగ్గుబియ్యం జావాను తాగుతుంటే గనుక ఒక వారంలో జ్వరం తాలూకు ప్రభావం మొత్తం పోయి హెల్తీగా తయారవుతారు.
- మిరియాలు, సోంపును సమభాగాలుగా తీసుకొని చూర్ణం చేసి, 1 చెంచా తేనెలో కలిపి ఉదయం, సాయంత్రం పూట సేవిస్తుంటే పైల్స్ ఇబ్బంది నుంచి ఉపశమనం కలిగి, తగ్గుముఖం పడుతుంది.
- మిరియాలను దంచి, నెయ్యిలో వేపి బెల్లం ముదురుపాకం పట్టేవరకు ఆగి, అందులో ఈ వేయించిన మిరియాలను కలిపి తీసుకుంటే అతి విరేచనాల నుంచి రిలీఫ్ దొరుకుతుంది.
- కాళ్ల మంటలు, చేతులు నొప్పులతో బాధపడేవారు.. మిరియాలను దంచి, నెయ్యిలో వేయించి.. ఒక మాయిశ్చరైజర్ లా కాళ్ళకు, చేతులకు మర్దన చేసుకుంటే చాలు.. నొప్పులు తగ్గుతాయి.
- బలహీనంగా ఉన్నవాళ్ళు.. కండ పుష్టి, బలంగా తయారయ్యేందుకు కొన్ని రోజులపాటు ఒక తమలపాకులో 6 మిరియాలను చుట్టి, బాగా నమిలి, వెంటనే చల్లని నీరు(కుండ నీరు) తాగితే బెస్ట్ రిజల్ట్ కనిపిస్తుంది.
- పావు చెంచాడు మిరియాల పొడి, రెండు చెంచాలు తమలపాకు రసం, పాత బెల్లం కలిపి రెండు వారాలపాటు పరగడుపున తీసుకుంటే.. జలుబు, దగ్గు నుంచి త్వరిత ఉపశమనం కలిగి బెటర్ గా ఫీల్ అవుతారు.