రూట్ కెనాల్ వల్ల గుండె సమస్యలు వస్తాయా..?!

Root Canal Cause Heart Problems?: ప్రతిరోజూ లక్షలాది మంది డెంటల్ క్లినిక్‌లకు వెళ్లి రూట్‑కెనాల్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఎందుకంటే కొన్ని డెంటల్ సమస్యలకు రూట్ కెనాల్ తప్ప మరో పరిష్కారం ఉండదు. పళ్ల లోపల సోకిన ఇన్ఫెక్షన్ పూర్తిగా తీసేసేందుకు రూట్ కెనాల్ ప్రక్రియ తప్పనిసరి. అయితే, సమస్య ఉన్న పళ్లను శుభ్రం చేసి క్రిమిరహితం చేశాక పంటిపై బ్యాక్టీరియా చేరకుండా ఉండేందుకు సీల్ వేస్తారు డెంటిస్టులు. సహజ దంతాలకు ఇన్ఫెక్షన్ సోకకుండా చేసే రూట్ కెనాల్ ప్రాసెస్ కొన్ని సందర్భాల్లో తీవ్ర గుండె సమస్యలకు దారితీసే ప్రమాదముంది. అలానే చాలా మంది రూట్ కెనాల్‌ కారణంగా గుండెపోటు వస్తోందని అపోహ పడుతుంటారు. నిజానికి రూట్ కెనాల్ చేయించుకోవడం వల్ల గుండెపోటుకు కారణమవుతుందని వివరించగల శాస్త్రీయ రుజువు అయితే ఏది లేదు. ఒక్కమాటలో చెప్పాలంటే… రూట్ కెనాల్ నేరుగా గుండెపోటుకు కారణం కాదు. కానీ నోటి ఇన్ఫెక్షన్‌లను నిర్లక్ష్యం చేయడం వల్ల గుండె సంబంధిత సమస్యల ప్రమాదం అనేది పెరుగుతుంది.

నోటి ఆరోగ్యం సరిగా లేకపోతే హృదయ సంబంధ సమస్యలు కలుగుతాయనే మెడికల్ అధ్యయనాలు ఉన్నాయి. ఇందుకు ఉదాహరణగా పీరియాంటైటిస్ (గమ్ డిసీజ్) వంటి పరిస్థితులు గుండెపోటు ప్రమాదాన్ని పెంచుతాయని తేలింది. Root Canal Cause Heart Problems?.

రూట్ కెనాల్ సమయంలో, ఇన్ఫెక్షన్ సోకిన పంటి నుంచి బ్యాక్టీరియా తీసేస్తారు. ఒకవేళ ఈ క్రమంలో పంటిలోని ఇన్ఫెక్షన్ ను పూర్తిగా శుభ్రం చేయకపోతే లేదా ఇన్ఫెక్షన్ వ్యాపిస్తే, నోటి బ్యాక్టీరియా అనేది లోపలినుంచి రక్తప్రవాహంలోకి ప్రవేశించవచ్చు. ఇది రక్తనాళాలలో వాపును ప్రేరేపిస్తుంది. తద్వారా గుండె జబ్బులకు దారితీయవచ్చు. ఇప్పటికే గుండె జబ్బులు లేదా ఆర్టిఫీషియల్ గుండె కవాటాలు ఉన్నవారు దంత బాక్టీరియా నుంచి వచ్చే ఇన్ఫెక్షన్లకు (ఎండోకార్డిటిస్ వంటివి) ఎక్కువగా గురయ్యే అవకాశం ఉంది. అటువంటి సందర్భాలలో సమస్యలను నివారించేందుకు దంతవైద్యులు ట్రీట్మెంట్ కి ముందు యాంటీబయాటిక్‌లను యూస్ చేయమని చెబుతారు. అయితే, రూట్ కెనాల్ చికిత్స సరిగ్గా చేస్తే ఇన్ఫెక్షన్ల ప్రమాదం తగ్గుతుంది. కేవలం, దంత ఇన్ఫెక్షన్‌లను నిర్లక్ష్యం చేయడం వల్లే గుండె ప్రమాదాలు అనేవి పెరగవని గుర్తుంచుకుంటే మేలు!

Also Read: https://www.mega9tv.com/life-style/do-not-have-unhealthy-vegetables-during-the-rainy-season-checkout-what-they-are/