డయాబెటిస్ ఉన్న తల్లులు పాలు ఇవ్వొచ్చా..?!

Diabetes Mother Health Tips: అప్పుడే పుట్టిన బిడ్డకు తల్లి పాలు ఎంతో శ్రేయస్కరం. ఎంతో సురక్షితం కూడా.. అలాంటిది పాలు ఇచ్చే తల్లి ఒకవేళ డయాబెటిస్ అయితే.. అలాంటప్పుడు బిడ్డకు పాలు ఇవ్వొచ్చా? అనే సందేహం చాలామందిలో ఉంటుంది. అటువంటప్పుడు ఎలాంటి హెల్త్ టిప్స్ పాటించాలో ఇప్పుడు చూద్దాం:

సాధారణంగా తల్లి రక్తంలో షుగర్ లెవల్స్ కంట్రోల్‌లో ఉంటే.. ఆ పాలు బిడ్డకు సురక్షితం అవుతాయి. కానీ, చక్కెర స్థాయిలు నియంత్రణలో లేకుండా బిడ్డకు పాలిస్తే మాత్రం పలు సమస్యలు రావచ్చు. రక్తంలో చక్కెర స్థాయి ఎక్కువగా ఉన్న తల్లి పాలు.. బిడ్డ తాగితే శిశువు రక్తంలో చక్కెర స్థాయిలు పడిపోవడం వల్ల హైపోగ్లైసీమియా అనేది వస్తుంది. దీంతో బిడ్డ శరీరంలో ఇన్సులిన్ అధికంగా ఉత్పత్తి అవుతుంది. ఫలితంగా బిడ్డ బరువు పెరిగే అవకాశం ఉంటుంది. Diabetes Mother Health Tips.

కాబట్టి తల్లి పాలు పట్టేముందు తినడం లేదా తీపి పదార్థం దగ్గర ఉంచుకోవడం మంచిది. దీనివల్ల చక్కెర స్థాయులు అనేవి బ్యాలెన్స్ అవుతాయి. ఇకపోతే తల్లి పాల ద్వారా శిశువుకు ఇమ్యూనో గ్లోబ్యులిన్ లు (IgA, IgG), లాక్టోఫెరిన్, లైసోజైమ్ వంటి రోగనిరోధక కారకాలు పుష్కలంగా అందుతాయి. ఇవి అప్పుడే పుట్టిన శిశువును ఇన్ఫెక్షన్ల నుంచి రక్షిస్తాయి. బ్రెస్ట్‌మిల్క్‌లోని బయో ఆక్టివ్ కాంపౌండ్స్ శిశువులో మెటబాలిజంను మెరుగుపరచడంలో సాయపడతాయి. దీంతో ఇది భవిష్యత్తులో టైప్ 2 డయాబెటిస్ వచ్చే అవకాశాన్ని సైతం తగ్గిస్తుంది.

టైప్ 1, టైప్ 2 డయాబెటిస్ ఉన్న గర్భిణీ తల్లులు ప్రెగ్నెన్సీ సమయంలో, డెలివరీ తర్వాత రక్తంలో చక్కెర స్థాయిలను పరిశీలించడం అవసరం. బ్యాలెన్స్డ్ ఆహారం, వ్యాయామం హెల్తీగా ఉంచడంతో పాటు చక్కెర స్థాయిలను బ్యాలెన్స్ చేయడంలో సాయపడతాయి. కాబట్టి హెల్తీ లైఫ్ స్టైల్ చాలా ముఖ్యం!

Also Read: https://www.mega9tv.com/life-style/eating-fruits-before-food-may-prevent-the-body-from-fully-absorbing-the-vitamins-fiber-and-phytonutrients-they-contain/