
Latest Survey On Glass Bottles: మన ఇళ్లలో నిత్యం ఉపయోగించే గాజు సీసాలు ఇటు హెల్త్ కి, అటు పర్యావరణానికి సేఫ్ అని భావించి.. నీరు, డ్రింక్స్, ఆహార పదార్థాలు నిల్వ చేసేందుకు ప్లాస్టిక్ కంటే గాజు సీసాలే బెటర్ అనుకుని వాడేస్తున్నాం. కానీ, తాజాగా ఫ్రెంచ్ ఆహార భద్రతా సంస్థ అయిన ఏఎన్ఎస్ఈఎస్ నిర్వహించిన ఓ కొత్త సర్వేలో కొన్ని షాకింగ్ నిజాలు బయటపడ్డాయి. గాజు సీసాలు.. ప్లాస్టిక్ బాటిల్ తో పోలిస్తే ఎక్కువ మైక్రోప్లాస్టిక్ కణాలను విడుదల చేస్తున్నాయని తెలిపింది.
అవును మీరు విన్నది నిజమే!
గాజు సీసాలు.. మనం అనుకున్నంత సేఫ్ అయితే కాదు.. మనకు ఇష్టమైన గాజు సీసాలు ప్లాస్టిక్ కంటే ఎక్కువ మైక్రోప్లాస్టిక్ కణాలతో కలుషితమవుతున్నాయట.
నిజానికి గాజు సీసాలు ప్లాస్టిక్ కంటే శుభ్రంగా ఉంటాయి. శీతల పానీయాలు, నిమ్మరసం, ఐస్ టీ, మద్యం వంటి డ్రింక్స్ ను నిల్వ చేసిన గాజు సీసాలలో లీటరుకు సగటున 100 మైక్రోప్లాస్టిక్ కణాలున్నట్లు ఈ అధ్యయనంలో తేలింది. ఈ సంఖ్య ప్లాస్టిక్ లేదా మెటల్ కంటైనర్లలో కనిపించే కణాల కంటే 50 టైమ్స్ ఎక్కువ కావడం గమనార్హం! Latest Survey On Glass Bottles.
మరోవైపు ఈ కలుషితానికి ప్రధాన కారణం సీసాలకుండే మూతలే కావొచ్చని పరిశోధకులు భావిస్తున్నారు. సీసాల్లో లభించిన చాలా ప్లాస్టిక్ కణాల రంగు, రూపు.. మూత లోపలివైపు ఉండే పెయింట్‌తో సరిపోలాయట. దీనిబట్టి, గాజు సీసాలకు ఉండే మెటల్ మూతల వెలుపలి పెయింట్ నుంచే ఈ చిన్న ప్లాస్టిక్ కణాలు పానీయాల్లోకి చేరిపోతున్నాయని అర్థమవుతోంది. కాబట్టి వీటి వాడకం తగ్గించండి.