
Drink warm water during the rainy season: వర్షాకాలం.. డైలీ పగలు ఎప్పుడైందో తెలియదు. అలానే సాయంత్రం త్వరగా చీకటి పడుతుంది. వాతావరణం మొత్తం ఆహ్లాదకరంగా మారుతుంది. చల్లని గాలులు, నల్లని మబ్బులు.. తేలికపాటి వర్షం, చిరు జల్లులు కురిసి మనసుకు ప్రశాంతతను ఇస్తాయి.. కానీ ఈ కాలంలో వర్షాలు మోస్తారు నుంచి భారీ స్థాయిలో కురిసి.. ఉద్యోగాలు, స్కూళ్లు, కాలేజీలకు వెళ్లేవారిని ఇబ్బంది పడేలా చేస్తాయి. ఇలాంటప్పుడు హెల్త్ పట్ల మరింత కేర్ ఫుల్ గా ఉండటం చాలా అవసరం.
నిజానికి సమ్మర్ లో వాటర్ కన్సంప్షన్ బానే ఉంటుంది. చల్లని నీరు, కూల్ డ్రింక్స్, పండ్లు ఇలా ఏదోరూపంలో వాటర్ తాగుతాం. కానీ వర్షం కురిసే సమయాల్లో.. నీరు తాగాలనిపించదు. కారణం ఆ నీరు వెదర్ కి తగ్గట్టు చల్లగా అవ్వడం. పదేపదే టాయిలెట్ కి వెళ్లి రావడం వల్ల నీరు ఎక్కువగా తాగం. నిజానికి సీజన్ ఏదైనా శరీరానికి సరిపడా నీరు తాగాలి. అయితే, వర్షాకాలంలో నీటిని గోరు వెచ్చగా చేసుకొని తాగడం ఉత్తమమని వైద్యులు చెబుతున్నారు. ఎందువల్ల అంటే.. Drink warm water during the rainy season.
వర్షాకాలంలో వాతావరణంలో తేమ ఎక్కువగా ఉంటుంది.. దీని కారణంగా బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్ లనేవి వేగంగా పెరగడం ప్రారంభిస్తాయి. ఈకాలంలో, జలుబు, దగ్గు, కడుపు నొప్పి, గొంతు నొప్పి, మోషన్స్, వైరల్ వ్యాధులు ఈజీగా ఎటాక్ అవుతాయి. అటువంటి పరిస్థితిలో వేడి నీటిని తాగడం అలవాటు చేసుకుంటే మంచిది.
- గొంతు, ఛాతీలో పేరుకుపోయిన శ్లేష్మం బయటకు వెళ్లిపోతుంది. ఇది శ్వాస తీసుకోవడాన్ని సులభతరం చేస్తుంది.
- వర్షాకాలంలో, తరచుగా జలుబు, దగ్గు వస్తుంది. అటువంటి పరిస్థితిలో గోరువెచ్చని నీరు తాగడం వల్ల గొంతుకు ఉపశమనం కలిగిస్తుంది. పైగా ఇన్ఫెక్షన్ పెరగకుండా నిరోధిస్తుంది.
- గోరువెచ్చని నీరు చర్మానికి కూడా మంచిది. శరీరం లోపలి నుంచి శుభ్రంగా ఉన్నప్పుడు, ముఖం కూడా మెరుస్తుంది.
- వేడినీరు శరీరంలో పేరుకుపోయిన వేస్ట్ ను తొలగించి, కడుపును క్లీన్ చేస్తుంది. తద్వారా జీర్ణక్రియ మెరుగుపడుతుంది. గ్యాస్, అసిడిటీ వంటి సమస్యల నుంచి రిలీఫ్ ఇస్తుంది.
- చాలామంది ఉదయాన్నే గోరువెచ్చని నీటిలో నిమ్మకాయ, తేనె కలిపి తాగుతారు. ఇది బరువు తగ్గడంలో సహాయపడడంతోపాటు శరీరానికి శక్తినిస్తుంది. వర్షాకాలంలో కూడా ఈ అలవాటును మీరు కంటిన్యూ చేయొచ్చు.
- ముఖ్యంగా మనం బయటి ఫుడ్ ఎక్కువగా తిన్నప్పుడు లేదా మన గట్ హెల్త్ కి ఇబ్బంది ఏర్పడినప్పుడు.. గోరువెచ్చని నీరు తాగితే ఉపశమనం లభిస్తుంది..
- అయితే.. నీరు చాలా వేడిగా తాగకూడదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. చాలా వేడి నీరు గొంతు, కడుపు లోపలి పొరను దెబ్బతీస్తుంది. కాబట్టి ఎల్లప్పుడూ గోరువెచ్చని నీటిని మాత్రమే తీసుకోవాలి.
Also Read: https://www.mega9tv.com/life-style/neem-leaves-purify-the-blood-just-take-them-for-a-month/