డైలీ బ్లాక్ రైస్ తో.. బోలెడు లాభాలు..!

Black Rice Benefits: మనం రెగ్యులర్ గా తినే వైట్ రైస్ కాకుండా రైస్‌లోనూ చాలా వెరైటీలు అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో బ్లాక్ రైస్ ఒక‌టి. ఇది ముదురు ఊదా రంగులో ఉంటుంది. కనపడేందుకు న‌లుపు రంగులో ఉండటం వల్ల ఆ పేరు వచ్చింది. ఈ రైస్‌ సహజంగా ఎన్నో పోష‌క విలువ‌లను కలిగి ఉండటం వల్ల ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ను కలిగిస్తుంది. దీన్ని చైనీయులు ఎక్కువ‌గా తింటారు. మరీ దీని విశిష్టత, ప్రయోజనాల గురుంచి ఇప్పుడు తెలుసుకుందాం:

  • ప్ర‌పంచవ్యాప్తంగా అధికశాతం మందికి వరి రకానికి చెందిన బియ్యం ప్ర‌ధాన ఆహారం కాగా మ‌న దేశంలో ద‌క్షిణాదివారు వైట్ రైస్ ను ఎక్కువగా తినేందుకు ఇష్టపడతారు. అయితే ఆరోగ్యంగా ఉండాలంటే మాత్రం బ్రౌన్ రైస్‌ను తినాల‌ని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. Black Rice Benefits.
  • వీటిలో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఈ బియ్యం రోజువారీ ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. బ్లాక్ రైస్‌లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో ఫ్రీ రాడికల్స్ డ్యామేజ్‌ను తగ్గించడంలో సాయపడతాయి. అంతేకాక కొలెస్ట్రాల్‌, ట్రైగ్లిజరైడ్ స్థాయిలను తగ్గిస్తాయి. శ‌రీరంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గి, మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. ర‌క్త‌నాళాల్లో ఉండే కొవ్వు క‌రిగి, గుండె ఆరోగ్యంగా ఉంచడంలో సాయపడుతుంది. దీంతో హార్ట్ ఎటాక్ రాకుండా జాగ్రత్త పడొచ్చు.
  • బ్లాక్ రైస్ తినడం వల్ల కంటి ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది. ఎండ వేడి, ఇతర కిరణాల ప్రభావం న్నుంచి రక్షిస్తుంది.
  • బరువు తగ్గాలనుకునేవారు బ్లాక్‌ రైస్‌ను ఆహారంగా తీసుకోవచ్చు. దీనివ‌ల్ల బ‌రువు సులువుగా తగ్గుతారు. ఇందులోని యాంటీఆక్సిడెంట్లు, ఫైబ‌ర్ మెటబాలిజంను పెంచుతాయి. దీంతో క్యాల‌రీలు ఇట్టే ఖ‌ర్చ‌వుతాయి. కొవ్వు క‌రుగుతుంది. అధిక బ‌రువు సైతం త‌గ్గుతారు.
  • బ్లాక్ రైస్ చాలా త‌క్కువ గ్లైసిమిక్ ఇండెక్స్ విలువ‌ను క‌లిగి ఉంటుంది. అందువ‌ల్ల ఈ రైస్‌ను తింటే షుగ‌ర్ లెవ‌ల్స్ త్వ‌ర‌గా పెర‌గ‌వు. పైగా ఇందులో ఉండే ఫైబ‌ర్‌, యాంటీఆక్సిడెంట్లు షుగ‌ర్ లెవ‌ల్స్‌ను త‌గ్గిస్తాయి. దీంతో డ‌యాబెటిస్ కంట్రోల్ లో ఉంటుంది. అందువ‌ల్ల షుగ‌ర్ ఉన్న‌వారు సైతం బ్లాక్ రైస్‌ను హాయిగా తిన‌వ‌చ్చు.
  • ఈ రైస్‌ను ఆహారంలో భాగం చేసుకుంటే చాలా త‌క్కువ తిన్నా కూడా క‌డుపు నిండిన భావ‌న క‌లుగుతుంది. ఎక్కువసేపు వరకూ ఆక‌లి వేయ‌దు. దీంతో జంక్ ఫుడ్ జోలికి వెళ్ల‌కుండా ఉంటారు.
  • బ్లాక్ రైస్‌లో ఫైబ‌ర్ అధికంగా ఉంటుంది. ఇది మ‌ల‌బ‌ద్ద‌కాన్ని నివారిస్తుంది. జీర్ణ వ్య‌వ‌స్థ‌ను మెరుగుపరుస్తుంది. అసిడిటీ, క‌డుపు ఉబ్బ‌రం వంటి జీర్ణ స‌మ‌స్య‌ల‌ను సైతం త‌గ్గిస్తుంది.

Also Read: https://www.mega9tv.com/life-style/black-pepper-milk-health-benefits-and-uses-of-viral-infections/