ఇంటర్నల్ బ్లడ్ లాస్ కి కారణమయ్యే హీమోఫిలియా..!

Hemophilia causes internal blood loss: ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల కొద్దీ ఏదోక అనారోగ్య సమస్యతో పోరాడుతున్నారు. తీసుకునే ఆహారం, లైఫ్ స్టైల్, కొన్ని అలవాట్ల కారణంగా ఇవి మరింత ఎక్కువయ్యాయి. అందులోనూ బ్లడ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ తోనే ఎక్కువగా సఫర్ అవుతున్నారు. అందులోనూ ప్రధానమైన వ్యాధి హిమోఫిలియా. ఈ వ్యాధి బారినపడి ప్రపంచవ్యాప్తంగా ఏటా మిలియన్లమంది చనిపోతున్నారట. ఇంకొందరిని ఈ వ్యాధి లాంగ్ టర్మ్ లో ఎఫెక్ట్ చేస్తోంది. ఈ సమస్యకు సరైన సమయంలో, సరైన చికిత్స తీసుకోకపోతే ప్రాణాలకే ప్రమాదం. ఈ క్రమంలో హిమోఫిలియా గురించి అవగాహన కలిగి ఉండటం అవసరం.

ప్రధాన కారణాలు..

  • ఇదొక జెనెటిక్ డిజార్డర్.
  • ఈ వ్యాధి వచ్చినవారిలో రక్తం గడ్డకట్టదు. గడ్డకట్టే ప్రోటీన్లు రక్తంలో లేకపోవడమే ఇందుకు కారణం.
  • ఎఫెక్ట్ అయినవారు ఎలాంటి గాయాలు, దెబ్బలు, ప్రమాదాలు తగలకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వీరికి చిన్న గాయమైనా రక్తం అదే పనిగా కారుతూ ఉంటుంది. ఇంటర్నల్ బ్లడ్ లాస్ ను కలిగిస్తుంది.
  • మోకాళ్లు, చీలమండలు, మోచేతుల్లోనూ బ్లీడింగ్ అవ్వొచ్చు. శరీరం లోపల బ్లీడింగ్ అవ్వడం వల్ల బాడీలోని ముఖ్యమైన అవయవాలు, కణజాలాలు దెబ్బతింటాయి. ఇలా జరిగితే మనిషి ప్రాణాలకే రిస్క్ అవ్వొచ్చు.
  • కాబట్టి ఈ వ్యాధి వచ్చినవాళ్లు చాలా జాగ్రత్తగా ఉండాల్సినవసరం ఎంతైనా ఉంది.
  • 40 ఏళ్లు పైబడినవారు, వృద్ధులను ఈ వ్యాధి తీవ్రంగా ఎఫెక్ట్ చేస్తుంది.
  • ఈ వ్యాధి జన్యుపరమైన కారణాల వల్లనే ఎక్కువగా వస్తుంది. ఒకవేళ హిమోఫిలియా కుటుంబంలో ఎవరికైనా ఉంటే, ఆయా ఫ్యామిలీ మెంబర్స్ కి కూడా వచ్చే అవకాశం ఉంది.
  • హిమోఫిలియాను ముందుగా స్క్రీనింగ్ ద్వారా గుర్తించి, ట్రీట్ చేస్తే గనుక కంట్రోల్ అవుతుంది. Hemophilia causes internal blood loss.

లక్షణాలు..

  • బ్రెయిన్ లో బ్లీడింగ్ అవ్వడం
  • అప్పుడప్పుడు వాంతులవ్వడం
  • చాలా కాలంగా తలనొప్పిగా అనిపించడం
  • బలహీనంగా అనిపించడం
  • మలంలో కానీ మూత్రంలో కానీ రక్తం
  • కీళ్ల వాపు, నొప్పి
  • ముక్కు నుంచి బ్లీడింగ్ అవ్వడం జరుగుతుంది.

Also Read: https://www.mega9tv.com/life-style/be-careful-with-asymptomatic-asthma-and-checkout-the-safety-precautions/