రోజూ గుప్పెడు మఖానా తింటే చాలు..!

6 benefits of makhana: మఖానాలో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. ఇది ఒక రకమైన సూపర్‌ఫుడ్ అని చెప్పొచ్చు. ఇందులో ప్రోటీన్, ఫైబర్, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, యాంటీఆక్సిడెంట్లు వంటి అనేక పోషకాలున్నాయి. ఈ పోషకాలు మన శరీరానికి అవసరమైన శక్తిని అందిస్తాయి. అనేక ఆనారోగ్య సమస్యలతో పోరాడేందుకు ఇవి సాయపడతాయి. దీంతోపాటు ఇందులో యాంటీఆక్సిడెంట్లు, కొన్ని అమైనో ఆమ్లాలు ఉండటం వల్ల అనేక ఆరోగ్య సమస్యలను నివారించడంలో హెల్ప్ చేస్తాయి.

  • మఖానాలో కేలరీలు తక్కువగా, ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల బరువు తగ్గడానికి ఇది సాయం చేస్తుంది. మఖానాలోని ఫైబర్ వల్ల జీవక్రియ రేటును పెంచడంలో, బరువు తగ్గించే ప్రక్రియను వేగవంతం చేయడంలో సాయపడుతుంది. 6 benefits of makhana.
  • మఖానాలో తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుంది. ఇది రక్తంలో చక్కెరను కంట్రోల్ చేయడంలో తోడ్పడుతుంది. కాబట్టి, మఖానా తినడం వల్ల రక్తంలో చక్కెర సడెన్ గా అయితే పెరగదు.
  • మంచి జీర్ణక్రియకు మఖానా చాలా మంచిది. మలబద్ధకం నుంచి ఉపశమనం లభిస్తుంది.
  • అజీర్ణం, అసిడిటీని కంట్రోల్ చేయడానికి మఖానా ప్రయోజనకారిగా పనిచేస్తుంది. ఇది కడుపును చల్లబరుస్తుంది. అజీర్ణ లక్షణాలను తగ్గించడంలో హెల్ప్ చేస్తుంది.
  • మఖానా పొటాషియంను కలిగి ఉంటుంది. రక్తపోటును నియంత్రణలో ఉంచడంలో సాయం చేస్తుంది. ఎందుకంటే మఖానాలో సహజంగా పొటాషియం ఎక్కువగా, సోడియం తక్కువగా ఉంటుంది.
  • మఖానాను అల్పాహారంగా, సాయంత్రం స్నాక్ గా లేదా రాత్రి పాలలో నానబెట్టి ఉదయం కూడా తినవచ్చు. మఖానాను ఖాళీ కడుపుతో కూడా తిన్నా ఇబ్బంది ఉండదు. మొదటిసారి ప్రయత్నించే వారు తక్కువ మోతాదులో తీసుకోవడం ఉత్తమం.

Also Read: https://www.mega9tv.com/life-style/having-black-rice-regularly-have-so-many-benefits-checkout-the-information/