30 రోజులపాటు చక్కెర మానేస్తే.. ఫ్యాటీ లివర్ వ్యాధి దరిచేరదు..?!

Fatty Liver Disease: మనం రోజూ ఇంట్లో పెట్టుకునే టీ, కాఫీ, స్వీట్స్, నైవేద్యాలలో ఉపయోగించేది ఎక్కువశాతం చక్కెరే.. ఇది కృత్రిమ తీపి పదార్థం. ఒకరకంగా చెప్పాలంటే బరువు పెరగడం, షుగర్, టైప్ 1, 2 డయాబెటిస్ లను కొని తెచ్చే సైలెంట్ కిల్లర్. ఎంత ఎక్కువగా చక్కెరను మన ఆహారాల్లో భాగంగా తీసుకుంటామో అంతే త్వరగా షుగర్, ఫ్యాటీ లివర్, గుండె జబ్బులు లాంటి అనారోగ్యాల బారిన పడతాం. అయితే తక్కువ మొత్తంలో లేదా నిర్ణీత మోతాదులో తీసుకోవడం వల్ల చక్కెర వల్ల హాని కలగకపోయినా.. లిమిట్ దాటితే మటుకు కష్టాలు కొని తెచ్చుకున్నట్లే! అటువంటప్పుడు.. చక్కెరను ఒక నెలరోజులపాటు తీసుకోకుండా ఉంటే ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో మీకు తెలుసా!

ఇటీవల ప్రముఖ విశ్వవిద్యాలయాల్లో చేసిన రీసెర్చ్ రిజల్ట్స్ ప్రకారం, 30రోజులు డాక్టర్ల సలహా మేరకు చక్కెరను ఎంత తగ్గించాలి, ఎలా తగ్గించి తీసుకోవాలనే అంశంపై అవేర్నెస్ కలిగి ఉంటే మాత్రం ఈ బెనిఫిట్స్ ఇట్టే పొందొచ్చు అంటున్నారు: Fatty Liver Disease.

  • 30 రోజులు చక్కెరను కన్జూమ్ చేసుకొనట్లైతే..
  • లివర్ ఫ్యాట్ తగ్గటం ప్రారంభమవుతుందట.
  • మూత్రపిండాల పనితీరు మెరుగుపడుతుంది.
  • ప్రీ డయాబెటిక్ ఉన్నవారికి చాలా మేలు చేస్తుంది. *ధమనుల వాపు తగ్గుతుంది.
  • బ్రెయిన్ ఫాగ్ నుంచి బయటపడటం..
  • మానసిక ఒత్తిడి, తరచూ ఏదోటి ఆలోచించడం లేదంటే మర్చిపోవడం, మెదడు మొత్తం మొద్దుబారినట్లు అనిపించడం ఫీల్ అవుతారు. చక్కెరను తగ్గించడం ద్వారా శరీరం హెల్తీగా మారి, ఆలోచనలు మెరుగవుతాయి.
  • రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరుస్తుంది. మామూలుగా చక్కెర రోగనిరోధక శక్తిని తగ్గించేస్తుంది.. చక్కెరను తగ్గించడం లేదా నియంత్రించడం వల్ల మీ శరీరం మెగ్నీషియం, కాల్షియం, జింక్ వంటి మినరల్స్ ను బ్యాలెన్స్ చేసుకుంటుంది. అందువల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

Also Read: https://www.mega9tv.com/health-news/recognise-these-symptoms-before-the-kidney-failure/