వర్షాకాలంలో బయటి ఫుడ్ తినకపోవడం మంచిది!!

Ignore Outside Food During Monsoon: వర్షాకాలం.. అనేక వ్యాధులకు నిలయం!
గాలిలో తేమ, చుట్టూ ఉన్న ధూళి లేదంటే నిలిచిపోయిన నీరు.. దోమలు, బ్యాక్టీరియాకు అనుకూలమైన వాతావరణాన్ని సృష్టిస్తాయి. దానివల్ల వైరల్ జ్వరం, జలుబు, దగ్గు, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ వంటి సాధారణ అనారోగ్యాల నుంచి దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. ఈ సీజన్‌లో వైరల్ జ్వరం అనేది కామన్ గా వయసుతో సంబంధం లేకుండా వస్తోంది. అంతేకాకుండా అలసట, జ్వరం, గొంతు నొప్పి, ఒళ్లు నొప్పులు, తేలికపాటి దగ్గు కామన్ కాసెస్ అయినా ఇవి మలేరియా, డెంగ్యూలో కూడా కనిపిస్తాయి. కాబట్టి దానిని వైరల్ జ్వరంగా భావించి నిర్లక్ష్యం చేస్తే చాలా ప్రమాదం. అందువల్ల తప్పక జాగ్రత్త వహించాలి అంటున్నారు వైద్యులు.

డెంగ్యూ దోమలు పగటిపూట కుడితే, మలేరియా వ్యాప్తి చేసే దోమలు రాత్రిపూట కుడతాయి. రెండు సందర్భాల్లోనూ జ్వరం, తలనొప్పి, చలి, ప్లేట్‌లెట్ కౌంట్ పడిపోవడం, శరీరంపై ఎర్రటి దద్దుర్లు కనిపిస్తాయి. కాబట్టి, వర్షాకాలంలో పరిశుభ్రత అనేది చాలా ముఖ్యం. టైఫాయిడ్, నీటి ద్వారా వచ్చే ఇన్ఫెక్షన్లు సైతం ఈజీగా, స్పీడ్ గా స్ప్రెడ్ అవుతాయి.

అన్ హైజినిక్ నీరు తాగడం లేదా బయట దొరికే ఆహారం తినడం వల్ల కడుపు నొప్పి, వాంతులు, విరేచనాలు, బలహీనత, హై ఫీవర్ వచ్చే ఛాన్స్ ఉంది. అందువల్ల, ఈ సీజన్‌లో బయటి ఆహారం తినకపోవడమే మంచిది. కట్ చేసి ఉంచిన పండ్లు లేదా రోడ్డు పక్కన లభించే చాట్ వంటి ఆహార పదార్థాలు ఇన్ఫెక్షన్‌కు కారణమవొచ్చు. కాబట్టి, బయట ఫుడ్ తినకుండా ఇంటి భోజనం తీసుకుంటూ గోరువెచ్చని నీరు తాగండి.

వర్షాకాలంలో వ్యాధులను నివారించడానికి..
తరచుగా సబ్బుతో చేతులు కడుక్కోవడం, శుభ్రమైన నీరు తాగడం, తినడానికి ముందు చేతులు కడుక్కోవడం, ఇంట్లో దోమలు వృద్ధి చెందనివ్వకుండా మెష్ డోర్, కర్టైన్స్, దోమ తెరలను వినియోగించడం, పిల్లలకు పరిశుభ్రత పాటించమని చెప్పడం. జ్వరం మూడు రోజులైన తగ్గకుంటే వైద్యుడిని సంప్రదించాలి.

Also Read: https://www.mega9tv.com/life-style/if-you-give-up-sugar-for-30-days-fatty-liver-disease-will-not-occur/