
Health Report Says Do Not Buy Online Meat: స్విగ్గి, జొమాటోల వల్ల ఈపాటికే ఆన్లైన్ లో ఫుడ్ ఆర్డర్ పెట్టుకునే సంస్కృతి రోజురోజుకూ విస్తరిస్తోంది. ఈ క్రమంలో ఆన్‌లైన్‌లోనే వండని చికెన్, మటన్, చేపలు సైతం ఆర్డర్ చేసుకునే వెసులుబాటును కల్పిస్తున్నాయి కొన్ని డెలివరీ సంస్థలు. అయితే ఇలా ఆర్డర్ చేసుకొని కొనే మాంసం అసలు మంచిది కాదని.. ఆన్‌లైన్ యాప్‌ల ద్వారా డెలివరీ చేస్తున్న మాంసం ఏ మాత్రం స్వచ్ఛమైనది కాదని పలు హెల్త్ నివేదికలు హెచ్చరిస్తున్నాయి.
ఎందుకంటే మాంసం ఫ్రెష్ గా కనిపించేందుకు వాటిపై ప్రమాదకర రసాయనాలను కలిపి విక్రయిస్తున్నారు. దీనర్థం ప్రాణాంతక వ్యాధులను ఆన్‌లైన్ ద్వారా మనమే కొనుకుంటున్నాం. అంతేకాక ఆన్‌లైన్ డెలివరీ యాప్ సంస్థలు, వాటి గోడౌన్లలో రెగ్యులర్ చెకప్ చేయరు. ఇలా ఇష్టారీతిన స్టోర్ చేసి, ఉంచిన మాంసాన్ని అమ్ముతున్నారు. యాప్ నిర్వాహకులు ఇచ్చే ఆఫర్లు, టాక్టిక్స్ వలలో పడి కస్టమర్లు మోసపోతున్నారు.
ఈ-కామర్స్ సంస్థలు తమ కస్టమర్స్ కి అందిస్తున్న మాంసం ముమ్మాటికీ స్వచ్ఛమైనది కాదు. ఎందువల్ల అంటే తాజా మేక, గొర్రె మాంసాన్ని కూడా కేవలం పది నిమిషాల్లోనే ఇంటివద్దకే తీసుకురావడం విచిత్రంగా ఉంది. ఇది ఎట్టిపరిస్థితుల్లోనూ సాధ్యం కాదు. ఎందుకంటే అప్పటికే కోసి ఉంచిన మాంసమైనా చిన్న ముక్కలుగా చేసి, ప్యాకింగ్ చేయడానికే కనీసం పది నిమిషాలైన టైం పడుతుంది. చేపలను కూడా ముక్కలుగా కోసి, కడిగేసరికి అంతే టైం పడుతుంది. కానీ డెలివరీ బాయ్స్ మాత్రం ఆర్డర్ చేసిన పది నిమిషాల్లోనే ఇంటి ముందుకు వాలిపోతున్నారు. Health Report Says Do Not Buy Online Meat.
రోజుల తరబడి నిల్వ చేసిన మాంసం, చేపలు, రొయ్యలు తాజాగా కనిపించేందుకు సోడియం నైట్రేట్ తరహా రసాయనాలను కలుపుతారు. వీటివల్ల మాంసం అప్పుడే కోసిన దానిలా లైట్ పింక్ కలర్‌లో ఉండి ఫ్రెష్ గా ఉన్నట్లు కనిపిస్తుంది. కానీ సోడియం నైట్రేట్ అనేది మాంసం లోపలికి చేరి.. తిన్నవారి శరీరంలోకి ప్రవేశిస్తుంది. ఇలా ప్రాసెస్ చేసిన మాంసం అనేక క్యాన్సర్లకు కారణమవుతుందని డబ్ల్యూహెచ్‌వో ఎన్నోసార్లు హెచ్చరించింది.
ఈ రసాయనాలు కలిపిన మాంసాన్ని రెగ్యులర్ గా, ఎక్కువగా తీసుకుంటే మాత్రం పేగు, జీర్ణాశయ క్యాన్సర్లు వస్తాయి. నరాలు, కిడ్నీల పనితీరును బాగా ఎఫెక్ట్ చేస్తాయి. జెనెటిక్ వ్యాధులు.. కొత్తగా పెళ్ళైన మహిళల్లో ఈ రసాయనాలు గర్భ నిరోధకాలుగా మారతాయి. అంతేకాదు గర్భందాల్చివారిలో గర్భ స్రావానికి దారితీస్తున్నాయి. అదేవిధంగా చిన్నపిల్లల్లో మెంటల్ అండ్ ఫిజికల్ హెల్త్ పై ఎఫెక్ట్ చూపిస్తాయి. వీటన్నింటి నుంచి తప్పించుకోవాలంటే దుకాణాల్లో అప్పుడే తాజాగా దొరికే మాంసాన్నే కొనుగోలు చేసి, బాగా ఉడికించి తినాలని హెల్త్ నిపుణులు చెబుతున్నారు.