రోజంతా రిఫ్రెష్ గా ఉండేందుకు ఒక స్పూన్ కొబ్బరినూనె తీసుకోండి..!

Coconut Oil To Stay Refresh: భారతదేశంలో కొబ్బరినూనె అంటే తెలియని వారుండరు. ఈ నూనెను చాలామంది తలకు పెట్టుకుంటారు. వాస్తవానికి కొబ్బరి చెట్టును కల్పవృక్షం లాంటిదని ఆయుర్వేద నిపుణులు చెబుతుంటారు. కొబ్బరి చెట్టు నుంచి లభించే ప్రతి భాగం ఎంతో విలువైనది. అందులో ఒకటి కొబ్బరి నూనె. కొబ్బరి నూనెను ఎన్నో విధాలుగా ఉపయోగిస్తారు. ఇందులోని మెగ్నీషియం, విటమిన్ సి, ఇ, పొటాషియం, యాంటీమైక్రోబయల్‌ గుణాలు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి.

  • కొబ్బరినూనెలోని లారిక్ యాసిడ్ గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
  • జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. అయితే చాలా తక్కువ మొత్తంలో వంటలోనూ వాడతారు. ఇది జీర్ణక్రియకు ప్రయోజనకరంగా ఉంటుందా లేదా అనే విషయంపై కొన్ని సందేహాలు కామన్ గా ఉంటాయి. నిజానికి Coconut Oil To Stay Refresh.
  • కొబ్బరినూనెలో దాదాపు 90 శాతం కొవ్వు ఉంటుంది. ఇది నెయ్యి, వెన్న కంటే ఎక్కువ. ఇందులో ఉన్నది చెడు కొలస్ట్రాల్ అయితే రెగ్యులర్ గా కొబ్బరినూనెను ఆహారంలో భాగం చేసినట్లయితే ఇది ధమనుల్లో చేరి ఒక్కోసారి గుండె సమస్యలకు కారణమవుతుంది. కాబట్టి పరిమితంగా తీసుకోవడం మంచిది. కుటుంబపరంగా గుండె జబ్బులు, అధిక రక్తపోటు లేదా అధిక కొలెస్ట్రాల్ ఉన్నవారు కొబ్బరినూనెను ఆహారంలో భాగం చేసుకోకపోవడమే ఉత్తమం. దీనికి బదులు పల్లీ, సన్‌ఫ్లవర్, ఆలివ్ నూనె వంటి వాటిని వాడుకోవచ్చు. అది వైద్యుని సలహాతో దీనిని తీసుకోవడం మంచిది.
  • కొబ్బరి నూనె అనేది ఒక సహజమైన నూనె. దీన్ని అందం, ఆరోగ్యం అలానే వంటల్లోనూ కొన్ని శతాబ్దాలుగా ఉపయోగిస్తున్నారు. తూర్పు దేశాల్లో ఇది చాలా ప్రాచుర్యం పొందింది.
  • ప్రతిరోజు ఒక స్పూన్ కొబ్బరి నూనె తాగడం వల్ల రోజంతా రిఫ్రెష్‌గా ఉంటారు.
  • ఉదయం తాగడం వల్ల శరీరం దృఢంగా, బలంగా తయారవుతుంది.
  • కొబ్బరి నూనెలో ఉండే మధ్యస్థ గొలుసు కొవ్వు ఆమ్లాలు (MCTs) శరీరంలోని కొవ్వును తగ్గించి, జీవక్రియ రేటును పెంచడానికి సాయపడతాయి. *ఇది జీర్ణశక్తిని పెంచి, మలబద్ధకం, అజీర్ణం వంటి సమస్యలను తగ్గిస్తుంది.
  • అంతేకాకుండా ఇది చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో, మంచి కొలెస్ట్రాల్‌ను పెంచడంలో హెల్ప్ చేస్తుంది.
  • కొబ్బరి నూనె మెదడు ఆరోగ్యానికి కూడా మంచిది. ఇది అల్జీమర్స్ వ్యాధి వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
  • చర్మ సంరక్షణకు మాయిశ్చరైజర్‌గా యూస్ అవుతుంది.
  • శరీరానికి మసాజ్ చేసేందుకు ఈ నూనెను వాడవచ్చు.
  • కొబ్బరి నూనె జుట్టుకు మంచి హెయిర్ మాస్క్. ఇది అందరికీ తెలిసిందే.

Also Read: https://www.mega9tv.com/life-style/seasonal-fruits-are-good-but-you-dont-want-them-during-the-rainy-season-checkout-what-they-are/