
PCOD and PCOS: PCOD లేదా PCOS అనే సమస్య ఇప్పుడు చాలా మంది అమ్మాయిల్లో కామన్ గా కనిపిస్తోంది. ఇది ఉన్నవారిలో పీరియడ్ సైకిల్ తేడాగా ఉంటుంది. కొన్ని నెలలు వచ్చే అవకాశం ఉంటుంది. కొన్ని నెలలు రాకపోవచ్చు. కొందరికి ముఖం మీద అన్ వాంటెడ్ హెయిర్ ఎక్కువగా రావడం, బరువు పెరగడం, మొటిమలు రావడం కూడా జరుగుతుంది.
ఇది శరీరంలో హార్మోన్ ల అసమతుల్యతకు కారణమవుతుంది. దీనివల్ల గర్భం దాల్చడంలో కూడా కొన్ని ఇబ్బందులు ఏర్పడతాయి. సాధారణంగా అమ్మాయిల్లో నెలకోసారి అండం విడుదలవుతుంది. ఆ ప్రక్రియ సరిగ్గా జరగకపోతే గర్భధారణ అనేది కుదరదు. PCOD and PCOS.
ఇవే PCOD / PCOS లో జరుగుతున్న మార్పులు,
ఈ సమస్య ఎందుకు వస్తుందన్న దానికి స్పష్టమైన కారణం ఇదని చెప్పలేం. కొందరికి జెనెటికల్ గా, మరికొందరికి జీవనశైలి కారణమై ఉండొచ్చు. రోజంతా కూర్చొని ఉండటం, ఫిజికల్ యాక్టివిటీ సరిగా లేకపోవడం, టైమ్‌కి నిద్రపోకపోవడం, ఆహారపు అలవాట్లు సరిగ్గా లేకపోవడం వంటివి ఇతర కారణాలు.
అయితే ఇది చికిత్సతో నయం అవుతుందా అంటే, పూర్తిగా అవునని చెప్పలేం కానీ నియంత్రణకు వీలుంది. డైలీ రొటీన్ కొంతసేపు నడక, తక్కువ నూనె, తక్కువ తీపి ఉన్న ఆహారం, స్ట్రెస్ తగ్గించుకోవడం, నిద్ర పక్కాగా ఉండడం లాంటివి పాటిస్తే గనుక డిఫరెన్స్ చూడొచ్చు.
ముఖ్యంగా బరువు కంట్రోల్ అవ్వాలి. అలా తగ్గినప్పుడు పీరియడ్స్ కూడా రెగ్యులర్ గా వస్తాయి. కొన్ని సందర్భాల్లో వైద్యులు మెడిసిన్ సజెస్ట్ చేస్తారు. అవి హార్మోన్ ఇంబాలెన్స్ అవ్వకుండా.. పీరియడ్స్ క్రమబద్ధంగా రావడానికి ఉపయోగపడతాయి. అవసరమైతే స్కాన్‌లు, బ్లడ్ టెస్టులు కూడా చేయవచ్చు.