ఆడవాళ్లు 30 ఏళ్ల తర్వాత తప్పనిసరి చేయించుకోవాల్సిన టెస్టులివే!

మహిళల ఆరోగ్యం ఎప్పుడూ మార్పులకు లోనవుతూ ఉంటుంది. ఒక్కొక్క దశ దాటేకొద్దీ వారికి ఆరోగ్యపరంగా ఎన్నో సవాళ్లు ఎదురవుతుంటాయి. అయితే వీటిని అధిగమించి ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపాలంటే మాత్రం కాస్త ప్రత్యేక శ్రద్ధ, హెల్త్ చెకప్స్ వంటివి అనుసరించడం మేలని హెల్త్ ఎక్సపెర్ట్స్ చెబుతున్నారు.
ముఖ్యంగా మహిళలు 30ఏళ్లు దాటిన తరువాత కొన్ని టెస్టులు తప్పనిసరిగా చేయించుకోవాలి. దీనివల్ల వారికి భవిష్యత్తులో కొన్ని క్రానిక్ ఇష్యూస్ రాకుండా కాపాడడంలో తోడ్పడుతుంది. ఇంతకీ ఆ టెస్టులేంటంటే..

  • 30ఏళ్ల తరువాత నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్, ఫ్యాటీ లివర్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ కారణంగా హెపటైటిస్ సి, బి వంటి లివర్ టెస్టులు తప్పకుండా చేయించుకోవాలి.
  • చాలామంది తమకు ఏదైనా దృష్టిలోపం ఉంటేనో, కళ్లజోడు వాడుతుంటేనో లేదంటే కంటికి సంబంధించిన ఏవైనా ఇతర సమస్యలు వచ్చినప్పుడు మాత్రమే కంటి పరీక్ష చేయించుకుంటారు. కానీ 2ఏళ్లకోసారి కంటి పరీక్ష చేయించుకోవడం మేలు.
  • 30+ ఆర్ బిలో 30లో థైరాయిడ్ ఎటాక్ అయ్యే ప్రమాదం ఎక్కువ. దీని కారణంగానే చాలామంది బరువు పెరగడం, తగ్గడం, చర్మం పొడిబారిపోవడం, గోళ్లు పెళుసుగా మారడం వంటి సమస్యల బారిన పడుతుంటారు. దీనికితోడు నిద్రలేమి, గుండె దడ వంటివి వస్తాయి.
  • మగవారితో పోలిస్తే మహిళలలో బోన్ డెనిసిటీ తక్కువగా ఉంటుంది. అందువల్ల ఎముకలు, కీళ్ల సమస్యలు కూడా ఎక్కువగా వస్తాయి. పైపెచ్చు బోలు ఎముకల వ్యాధి కూడా మహిళలలోనే ఎక్కువ. గర్భం దాల్చడం, ప్రసవం సమయంలో ఎముకలు మరింత బలహీనంగా మారతాయి. అందువల్ల ఈ బోన్ టెస్ట్ తప్పనిసరి.
  • ఈసీజీని ఎలక్ట్రో కార్డియోగ్రామ్ టెస్ట్ అని అంటారు. కుటుంబంలో ఎవరికి గుండెజబ్బు లేనప్పుడు 35 ఏళ్ల తరువాత ఈ టెస్ట్ చేయించుకోమని సజెస్ట్ చేస్తారు. దీనివల్ల గుండె జబ్బుల ప్రమాదాన్ని ముందే తెలుసుకోని నివారించవచ్చు. దీన్ని ఇయర్లీ వన్స్4 చేయించుకుంటే మంచిది.
  • కంప్లీట్ బ్లడ్ కౌంట్, ఎలివేటెడ్ సీరమ్ క్రియాటినిన్ టెస్ట్, పెల్విక్ టెస్ట్, బ్రెస్ట్ క్యాన్సర్ డయాగ్నోసిస్ టెస్ట్, STI వంటివి చేయించుకోవడం ద్వారా మహిళలు దీర్ఘకాలం ఆరోగ్యంగా ఉండవచ్చు.