ఒలంపిక్ విశేషాలు మీకు తెలుసా..?!

మొదటి విజేతకు బంగారం,
రెండవ విజేతకు రజతం,
మూడవ విజేతకు కాంస్యం..

Special Features of Olympics: మెడల్ ఏదైనా… క్రీడలకు ఒలంపిక్స్ అనేది అత్యున్నతం. కేవలం ఆడేవాళ్ళకే కాదు చూసేవాళ్ళకు కూడా కన్నుల పండుగలా ఉంటుంది. మన వాళ్లు బాగా ఆడాలని బంగారు పతకాలు తేవాలని కోరుకొని అభిమానులుండరు. జీవితంలో ఒక్కసారైనా ఒలంపిక్స్ బరిలో నిలవాలని, పుట్టిన నేలకు పేరు తేవాలని తపించని క్రీడాకారులుండరు. అందుకు ఎన్నో ఏళ్ళ శ్రమ, కృషి, పట్టుదలే మెట్టుగా నిలుస్తాయి.

మొదటిసారిగా ఒలంపిక్స్ క్రీడలు సంప్రదాయ పద్ధతిలో క్రీ.పూ. 776లో గ్రీస్ లో మొదలయ్యాయి. ప్రతి నాలుగు లేదా రెండేళ్లకోసారి వేసవికాలంలో జరిగేవి. అప్పట్లో కేవలం మగవాళ్లు మాత్రమే పాల్గొనేవాళ్లు. కుస్తీ, బాక్సింగ్, గుర్రాల రేసింగ్, పంక్రేషన్, రెజ్లింగ్ ప్రముఖమైన, ప్రాణాంతకమైనవి ఉండేవి. ఈ ఆటల వల్ల ఎంతోమంది ప్రాణాలు కోల్పోవడంతో రోమన్ చక్రవర్తి థియోడోసియస్ 394లో ఈ ఆటలను రద్దు చేశారు. అప్పట్లో గెలిచిన విజేతలకు అతి మాములు బహుమతులుగా ఆలివ్ ఆకుల దండలను, కిరీటాలను ఇచ్చేవారు.

1892లో ఫ్రెంచ్ యువరాజు పియర్ డి కూబెర్టిన్ ప్రతి నాలుగు సంవత్సరాలకోసారి అంతర్జాతీయ స్థాయిలో ఒలంపిక్స్‌ను ప్రముఖంగా నిర్వహించాలనుకున్నాడు. ఆ తర్వాత జరిగిన అంతర్జాతీయ క్రీడా సమావేశంలో ఒలంపిక్స్ ను అంతర్జాతీయ ఒలంపిక్ కమిటీ(ఐఓసి)గా ఏర్పాటు చేశారు. పియర్ డి కూబెర్టిన్ 1896లో ఐఓసికి ప్రథమ అధ్యక్షుడయ్యాడు. గ్రీస్ రాజధాని అయిన ఏథెన్స్ లో 14 దేశాలకు చెందిన 250మంది 42 ఈవెంట్లలో పాల్గొన్నారు. అవి ట్రాక్ అండ్ ఫీల్డ్, స్విమ్మింగ్, జిమ్నాస్టిక్స్, సైక్లింగ్, రెజ్లింగ్, వెయిట్ లిఫ్టింగ్, ఫెన్సింగ్, షూటింగ్గ్, టెన్నిస్‌ క్రీడలు మొదలైనవి. పోటీదారులంతా పురుషులే! అలాగే ఈ ఈవెంట్లలో తొమ్మిదింటిని అమెరికన్ లే గెలుచుకున్నారు. Special Features of Olympics.

1896లో ఒలంపిక్స్‌లో మొదటి మారథాన్ పోటీలో గ్రీక్ కు చెందిన స్పైరిడాన్ లూయిస్ గెలిచాడు. కానీ ఆ తర్వాత అధ్యక్షుడు ఎన్నో మార్గనిర్దేశాలు చేసినా, ప్రజాదరణ లేకపోవడంతో అంతటితో మూసివేశారు.

ఒలంపిక్ పరిగణలోకి వచ్చే ఆటలు:
విలువిద్య, కళాత్మక ఈత, వ్యాయామ క్రీడలు, బ్యాడ్మింటన్, బేస్ బాల్, బాస్కెట్‌బాల్, బాక్సింగ్, కానోయింగ్ సైక్లింగ్, డైవింగ్, ఈక్వెస్ట్రియన్ ఫీల్డ్ హాకీ ఫెన్సింగ్, ఫుట్‌బాల్, జిమ్నాస్టిక్స్, గోల్ఫ్, హ్యాండ్‌బాల్, జూడో కరాటే ఆధునిక పెంటాథ్లాన్ రోయింగ్ రగ్బీ, సెవెన్స్ సెయిలింగ్, షూటింగ్, స్కేట్ బోర్డింగ్, సాఫ్ట్‌బాల్ సర్ఫింగ్, ఈత టేబుల్ టెన్నిస్, టైక్వాండో టెన్నిస్, ట్రయాథ్లాన్, వాలీబాల్, నీటి పోలో, బరువులెత్తడం, కుస్తీ.

విశేషాలు:

  • ప్రపంచంలో మొట్టమొదటి పెద్ద స్టేడియం పనాథినైకో స్టేడియం. ఒక క్రీడా కార్యక్రమాన్ని చూడటానికి ఇప్పటివరకు అధిక సంఖ్యలో ప్రేక్షకులతో ఈ స్టేడియం నిండిపోయింది.
  • ప్రతి వింటర్ ఒలింపిక్ క్రీడలలో బంగారు పతకం సాధించిన ఏకైక దేశం యునైటెడ్ స్టేట్స్. ఆల్ టైమ్ ఒలంపిక్ రికార్డ్ దీని సొంతం.
  • మొదటి ఒలంపిక్ ముగిసే రోజు ఆరు వేలమంది పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు.
  • ఏథెన్స్ ఆటలలో అతి పిన్న వయస్కుడైన అథ్లెట్ డిమిట్రియోస్ లౌండ్రాస్ కేవలం 10 సంవత్సరాల 218 రోజుల వయసులో జట్టు సమాంతర బార్ల ఈవెంట్‌లో పాల్గొన్న క్రీడాకారుడు కాగా ఈరోజువరకు, ఒలింపిక్ చరిత్రలో అతి పిన్న వయస్కుడిగా లౌండ్రాస్ నిలిచాడు.
  • భారత్ తరపున 2000లో సిడ్నీ ఒలంపిక్స్ లో వెయిట్ లిఫ్టింగ్ మహిళా విభాగంలో కరణం మల్లీశ్వరి కాంస్యం గెలించింది.

ఒలంపిక్స్ జరిగాయిలా:

  • 1896లో గ్రీస్ లోని ఏథెన్స్ లో మొట్టమొదటి ఆధునిక సమ్మర్ ఒలంపిక్స్ మొదలయ్యాయి.
  • 1924లో ఫ్రాన్స్‌లోని చామోనిక్స్ లో జరిగాయి.
  • వింటర్ ఒలింపిక్ క్రీడలను మూడు ఖండాలలో పన్నెండు దేశాలు నిర్వహిస్తున్నాయి.
  • యునైటెడ్ స్టేట్స్ లో నాలుగుసార్లు
  • (వరుసగా 1932, 1960, 1980, 2002),
  • ఫ్రాన్స్‌లో మూడుసార్లు
  • (1924, 1968, 1992),
  • ఆస్ట్రియా (1964, 1976),
  • కెనడా (1988, 2010)లో కాగా,
  • జపాన్ (1972, 1998),
  • ఇటలీ (1956, 2006),
  • నార్వే (1952, 1994),
  • స్విట్జర్లాండ్ (1928, 1948)లో జరిగాయి.
  • అలాగే, వింటర్ ఒలంపిక్ క్రీడలు జర్మనీ (1936), యుగోస్లేవియా (1984), రష్యా (2014), దక్షిణ కొరియా (2018)లలో ఒక్కోసారి మాత్రమే జరిగాయి.
  • 2022, 2026 వింటర్ ఒలంపిక్స్ కు ఆతిథ్యం ఇవ్వడానికి ఇటలీ నగరం, చైనాలోని బీజింగ్‌ను ఎంపిక చేసింది.
  • 2024 ఒలంపిక్స్ పారిస్ లో జరగగా.. వంద సంవత్సరాల క్రితం 1924లో జరిగాక ఇది రెండోసారి.
  • ఒలంపిక్ జరిగిన దేశాలు సైతం
  • 2020 సమ్మర్ ఒలంపిక్స్‌కు ఆతిథ్యం ఇవ్వడానికి ఐఓసి నిర్ణయించింది.
  • కరోనా మహమ్మారి కారణంగా వాయిదా పడిన విశ్వ క్రీడలు 2021, జులై 23 నుంచి టోక్యోలో ప్రారంభం కానున్నాయి. 11వేల మంది అథ్లెట్లు ఈ మెగా క్రీడల్లో పాల్గొననున్నారు.
  • 2024 పారిస్ ఒలంపిక్స్ లో 124 ఏళ్ల రికార్డును తిరగరాస్తూ.. 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ వ్యక్తిగత, మిక్స్‌డ్ టీమ్ విభాగాల్లో పతకాలను సొంతం చేసుకొని భారత్‌కు మరచిపోలేని విజయాన్ని అందించింది మను బాకర్. స్వప్నిల్ కుశాల్ షూటింగ్ లో మెడల్, నీరజ్ చోప్రా జావలిన్ త్రోలో సిల్వర్ మెడల్, అమన్ సెహ్రవత్ వ్రెస్టిలింగ్ లో బ్రాంజ్ మెడల్ ఇలా మొత్తం ఆరు పతకాలను సాధించింది.
  • తర్వాత జరగనున్న ఒలంపిక్స్.. ఇటలీలో 2026 వింటర్ ఒలింపిక్స్, యునైటెడ్ స్టేట్స్ లో 2028 సమ్మర్ ఒలంపిక్స్ జరగనున్నాయి.

Also Read: https://www.mega9tv.com/sports/yograjsingh-and-dhoni-controversy-captain-cool-has-influenced-yuvrajs-career/