యూజర్ ఎక్సపీరియన్స్ ను మెరుగుపరిచే విధంగా వాట్సాప్ కొత్త ఫీచర్!

వాట్సాప్ తన యూజర్స్ అనుభవాన్ని మరింత బెటర్ చేసేందుకు కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. ఈ ఫీచర్ ద్వారా వినియోగదారులు తమ ఖాతాను తాత్కాలికంగా లాగ్ అవుట్ చేసేందుకు వీలు కల్పిస్తుంది. అదే సమయంలో వారు డేటా నష్టపోకుండా వినియోగించుకోగలిగే సౌలభ్యాన్ని తీసుకొచ్చింది.

టెక్నాలజీ రోజురోజుకూ కొత్త పుంతలు తొక్కుతుంది. ఇదే సమయంలో వినియోగదారుల అవసరాలు కూడా అంతే వేగంగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలో వాట్సాప్ ఎప్పటికప్పుడు వినియోగదారుల అనుభవాన్ని మరింత మెరుగుపరిచేందుకు కొత్త కొత్త ఫీచర్లను తీసుకొస్తుంది. ఇక ఈ ఫీచర్ ద్వారా వినియోగదారులు డేటా కోల్పోకుండా తమ ఖాతాను తాత్కాలికంగా లాగ్ అవుట్ చేసుకోవచ్చు. ఇందుకు సంబంధించి వినియోగదారుల గోప్యత, నియంత్రణకు ప్రాధాన్యతనిస్తూ వాట్సాప్ తీసుకున్న ఈ నిర్ణయం మెసేజింగ్ అనుభవంలో కీలకపాత్ర పోషిస్తుంది.

ప్రస్తుతం, వినియోగదారులు తమ వాట్సాప్ ఖాతాను లాగ్ అవుట్ చేయాలంటే యాప్‌ను అన్ ఇన్‌స్టాల్ చేయాలి లేదా ఖాతాను పూర్తిగా డిలీట్ చేయాలి. దీనివల్ల మీ డేటా నష్టం లేదా బ్యాకప్ కోల్పోయి.. అనేక ఇబ్బందులను ఎదుర్కొవాల్సి వస్తుంది. కానీ ఈ కొత్త ఫీచర్ ద్వారా, వినియోగదారులు రెండు ఆప్షన్లలో ఒకదాన్ని ఎంచుకోవచ్చు. డేటా ప్రిఫరెన్సెస్ తొలగింపు ఆప్షన్ ద్వారా మీ యాప్ డేటా, సెట్టింగ్స్ ను పూర్తిగా తొలగించబడతాయి. డేటా ప్రిఫరెన్సెస్ స్టోరేజ్ ఆప్షన్ ద్వారా మీ అకౌంట్ లాగ్ అవుట్ అయినప్పటికీ, మీ చాటింగ్, గ్రూపులు, మీడియా స్టోరేజ్ అలాగే ఉంటుంది. దీంతో మీకు ఫర్దర్ గా ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఈ ఫీచర్ ప్రధానంగా వాట్సాప్‌ను అనేక పరికరాల్లో ఉపయోగించేవారికి ఎఫిషియంట్ గా యూస్ అవుతుందన్నమాట.