
భర్తకు ఎమ్మెల్సీ పదవి అమెకు పదవీ గండాన్ని తెచ్చిపెడుతుందా.? ఒకే ఇంట్లో రెండు పదవులు సబబేనా..? ఆ జిల్లా బీజేపీలో వర్గపోరుకు అసలు కారణాలేంటి .? అధ్యక్షుడి పోస్టుపై కన్నేసిందెవరు.. ? ఏకపక్షంగా పార్టీ పదవులు పంచడమే ఆమె చేసిన పోరపాటా..? కమిటీల అధ్యక్షుల నియామకాల్లోనూ పైరవీలకు పెద్దపీట వేశారన్న అరోపణలు అమెను ఉక్కిరిబిక్కిరి చెస్తున్నాయా? సీనియర్ల అంటేనే ఆమెకు గిట్టడంలేదా ? సంగారెడ్డి బిజెపి లో అసలేంజరుగుతుంది ? లెట్స్ వాచ్ దిస్ ఆఫ్ ది రికార్డ్.
కరీంనగర్ పట్టబద్రుల ఎమ్మెల్సీగా అంజిరెడ్డి కొత్తగా తన బాధ్యతలను చేపట్టారు. . బిజెపి సంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలైన గోదావరి తన భర్త గేలుపు కోసం తీవ్రంగా శ్రమించారు .ఇప్పుడు ఆయన గేలుపే ఆమెకు పదవిగండంగా మారిందన్న టాక్ ఉపందుకుంది.గతంలో అమె చెసిన తప్పులే ఇప్పుడు ఆమె వ్యతిరేఖ వర్గానికి కలిసోచ్చే అంశాలుగా మారాయట. సంవత్సరం క్రితం జిల్లా అధ్యక్షురాలిగా నియామకమైన గోదావరి వ్యవహార శైలి జిల్లా పార్టీ సీనియర్లకు నచ్చడంలేదట. అధ్యక్షురాలి నిర్ణయాలన్నీ ఏక పక్షంగా ఉన్నాయన్నది సీనియర్ల వాదనగా తెలుస్తోంది. పార్టీ కోసం పనిచేసిన వారిని కలుపుకుపోకుండా.. తన దగ్గరి వారికే ప్రాముఖ్యత నిస్తున్నారంట. అంతటితో అగకుండా సొంతంగానే నిర్ణయాలు తీసుకుంటున్నారన్నవిమర్శలు బిజేపి క్యాడర్ లో వినిపిస్తున్నాయి.
రాష్ట్ర నాయకత్వం పిలుపునిచ్చిన కార్యక్రమాల్లోనూ ఆమె పాల్గొనడం లేదన్నది టాక్ .ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలు, నిరసన కార్యక్రమాల్లో అధ్యక్షురాలు పాల్గొనడం లేదని కొందరు నాయకుల బాహటంగానే విమర్శిస్తున్నారంట. జిల్లాలో 16 మండలాలకు అధ్యక్షులను ప్రకటిస్తే … అధ్యక్షుల నియామకాల్లో సీనియారిటీని పరిగణలోకి తీసుకోకుండ పార్టీ కోసం పనిచేసిన వారిని పట్టించుకోలేదని కొంతమంది కార్యకర్తలు గోదావరి పైన గుర్రుగా ఉన్నారు.ఇటీవల జిల్లా పార్టీ కార్యాలయం ముందు ఆందోళనకు దిగి తమ గోడును సైతం బహిర్గతం చెసుకున్నారు. జిల్లా అధ్యక్షురాలు లేని సమయంలో పార్టీ కార్యాలయానికి ఎందుకొచ్చారని అక్కడున్న ఆఫీస్ ఇన్ చార్జి కార్యకర్తలతో వాగ్వాదానికి దిగడంతో అది కాస్త గోదావరిని మరింత ఇరుకున పెట్టేసినట్లయింది.
పార్టీ కోసం పనిచేస్తున్న వారిని పక్కనబెట్టి జిల్లా అధ్యక్షురాలు పైరవీలు, వారసత్వ రాజకీయాలు చేస్తున్న వారికి అధిక ప్రాధాన్యత నిస్తున్నారంట. కంది మండలం అధ్యక్షుడిగా పోచారం గిరిధర్ ను ప్రకటించడాన్ని జీర్ణించుకోలేని కొంతమంది కార్యకర్తలు.. సిద్దాంతాలకు కట్టుబడి ఉండే పార్టీలో.. ఇదేం పోకడ అంటూ అధ్యక్షురాలి తీరును నిలదీస్తున్నారు. ఇక అందోల్ నియోజక వర్గ పరిధిలోని అల్లాదుర్గం మండల అధ్యక్షుడిగా రాజశేఖర్ రెడ్డి ని నియమించడాన్ని స్థానిక కార్యకర్తలు తీవ్రంగా ఖండించారు. స్థానికంగా అందుబాటులో ఉండని వ్యక్తికి అధ్యక్ష పదవి ఎలా కట్టబెడతారని ప్రశ్నించారు. తమ మండలం మెదక్ జిల్లా పరిధిలోనిదే అయినా.. రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు సంగారెడ్డి జిల్లా పరిధిలో పనిచేస్తుంటే.. ఇదేం వింత పోకడ అంటూ అధ్యక్షురాలి వ్యవహార శైలిని తప్పుబట్టారు..
ఇక గతంలో బీజేపీ జిల్లా అధ్యక్షులుగా పనిచేసిన వారు.. సీనియర్లు కూడా కొంత కాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. నాలుగైదు పార్టీలు మారిన వారికి జిల్లా పగ్గాలు అప్పగిస్తే.. ఇలాగే ఉంటుందని ఓ సీనియర్ నేత విమర్శలు కూడా చేసారు. సీనియర్లను పట్టించుకోకుండా.. కార్యకర్తలకు అందుబాటులో ఉండని వారికి పెద్ద పీట వేస్తే ఎలా అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. ఇదిలా ఉంటే ఒకే ఇంట్లో ఇద్దరు నేతలకు పదవులు ఎందుకని ఇంకొందరు బాహాటంగానే విమర్శించడం జిల్లా రాజకీయాల్లో చర్చనీయంశమైంది. గతంలో యాక్టివ్ గా పనిచేసిన బీజేవైఎం, ఇతర అనుబంధ సంఘాల నేతలు కూడా కొన్నాళ్లుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండటం గోదావరి ప్రవర్తనే కారణమని కొంతమంది కార్యకర్తలు గుస గుస లాడుకుంటున్నారు.
మండల అధ్యక్షుల ప్రకటనలో ఏ ఏ అంశాలకు ప్రాధాన్యత ఇచ్చారు.. అధ్యక్షులుగా ఎన్నికైన వారిలో అర్హులు ఎంతమంది అనే దానిపై రాష్ట్ర నాయకత్వం కూడా దృష్టి సారించినట్లుగా తెలిసింది. మండలాల అధ్యక్షుల నియామకంపై జరిగిన రచ్చ గురించి రాష్ట్ర నాయకత్వం అంతర్గత విచారణ కూడా ఆదేశించినట్లుగా జిల్లాలో టాక్ వినిపిస్తుంది. వి విఐపి నేతలతో పోటోలు దిగెందుకు చూపిస్తున్న అసక్తి పార్టీని పార్టీ క్యాడర్ ను బలోపేతం చెయ్యడం పై పెట్టలని సినియర్లు బావిస్తున్నారట. ఏదేమైనా సంగారెడ్డి బిజెపిలో అధ్యక్షురాలి తీరు .. నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేసే కార్యకర్తలను ఆవేదనకు గురిచేస్తోంది.. మరి ఈ వ్యవహారాన్ని రాష్ట్ర బిజెపి నాయకత్వం ఏవిధంగా చక్కదిద్దుతుందో చూడాలి.