విశ్వంభర రిలీజ్ అప్పుడేనా..?

Vishwambhara Graphics Delay: మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న భారీ సోషియో ఫాంటసీ మూవీ విశ్వంభర. ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేసినప్పుడు చాలా ఫాస్ట్ గా కంప్లీట్ అవుతుంది.. అనుకున్న టైమ్ కి థియేటర్స్ లోకి వస్తుంది అనుకున్నారు సినీ జనాలు, అభిమానులు. అయితే.. సంక్రాంతికి రిలీజ్ కాలేదు.. ఎప్పుడు వస్తుందో క్లారిటీ లేదు. తాజాగా విశ్వంభర అసలు ఈ ఏడాదిలో రావడం సాధ్యమేనా..? వస్తుందా..? లేదా..? అనేది హాట్ టాపిక్ అయ్యింది. అనిల్ రావిపూడితో చేస్తోన్న మూవీ అనుకున్న ప్లాన్ ప్రకారం జరుగుతుంది కానీ.. విశ్వంభర రిలీజ్ మాత్రం సస్పెన్స్ గా మారింది. విశ్వంభర రిలీజ్ గురించి మేకర్స్ ప్లాన్ ఏంటి..?

ఆమధ్య విశ్వంభర సినిమాని జులైలో రిలీజ్ చేస్తారని ప్రచారం జరిగింది. ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేయడంతో జులైలో విశ్వంభర రావడం పక్కా అనుకున్నారు. అయితే.. ఫస్ట్ సింగిల్ తర్వాత మళ్లీ మేకర్స్ సైలెంట్ అయ్యారు కానీ.. ఎలాంటి అప్ డేట్ ఇవ్వలేదు. ఈ సినిమాకి సంబంధించి గ్రాఫిక్స్ వర్క్ ఇంకా కంప్లీట్ కాలేదట. అందుకనే రిలీజ్ డేట్ అనౌన్స్ చేయలేదు అనేది ఇండస్ట్రీ ఇన్ సైడ్ న్యూస్. ఇప్పటికే సంక్రాంతికి వస్తుందని పోస్ట్ పోన్ చేయడంతో ఈసారి అంతా పక్కాగా సెట్ అయిన తర్వాతే విడుదల తేదీ ప్రకటించాలి అనుకుంటున్నారని తెలిసింది.

అయితే.. జులై, ఆగష్టు దాటితే విశ్వంభరకు సమస్యలు తప్పవు. మేటర్ ఏంటంటే.. ఈ విశ్వంభర సినిమాని సెప్టెంబర్ లేదా అక్టోబర్ లో రిలీజ్ చేస్తే.. ప్రస్తుతం అనిల్ రావిపూడితో చేస్తున్న మూవీకి గ్యాప్ తగ్గిపోతుంది. విశ్వంభర మూవీని సంక్రాంతికి రిలీజ్ చేద్దామంటే.. ముందుగానే అనిల్ రావిపూడి సినిమాను సంక్రాంతికి విడుదల చేయాలని ఫిక్స్ అయ్యారు. అఫిషియల్ గా అనౌన్స్ చేశారు. పైగా అనిల్ రావిపూడి సంక్రాంతికి రిలీజ్ చేయాలని కండీషన్ పెట్టాడట. దీనికి చిరు కూడా ఓకే చెప్పారట. అందుచేత చిరు, అనిల్ రావిపూడి మూవీ సంక్రాంతికి రావడం పక్కా. అందులో ఎలాంటి డౌట్ లేదు. Vishwambhara Graphics Delay.

జులై నెలలో విశ్వంభర గ్రాపిక్స్ వర్క్ కంప్లీట్ అయితే.. రిలీజ్ డేట్ పై క్లారిటీ వస్తుంది. ఈ నెలలో రిలీజ్ డేట్ పై క్లారిటీ రాకపోతే.. ఈ సంవత్సరంలో విశ్వంభర రావడం కష్టమే అనే టాక్ ఇండస్ట్రీలో బలంగా వినిపిస్తోంది. ఈ సినిమా నుంచి గ్లింప్స్ రిలీజ్ చేసినప్పుడు గ్రాఫిక్స్ పై విమర్శలు రావడంతో మరింత కేర్ తీసుకుంటున్నారు. లేట్ అయినా ఫరవాలేదు.. క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ కావద్దు అని మెగాస్టార్ చెప్పడంతో మేకర్స్ రిలీజ్ డేట్ గురించి కన్నా.. క్వాలిటీ గురించే ఎక్కువ ఆలోచిస్తున్నారట. మరి.. ప్రచారంలో ఉన్నట్టుగా విశ్వంభర ఈ ఇయర్ లో రాకుండా నెక్ట్స్ ఇయర్ కి పోస్ట్ పోన్ అవుతుందా..? ఈ ఇయర్ లోనే వస్తుందా..? అనేది జులై ఎండింగ్ లోపు క్లారిటీ వస్తుందేమో చూడాలి.

Also Read: https://www.mega9tv.com/cinema/director-venky-atluri-suggested-five-stories-to-do-a-film-with-chaitu-but-he-rejected-all-of-them/